ఏపీలో రాజకీయాలన్నీ కులం చుట్టూనే తిరుగుతున్నాయి. కుల బలం ఆధారంగానే రాజకీయ పార్టీల బలాబలాలు అంచనా వేసే పరిస్థితి ఇప్పుడు నెలకొనడంతో, ఎవరికి ఎంత బలం పెరిగితే, వారికి తిరుగు ఉండదు అనే విధంగా రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయి. 2014 ఎన్నికల్లోనే కుల వ్యవహారాలు ఎన్నో జరిగాయి. చంద్రబాబు కాపులను మోసం చేశాడని పదే పదే ఆ సామాజికవర్గ నాయకులు ఆరోపణలు చేయడం వంటి వ్యవహారాలతో కాపులు ఆ పార్టీకి కాస్త దూరంగానే ఉన్నారు. దీంతో నష్టనివారణ చర్యలు తీసుకునేందుకు, చంద్రబాబు కాపులను ఆకట్టుకునేందుకు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు, ఎన్నో రకాలుగా వారికి తాయిలాలు ప్రకటించారు. వారిని ఆకట్టుకునేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నించారు. అయినా ఫలితం మాత్రం కనిపించలేదు. అయితే కాపులను చంద్రబాబు మోసం చేశారని, ముద్ర బలంగా ఆ సామజిక వర్గంలో వచ్చేయడంతో, ఆ సామాజిక వర్గం టిడిపికి దూరమైంది.


అలాగే బీసీలకు అన్యాయం చేసే విధంగా చంద్రబాబు కాపులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని బీసీ సామాజిక వర్గంలోనూ టిడిపిపై అసంతృప్తి పెరిగింది. దీంతో తెలుగుదేశం పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. జగన్ మాత్రం తాను అధికారంలోకి వస్తే, కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని చంద్రబాబు మాదిరిగా మోసం చేయలేను అంటూ ప్రకటించి సంచలనం సృష్టించారు. దీంతో ఒక్కసారిగా బీసీ సామాజిక వర్గం లో జగన్ పై ఆదరణ మరింతగా పెరిగింది. ఎప్పుడూ లేని విధంగా, బీసీ సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తూ జగన్ సంచలన నిర్ణయం తీసుకోవడంతోపాటు, 56 బీసీ కార్పొరేషన్ లు ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు.


 పార్టీలో కీలక పదవులు అన్నిటిని బిసి సామాజిక వర్గానికి జగన్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడంతో, బీసీల్లో జగన్ పై మరింత సానుకూలత పెరిగింది. ఇంకా బీసీలకు సంబంధించి అనేక విషయాల్లో జగన్ వారికి ప్రాధాన్యత ఇస్తుండడంతో, ఆ సామాజిక వర్గం మొత్తం ఇప్పుడు వైసీపీ వైపు నిలబడింది. దీంతో వారి అండ దండలు తమకు ఎక్కడ దూరం అవుతాయో అనే కంగారు పట్టుకున్న టిడిపి, పార్టీ కమిటీల నియామకంలో ఆ సామాజిక వర్గం వారికి పెద్దపీట వేశారు. అయినా, తమకు వెన్నుదన్నుగా ఉంటున్న బీసీలను జగన్ లాగేస్తున్నారని, కాపులు దూరమయ్యారని, ఎస్సీ ,ఎస్టీలు ఎలాగూ జగన్ వైపు ఉంటారని, ఇవన్నీ ఆయనకు కలిసి వస్తుండగా , తమకు ఇబ్బందికరంగా మారుతున్నాయి అనే భయం టిడిపి లో నెలకొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: