సంచైతా గజపతిరాజు వ్యవహారం వివాదాస్పదమవుతోంది. దశాబ్దాల పాటు పూసపాటి వంశస్తురాలిగా గుర్తింపుకోసం సంచైతా గజపతిరాజు చేసిన పోరాటాలు అందరికీ తెలిసిందే. ఏ స్ధాయిలో పోరాటం చేసినా తనకు అనుకున్నంత గుర్తింపురాలేదు. ఇటువంటి దశలో 2019 ఎన్నికల తర్వాత సీన్ మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అంటూ  మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్ గా నియమితురాలైంది. ఎప్పుడైతే ట్రస్టు ఛైర్మన్ గా ఉన్న అశోక్ గజపతిరాజు స్ధానంలో సంచైత బాధ్యతలు తీసుకున్నదో అప్పటి నుండి ఆమెకు  పూసపాటి వంశస్తురాలిగా గుర్తుంపు మొదలైంది. అంతకుముందే ఆమె పూసపాటి ఆనంద గజపతిరాజు కూతురుగా అందరికీ పరిచేయం ఉన్నా ఎటువంటి అధికారిక హోదాలో లేదు. ఎప్పుడైతే మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్ గా అపాయింట్ అయ్యారో అప్పటి నుండే ఆమె దశమారిపోయింది.




తాను కూడా పూసపాటి వంశస్తురాలినే అని, తన తండ్రి నుండి తన తల్లి విడాకులు తీసుకుని విడిపోయినా  తనకు పూసపాటి వంశంగా గుర్తింపు రావాలని నానా గోల చేసేది. అలాంటిది ఇపుడు సంచైత తాజాగా వ్యవహరించిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విజయనగరంలో ప్రతి ఏడాది పైడితల్లి అమ్మవారి  సిరిమానోత్సవం జరగుతుంది. ఈ ఉత్సవంలో పూసపాటి వారసులు పాల్గొనటం ఆనవాయితి. ట్రస్టు వారుసునిగా ఇన్ని సంవత్సరాల పాటు అశోక్ గజపతిరాజు అగ్రతాంబూలం అందుకునే వారు. ఇపుడు సంచైత వంతు వచ్చింది. ఇదే సమయంలో ఉమా గజపతిరాజుతో విడుకులు తీసుకున్న తర్వాత ఆనందగజపతిరాజు రెండో వివాహం చేసుకున్నారు.  ఆనంద్ చనిపోయిన తర్వాత భార్య సుధా గజపతిరాజు, కూతురు ఊర్మిళా గజపతిరాజు వైజాగ్, విజయనగరంలోనే ఉంటున్నారు.




ట్రస్టు ఛైర్మన్ గా తనను తొలగించిన కారణంగా అశోక్ గజపతిరాజు ఈ ఉత్సవానికి దూరంగా ఉన్నారు. ఇదే సమయంలో సిరిమానో ఉత్సవంలో పాల్గొనేందుకు వారసుల హోదాలో తల్లి, కూతుళ్ళకు పూర్తిహక్కులున్నాయి. ఈ హక్కులతోనే మంగళవారం  విజయనగరంలోని పూసపాటి కోటకు వచ్చారు. ఉత్సవాన్ని చూసేందుకని కోట పై భాగంలోని బురుజు దగ్గర కూర్చున్నారు. కాసేపటికి ఉత్సవాన్ని చూడటం కోసం సంచైత కూడా అక్కడికి చేరుకున్నారు. బురుజు పైకి చేరుకోగానే  తల్లీ, కూతుళ్ళిద్దరినీ చూశారు. వెంటనే ఆమెకు ఒళ్ళుమండిపోయిదట. అయితే వీళ్ళని ఏమనకుండానే  వీళ్ళముందే అక్కడే ఉన్న సిబ్బందిని నోటికొచ్చినట్లు తిట్టారట. ఏ హోదాలో సుధా, ఊర్మిళా గజపతిరాజులను బురుజుపై కూర్చోబెట్టరాంటూ అక్కడి సబ్బందిపై విరుచుకుపడ్డారట.  సంచైత తీరుచూసిన వాళ్ళందరు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.




సంచైత ఉద్దేశ్యం గమనించిన తల్లీ, కూతుళ్ళు తమ వల్ల అక్కడి సిబ్బందికి ఇబ్బందులు రావటం ఇష్టంలేక  అక్కడి నుండి బయటకు వచ్చేశారట. తర్వాత అక్కడ జరిగిన విషయాన్ని ఊర్మిళా గజపతిరాజు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టుచేశారు. దాంతో విషయం ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. ఎప్పుడైతే విషయం బయటకు వచ్చిందో అప్పటి నుండి సంచైత తీరుపై నెటిజన్లు మండిపోతున్నారు. ఇంతకాలం వారసత్వం గుర్తిపు కోసం సంచైత పోరాటం చేసిన విషయాన్ని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. తనలాగే సుధా, ఊర్మిళ కూడా పూసపాటి వారుసులనే విషయాన్ని సంచైత మరచిపోవటంపై మండిపడుతున్నారు. పూసపాటి వంశస్తురాలిగా తనకెంత హక్కులున్నాయో ఆనందగజపతిరాజు భార్య, కూతురికి కూడా అవే హక్కులుంటాయన్న విషయాన్ని సంచైత మరచిపోవటంపై నెటిజన్లు తూర్పారబడుతున్నారు.




ఇంతకాలం తనను తన బాబాయ్ అశోక్ గజపతిరాజు పూసపాటి వంశానికి దూరంగా పెడుతున్నారంటూ నానా గోల చేసిన సంచైత ఇపుడు తాను కూడా అదే దారిలో నడుస్తోంది. తనలాగ సవతి తల్లి, సోదరి కూడా పూసపాటివంశం వాళ్ళే అన్న విషయాన్ని అంగీకరించలేకపోతున్నారు. సుధా  గజపతిరాజు తన తండ్రి రెండో భార్యని, ఊర్మిళ కూడా తన తండ్రికి పుట్టిన కూతురే అన్న విషయాన్ని గుర్తించటానికి సంచైత ఇష్టపడటం లేదన్న విషయం అర్ధమైపోయింది. కాబట్టి ఇంతకాలం సంచైత విషయంలో అశోక్ గజపతిరాజు కుటుంబం చేసిన దాంట్లో ఎవరికీ అభ్యంతరం కనిపించటం లేదు. అశోక్ కుటుంబంపై సంచైత పోరాటం చేస్తున్నది కాబట్టి సవతి తల్లి సుధా, సోదరి ఊర్మిళను సంచైత దగ్గరకు తీసుకునుంటే జనాలందరు మెచ్చుకునే వాళ్ళు. కానీ సంచైత రివర్సులో వ్యవహరిచంటంతో అధికారిక హోదా దక్కగానే సంచైతలో ఎంతమార్పు వచ్చిందో చూసిన వారందరు ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: