ఒకవైపు రోజు వేలాది  కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నా స్ధానిక సంస్ధల ఎన్నికలు జరపాల్సిందే అంటూ తెలుగుదేశంపార్టీ పదే పదే డిమాండ్ చేస్తోంది. ఇదే ఆలోచనతో స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా మొన్ననే రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. నిజానికి మొన్నటి మార్చితో పోల్చుకుంటే కరోనా వైరస్ సమస్య ఎక్కువగా ఉన్నట్లే లెక్క. ఎలాగంటే మార్చిలో కరోనా వైరస్ కారణాన్ని చూపించి ఎన్నికలను వాయిదా వేసినప్పటికి రాష్ట్రంలో నమోదైన కేసులు మూడు కూడా లేవు. కానీ ఇపుడు రోజుకు సగటున 3 వేల కేసులు నమోదవుతున్నాయి.  నమోదవుతున్న కేసులు అందరికి స్పష్టంగా కనబడుతున్నా ఎన్నికలను నిర్వహించాలనే ఆలోచనలో నిమ్మగడ్డ+టీడీపీ ఉన్నాయంటే దానికి కారణాలు ఏమిటి ? అనేదే ముఖ్యమైన ప్రశ్న.




క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను చూస్తే ఎన్నికల నిర్వహణ తర్వాత మళ్ళీ ప్రభుత్వంపై బురద చల్లటమే చంద్రబాబునాయుడు, అచ్చెన్నాయుడు ముఖ్య ఉద్దేశ్యంగా కనబడుతోంది.  ఎందుకంటే కరోనా వైరస్ సమస్య బాగా తీవ్రంగా ఉన్న రోజుల్లో ప్రతిరోజు ఎల్లోమీడియా ద్వారా ప్రభుత్వంపై చంద్రబాబు, టీడీపీ నేతలు  ఎంతగా బురదచల్లించారో అందరికీ తెలిసిందే. అందుబాటులో ఉన్న సౌకర్యాలతో, నిధులతో జగన్మోహన్ రెడ్డి సర్కార్ వైరస్ వ్యాప్తించకుండా చర్యలు తీసుకుందని కేంద్రప్రభుత్వంతో పాటు బయట రాష్ట్రాలు అభినందించాయి. యుద్ధప్రాతిపదకిపై ఐసొలేషన్ వార్డులు, క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అదనంగా డబ్బులు చెల్లించి పీపీఇ కిట్లు, మాస్కులు తెప్పించింది. నూటికి నూరుశాతం వైద్య, ఆరోగ్య సిబ్బందికి పీపీఇ కిట్లు ఇప్పించలేకపోవచ్చు. కానీ కరోనా వైరస్ బాధితులకు వైద్యం అందించేవాళ్ళకు వీలున్నంతలో అవసరమైన రక్షణ సామగ్రిని అందించింది.




ఒకవైపు కరోనా వైరస్ వ్యాప్తని అరికట్టేందుకు ప్రభుత్వం నానా అవస్తలు పడుతుంటే మరోవైపు చంద్రబాబు, ఎల్లోమీడియా జగన్ను టార్గెట్ చేసుకుంటు ఎంత గోల చేశారో అందరు చూసిందే. ఇపుడు కూడా అలాంటిదే ప్లాన్ చేస్తున్నారనే అనుమానాలు జనాల్లో  పెరిగిపోతున్నాయి. స్ధానికసంస్ధల ఎన్నికలను నిర్వహించే ఉద్దేశ్యంతో నిమ్మగడ్డ ఉన్నారనే విషయం తెలిసిందే. ఇదే విషయమై నిమ్మగడ్డతో సమావేశమైనపుడు  చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని మాట్లాడుతు ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని తేల్చి చెప్పేశారు. రోజుకు సగటున 4 వేల కేసులు నమోదవుతున్న ఈ సమయంలో  ఎలక్షన్ పెట్టే అవకాశలు లేవని నీలం స్పష్టంగా చెప్పేశారు.




ఒకవేళ నిమ్మగడ్డ మాట మీద ప్రభుత్వం గనుక ఎన్నికలను నిర్వహిస్తే లక్షలాదిమంది ఓటర్లు ఒకేచోట గుమిగూడుతారు. దాని ఫలితంగా వాళ్ళల్లో ఎవరికైనా కరోనా ఉంటే అది మిగిలిన వాళ్ళకు అంటుకుంటుంది. అప్పుడు చాలా తొందరగా వైరస్ అందిరికీ పాకే ప్రమాదమే ఎక్కువుంది. అప్పుడు చంద్రబాబు, ఎల్లోమీడియా రంగంలోకి దిగేస్తారు. ప్రభుత్వ చేతకాని తనంవల్లే మళ్ళీ కరోనా వైరస్ కేసులు పెరిగిపోతోందంటూ బురద చల్లటానికి రెడీగా ఉన్నాయని అనుకుంటున్నారు జనాలు. అంటే ప్రతి విషయంలోను ప్రభుత్వాన్ని బద్నాం చేయటమే టార్గెట్ గా పెట్టుకున్నారన్న విషయం అర్ధమైపోతోంది. అందుకనే ఎన్నికల నిర్వహణ కోసమని ఇంతగా పట్టుబడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: