" తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు " అన్నట్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి కనిపిస్తోంది. గత టిడిపి ప్రభుత్వంలో నెలకొన్న అనేక లోపాలను నిర్లక్ష్యంగా వదిలివేసి, ఇప్పుడు ఆ అంశాలపైనే వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ వస్తున్నారు టిడిపి అధినేత చంద్రబాబు.  . అసలు జగన్ కు ఏపీ ని పరిపాలించే అర్హతలు లేవు అని, పూర్తిగా ఆయన అన్ని విషయాల్లో విఫలమయ్యారని, అసలు తాము తప్ప ఎవరు సమర్థవంతంగా పరిపాలన చేయలేరు అని, ఎన్నో రకాలుగా హైలెట్ అవుతూ చంద్రబాబు పదేపదే వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు దేశం మొత్తం నిరాశ నిస్పృహల్లో కూరుకుపోవడంతో , వారిని, మళ్లీ యాక్టివ్ చేసి, రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి మేలు చేసే విధంగా వ్యవహరించే ఎత్తుగడలు బాబు వేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. 




ఈ క్రమంలోనే అనేక ఆరోపణలు వైసీపీ పై చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా అమరావతి వ్యవహారంలో ఏపీ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ లేదు. అసలు అమరావతి పై ఆంధ్రులు అంతా ఆశలు పెట్టుకున్నారని, వారి ఆశలు జగన్ నిరాశలు చేశారని, మూడు రాజధానుల పేరుతో కొత్త నాటకం ఆడుతూ, అమరావతి ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని, అదే తాము అధికారంలో ఉండి ఉంటే, అమరావతి ఈపాటికి బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది ఉండేదని, పెట్టుబడులు వరదలా, వచ్చేవని ఇలా ఎన్నో రకాలుగా బాబు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు వ్యవహారం పైన అదేపనిగా విమర్శలు చేస్తున్నారు. అయితే అమరావతి వ్యవహారం కానీ,  పోలవరం ప్రాజెక్టు వ్యవహారం కానీ , చూసుకుంటే పూర్తిగా ఇందులో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం లోపం స్పష్టంగా కనిపిస్తోంది అనే వ్యాఖ్యలు సైతం వినిపిస్తున్నాయి.





అమరావతి పేరుతో హడావుడి తప్ప తెలుగుదేశం పార్టీ అక్కడ చేసిన అభివృద్ధి ఏమీ లేదు అనేది వైసిపి ఆరోపణ. ప్రజలలోనూ ఇదే రకమైన భావన ఉందని, అప్పట్లో హడావుడిగా కాకుండా, పూర్తిగా అక్కడ శాశ్వత రాజధాని నిర్మాణం పై దృష్టి పెట్టి ఉంటే, ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని, కానీ అలా చేయకుండా తాత్కాలిక రాజధాని పేరుతో హడావుడి చేసి రాబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే ... అమరావతి పూర్తవుతుందని చెప్పుకోవడం ఇవన్నీ ఇప్పుడు ప్రస్తావనకు వస్తున్నాయి. అలాగే ప్రతి సోమవారం ను పోలవరం డే గా మార్చి మరీ ప్రచారం చేసుకుంటూ హడావుడి చేసినా, సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారు. ఇప్పుడు ఈ వ్యవహారంపై వైసీపీ ని తప్పు పడుతూ విమర్శలు చేస్తున్నారు. ఈ విధంగా గత టీడీపీ ప్రభుత్వం లో ఎన్నో ప్రాజెక్టులు పెండింగ్ లో పడిపోగా, ఇప్పుడు వాటిని క్లియర్ చేస్తుంది. ఈ విధంగా వైసిపి ప్రభుత్వం ముందుకు వెళ్తున్నా, వాటి పై బురద జల్లుతూ రాజకీయంగా కక్ష సాధించాలనే తపన పడుతున్నట్లుగా బాబు వ్యవహరిస్తుండడం విమర్శల పాలవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: