గ్రేటర్ ఎన్నికల ప్రచారం ముగియడంతో రేపు జరగబోయే పోలింగ్ పైన అన్ని పార్టీలు ఉత్కంఠగా ఎదురు చూస్తూ, జనం నాడి ఏ విధంగా ఉండబోతోంది అనేది అంచనా వేసుకునే పనిలో అన్ని పార్టీలు ఉన్నాయి. గతంలో మాదిరిగా ఇప్పుడు జనాలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు అనేది తెలియక టిఆర్ఎస్, బిజెపి ,కాంగ్రెస్ ఎంఐఎం ఇలా ఎవరికి వారు టెన్షన్ లో మునిగిపోయారు.  కోట్లాది రూపాయల సొమ్ము కుమ్మరించి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమకు విజయం దక్కుతుందా ?  తమ పార్టీని జనాలు ఆదరిస్తారా అనే టెన్షన్ పెట్టుకున్నారు. ముఖ్యంగా టిఆర్ఎస్, బిజెపి లు  దక్కించుకోబోయేది తామే అంటూ అంతా గొప్పగా చెప్పుకుంటున్నా,  ఏ పార్టీలోనూ ఆ ధీమా కనిపించడం లేదు. 



కొన్ని చోట్ల టిఆర్ఎస్ మరికొన్ని చోట్ల బిజెపి,  కొన్నిచోట్ల టిడిపి ఎంఐఎం కొన్ని కొన్ని ప్రాంతాల్లో పట్టు పెంచుతున్నట్లు గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ బీజేపీలు హోరాహోరీగా ఇక్కడ తలపడుతున్నాయి. గ్రేటర్ పీఠం టిఆర్ఎస్ కు  ప్రతిష్టాత్మకం కావడంతో,  ఆ పార్టీ అగ్ర నాయకులు అందరూ రంగంలోకి దిగిపోయారు. ఎమ్మెల్యేలు ఎంపీలు,  మంత్రులు ఎంపీటీసీలు , జడ్పీటీసీలు అందరూ ఎన్నికల బాధ్యతలు తీసుకుని తమ ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా గ్రేటర్ లో సత్తా చాటాలని చూస్తున్నారు. 



బిజెపి జాతీయ నాయకులను ఎన్నికల ప్రచారంలో కి దింపి గట్టిగానే ప్రచారం చేయించింది. ఇప్పుడు అధికారం దక్కించుకోబోయే పార్టీ వైపే సార్వత్రిక ఎన్నికల ఫలితం కూడా ఉండే అవకాశం ఉండడంతో ఇంతగా ఇక్కడి ఎన్నికలపై అన్ని పార్టీలు దృష్టి పెట్టి  మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: