అభిమాన సంఘాల నేతలతో సమావేశమైన రజనీకాంత్ కు సదరు నేతలే పెద్ద షాక్ ఇచ్చినట్లు సమాచారం. తొందరలోనే రాజకీయ పార్టీ పెట్టాలా ? లేకపోతే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలా ? అనే విషయమై సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. సోమవారం చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ్ మండపంలో జరిగిన సమావేశంలో  వెంటనే కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని ఏక కంఠంతో చెప్పారట. అయితే బీజేపీతో పొత్తు మాత్రం వద్దంటే వద్దని స్పష్టం చెప్పేశారట. కొత్త రాజకీయపార్టీ పెట్టి సొంతంగా పోటీ చేస్తే అందరము కష్టపడి పార్టీకి పనిచేసి గెలిపించుకుంటామని హామీ కూడా ఇచ్చారు. అయితే ఇదే సమయంలో బీజేపీతో పొత్తు మాత్రం వద్దంటే వద్దంటు తేల్చి చెప్పేశారు. దాంతో రజనీకి అభిమాన సంఘాల నేతల మాట పెద్ద షాకే కొట్టిందని సమాచారం.




ఎందుకంటే కొత్త రాజకీయపార్టీ పెట్టి సొంతంగానే పోటీ చేసేంత ఆసక్తి, ఓపికి రజనీకి ఉందా అనేది తమిళనాడులో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సంవత్సరాల తరబడి రజనీ రాజకీయ పార్టీ పెడతాడని, ఎన్నికల్లో పాల్గొంటారనే ప్రచారం జరుగుతునే ఉంది. అయితే ప్రచారం ప్రచారంగానే మిగిలిపోయింది, సంవత్సరాలు గడచిపోయిందే కానీ రజనీ మాత్రం కొత్తపార్టీ పెట్టిందీ లేదు సొంతంగా పోటీ చేసిందీ లేదు.  నిజానికి రాజకీయ పార్టీ పెట్టాలంటే చాలా తెగువ, ఓపికి అవసరం. రజనీ విషయం చూస్తుంటే  ఈ రెండు కూడా ఉన్నట్లు లేదు. లేకపోతే తమిళనాడు వ్యాప్తంగా రజనీ అంటే పడిచచ్చిపోయే అభిమానుల సంఖ్య కోట్లలో ఉంటుంది. ఇంతటి విశేషమైన అభిమానుల అండ పెట్టుకుని కూడా పార్టీ పెట్టే విషయంలో సంవత్సరాల తరబడి నిర్ణయాన్ని నాన్చుతున్నారంటే ఏమిటర్ధం ? రాజకీయ పార్టీ పెట్టి అధికారంలోకి వస్తామన్న ధైర్యం రజనీలో లేదని అర్ధమైపోతోంది.




వాస్తవం చూస్తే కొత్తపార్టీ పెట్టాలని రజనీకాంత్ ను ఎవరు అడగలేదు. దివంగత ముఖ్యమంత్రి జయలలితతో వచ్చిన ఓ గొడవ కారణంగా అప్పట్లో ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడారు. దాంతో అప్పటి నుండి రజనీకి రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉందనే ప్రచారం మొదలైంది. దానికి అభిమాన సంఘాల డిమాండ్లు, ఒత్తిడి తోడవ్వటంతో ప్రచారం కాస్త బాగా పెరిగిపోయింది. దాని పర్యవసానమే చాలా కాలం నుండి రాజకీయాల్లోకి రజనీ ఎంట్రీ అనే ప్రచారం. ఇప్పటికి చాలాసార్లు రజనీ ఇదే  విషయమై అభిమానసంఘాలతో సమావేశం పెట్టినా ఏనాడు తన నిర్ణయాన్ని స్పష్టంగా ప్రకటించింది లేదు. సోమవారం నాటి సమావేశంలో కూడా నిర్ణయాన్ని చెప్పకుండానే వాయిదా వేసుకుని వెళ్ళిపోయారు. రెండు రోజుల తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని రజనీ చెప్పటంతో సస్పెన్సు కంటిన్యు అవుతోంది. సొంతంగా పార్టీ పెట్టే తెగువ లేదని రజనీ వ్యవహారం చూస్తుంటే అర్ధమైపోతోంది. మరి ఇంతోటి దానికి రాజకీయాల్లోకి రాదలచుకోలేదని స్పష్టంగా ప్రకటించేసి ఎంచక్కా సినిమాలకే పరిమితమైపోవచ్చు కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: