గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల ప్రక్రియలో జరిగింది చూస్తుంటే అందరికీ ఇదే అనుమానం పెరిగిపోతోంది. కుట్ర చేయటం ద్వారా బీజేపీ ఓ పద్దతి ప్రకారం గ్రేటర్ ఎన్నికల పిక్చర్లో నుండి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను తప్పించేసిందనే అర్ధమైపోతోంది. గ్రేటర్ ఎన్నికల్లో పాల్గంటామని పవన్ ప్రకటన చేసిన దగ్గర నుండి వరుసగా జరిగింది ఒకసారి గుర్తు చేసుకోండి కుట్ర ఏమిటో మీకే అర్ధమైపోతుది.  జరిగిన ఒక్కొక్క అంశాన్ని పరిశీలిద్దాం. గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించిన మరుసటి రోజు కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ వచ్చారు. వీళ్ళిద్దరు పవన్ తో భేటీ అయ్యారు. సమావేశంలో ఏమాట్లాడుకున్నారో తెలీదు కానీ తర్వాత మీడియాతో మాట్లాడారు. కేసీయార్ కు వ్యతిరేకంగా బీజేపీ-జనసేన మధ్య  ఓట్లు చీలకూడదన్న విషయంపై చర్చించినట్లు కిషన్ చెప్పారు.




తమ వాదనతో ఏకీభవించిన పవన్ గ్రేటర్ ఎన్నికల్లో తమ అభ్యర్ధులను విత్ డ్రా చేయించేందుకు అంగీకరించినట్లు కిషన్ ప్రకటించారు. అదే ప్రకటనను పవన్ కూడా చెప్పి తమ అభ్యర్ధులను పోటీనుండి విత్ డ్రా అవ్వాలని పిలుపిస్తునే అందరం కలిసి బీజేపీకి ఓట్లు వేయించాలని, తాను బీజేపీ విజయం కోసం ప్రచారం చేస్తానన్నారు. 28,29 తేదీల్లో పవన్ ప్రచారం జరుగుతుందని కిషన్ కూడా చెప్పారు. అయితే ఇంతలో ఏమైందో ఏమో ఢిల్లీలోని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నుండి పవన్ కు పిలుపు వచ్చింది. దాంతో అర్జంటంటు పవన్ ఢిల్లీ వెళ్ళిపోయారు. అక్కడ మూడు రోజుల వెయిటింగ్ తర్వాత నడ్డాతో మొక్కుబడి సమావేశం జరిపేసి మళ్ళీ హైదరాబాద్ కు వచ్చేశారు. తిరిగి వచ్చిన తర్వాత కూడా పవన్ ఎక్కడా ప్రచారం చేయలేదు చివరకు ప్రచారం కూడా ముగిసిపోయింది.




ఇక్కడే అందరికీ అనుమానాలు పెరిగిపోయాయి. అదేమిటంటే కావాలనే నడ్డా ద్వారా పవన్ను బీజేపీ నాయకత్వమే ఢిల్లీకి పిలిపించిందట. అర్జంటు లేదు ఏమీ లేదని తర్వాత తేలిపోయింది. లేకపోతే అర్జంటని పిలిపించి మూడు రోజులు ఖాళీగా కూర్చోబెట్టడంలో బీజేపీ నేతల ఉద్దేశ్యమేమిటి ? అంటే ఓ వ్యూహం ప్రకారం పోటీనుండి జనసేనను తప్పించింది. ఇక ప్రచారం నుండి కూడా అలాగే తప్పించిందట. ఎందుకంటే పవన్ గనుక ప్రచారం చేస్తే కేసీయార్ ఎక్కడ మళ్ళీ  తెలంగాణా సెంటిమెంటును లేవదీస్తాడో అనే అనుమానం వచ్చిందట కమలం నేతలకు. అందుకనే చివరకు ప్రచారం నుండి కూడా తప్పించేశారు. ఎందుకంటే మొదటినుండి కేసీయార్ ను కమలంనేతలు మతం యాగింల్లోనే ఎటాచ్ చేస్తున్నారు కాబట్టి. మొత్తానికి గ్రేటర్ ఎన్నికల నేపధ్యంలో పవన్ విషయంలో కమలం నేతలు పెద్ద కుట్రనే పన్నినట్లు అర్ధమైపోయింది. ఏం చేస్తాడు పాపం వాళ్ళతో పొత్తు పెట్టుకున్న తర్వాత.



మరింత సమాచారం తెలుసుకోండి: