గ్రేటర్ ఎన్నికల ప్రహసనం తర్వాత అందరు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వైఖరిని చూసి ఆశ్చర్యపోయారు. ఇక్కడే చాలామందికి జగన్మోహన్ రెడ్డి, పవన్ కల్యాణ్ ను పోల్చి చూసుకుంటున్నారు. ఇద్దరి మధ్య ప్రధానంగా కనిపిస్తున్న తేడా ఏమిటంటే ధైర్యం. అవును ఆ ధైర్యం లేకపోవటం వల్లే పవన్ అందరిలోను లాఫింగ్ స్టాక్ లాగ మారిపోయారు. లేకపోతే పార్టీ పెట్టిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణాలో జరిగిన ఏ ఒక్క ఎన్నికలో కూడా పోటీ చేయలేదంటే ఏమిటర్ధం ? పార్టీ చీఫ్ కు ధైర్యం లేకపోవటం వల్ల పార్టీ చివరకు నవ్వుల పాలైపోతోంది. 2014లో పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణాలో ఇప్పటికి నాలుగు సార్లు ఎన్నికలు వచ్చాయి. ఇందులో ఒక్కటంటే ఒక్క ఎన్నికలో కూడా పోటీ చేయలేదు. ప్రతిసారి రెడీ అవ్వటం చివరి నిముషంలో ఏదో కారణంతో పోటీ నుండి విత్ డ్రా అవ్వటమే రివాజుగా మారిపోయింది.




2015లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. ఎందుకంటే పార్టీ ఏర్పాటు చేసి కొద్ది రోజులే అయిన కారణంగా తాము పోటీకి సిద్ధపడలేదని చెప్పుకున్నారు. జనాలు కూడా నిజమేనేమో అని సరిపెట్టుకున్నారు. తర్వాత 2018లో తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు జరిగాయి. ఎన్నికలను హఠాత్తుగా నిర్వహిస్తున్న కారణంగా తాము సన్నద్ధం కాలేదని చిన్నపిల్లలు సాకులు చెప్పినట్లు చెప్పి ఎన్నికల నుండి తప్పుకున్నారు. మిగిలిన ప్రతిపక్షాలకు సరిపోయిన సమయం ఒక్క జనసేనకు మాత్రమే ఎందుకు సరిపోలేదు ? పైగా తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయంటూ అప్పటికి ఆరు నెలల ముందు నుండే మీడియాలో ఒకటే గోల నడుస్తోంది. అయినా సమయం సరిపోలేదని పవన్ చెబితే ఏమనుకోవాలి ?




సరే పోనీలే అనుకున్నారు జనాలు. తర్వాత 2019లో పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేయలేదు. ఎందుకయ్యా అంటే దీనికి కూడా ఏదో సాకు చెప్పారు. చివరకు ఇపుడు జరుగుతున్న గ్రేటర్ ఎన్నికల్లో కూడా పోటీకి దూరంగానే ఉండిపోయారు. ఎందుకంటే కేసీయార్ వ్యతిరేక ఓట్లు బీజేపీ-జనసేన మధ్య చీలిపోకుండానట. ఇన్ని ఎన్నికల్లో పవన్ వైఖరి చూసిన తర్వాత అందరికీ జగన్ తో పోలిచ కొట్టిచ్చినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ ను వీడి బయటకు వచ్చేసిన తర్వాత జగన్ ప్రతి ఎన్నికలోను పోటీ చేస్తునే ఉన్నారు. ఇక్కడ గెలుపు ఓటమి ముఖ్యంకాదు. రాజకీయ పార్టీ అన్నాక గెలుపోటములతో సంబంధం లేకుండా పోటీ చేయాల్సిందే. ఏదో కారణం చెప్పి ప్రతి ఎన్నికకు దూరంగా ఉంటే ఇక జనాలు పట్టించుకోరు. పార్టీ అధినేత ధైర్యంగా రంగంలోకి దిగితే మద్దుతుదారులు కూడా ధైర్యంగా దిగుతారు.



ప్రతి ఉపఎన్నికలోను వైసీపీ అభ్యర్ధులను  జగన్ పోటీలోకి దింపారు. తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో, పంచాయితి ఎన్నికల్లో పోటీ చేయించారు. తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ప్రధాన ప్రతిపక్షం అనిపించుకున్నారు. అంతిమంగా 2019 ఎన్నికల్లో విజయం సాధించి అధికారపక్షం అనిపించుకున్నారు. అదే పవన్ వ్యవహారం చూస్తే ముందుగా ఏదో ప్రకటన చేసేస్తారు. తర్వాత దానికి భిన్నంటా వ్యవహరిస్తారు. ఈ కారణంగానే జనాల్లో పవన్ అంటే నమ్మకం పోయింది. ఇదే వైసీపీ విషయానికి వస్తే  ధైర్యమే జగన్ను విజేతగా నిలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: