తెలంగాణ ఎన్నికల్లో టిఆర్ఎస్ బొటాబొటిగా గెలిచింది. గత గ్రేటర్ ఎన్నికలతో పోల్చితే గెలుచుకున్న సీట్ల సంఖ్య సగానికి తగ్గిపోవడం టిఆర్ఎస్ కు రాబోయే.. జరగబోయే ప్రమాదాన్ని తెలియజేస్తోంది. ఏదో రకంగా ఎంఐఎం పార్టీతో పొత్తు పెట్టుకున్నా, ఎన్నో రకాల ఇబ్బందులను టిఆర్ఎస్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. మిగతా పార్టీలతో పోల్చుకుంటే ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఉన్నా , గ్రేటర్ మేయర్ పీఠాన్ని దక్కించుకునే అంత స్థాయిలో బలం లేకపోవడం,  ఎక్స్ అఫిషియో ఓట్లు వచ్చినా, మేయర్ స్థానం సంపాదించుకునే అంత స్థాయిలో లేకపోవడం , తప్పనిసరిగా ఎంఐఎం పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సి రావడం ఇవన్నీ టిఆర్ఎస్ కు ఎన్నో రకాలైన ఇబ్బందులను తీసుకువస్తోంది. 




అసలు బిజెపి టిఆర్ఎస్ పార్టీలు పొత్తు పెట్టుకుంటే,  తమకు బాగా కలిసి వస్తుందని,  రాబోయే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ జెండా ఎగురవేసేందుకు టిఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉపయోగపడుతుందని బిజెపి బలంగా నమ్ముతోంది కొన్ని లెక్కలు కూడా ఉదాహరణగా బీజేపీ చెబుతోంది. ఒకపక్క తప్పనిసరిగా ఎంఐఎం పార్టీ తో పొత్తు పెట్టుకోవడం తప్పనిసరి అయినా, ఎంఐఎం తో పొత్తు పెట్టుకుంటే బిజెపి చేసే విమర్శలకు తప్పనిసరిగా డ్యామేజ్ అవ్వాల్సిన పరిస్థితి టిఆర్ఎస్ కు ఎదురవుతోంది. అది కాకుండా టిఆర్ఎస్ పూర్తికాలం మేయర్ పీఠం పై కూర్చునేందుకు అవకాశం కనిపించడం లేదు . తప్పనిసరిగా ఎంఐఎం పార్టీ సైతం మేయర్ పీఠం కోసం పట్టుబట్టే అవకాశం కనిపిస్తోంది. అదికాకుండా ఎంఐఎం పార్టీ పెట్టే షరతులు అన్నిటినీ టిఆర్ఎస్ తప్పనిసరిగా పాటించాల్సిన పరిస్థితి నెలకొంది. 



ఒకవైపు ఎంఐఎం షరతులు ఇబ్బందులు  తట్టుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి నిజంగా టీఆర్ఎస్ కు ఎన్నో రకాలుగా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది అనడం లో సందేహం లేదు. ఇప్పటి వరకు టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు పొత్తు విషయమై చర్చలు మొదలు పెట్టకపోయినా... చివరకు జరిగే తంతు మాత్రం ఇదే అనే విషయం స్పష్టంగా అర్ధం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: