ఏదో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చంద్రబాబునాయుడు చెప్పుకోవటమే కానీ నిజానికి అంతగా పరిణతి ఉందని అనిపించటం లేదు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండి కూడా చంద్రబాబు చేయకూడని తప్పులు రెండు చేస్తున్నారు. మొదటిదేమో అమరావతిలో మాత్రమే రాజధాని ఉండాలని నానా యాగీ చేస్తున్నారు.  రెండో తప్పేమో డైరెక్టుగా జగన్మోహన్ రెడ్డిని క్రిస్తియన్ అంటూ ఎటాక్ చేస్తున్నారు. రాష్ట్రంలో కులపరమైన రాజకీయాలు ఈ మధ్య బాగా పెరిగిపోయాయి. దానికి కొనసాగింపుగానా అన్నట్లు చంద్రబాబు కొత్తగా మతపరమైన రాజకీయాలతో జోరు పెంచుతున్నారు. ఆ జోరులో డైరెక్టుగా క్రిస్తియన్లను ఎటాక్ చేస్తుండటంతో భవిష్యత్తులో జరగబోయే నష్టాన్ని అంచనా వేయటం లేదు.



మొదటి తప్పు గురించి మాట్లాడితే అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని, అభివృద్ధి అంతా అమరావతిలోనే జరగాలనే విచిత్రమైన డిమాండ్ తో మిగిలిన ప్రాంతాల్లో ఇప్పటికే చంద్రబాబుపై వ్యతిరేకత పెరిగిపోయింది. చంద్రబాబుపై ఏ స్ధాయిలో మిగిలిన ప్రాంతాల్లోని జనాల్లో వ్యతిరేకత ఉన్నదనే విషయంలో ఇప్పటికైత స్పష్టతలేదు. కానీ నేతల్లో మాత్రం వ్యతిరేకత బాగానే కనబడుతోంది. చంద్రబాబు డిమాండ్ ను తప్పుపడుతు ఉత్తరాంధ్రలోని కొందరు సీనియర్ నేతలు టీడీపీకి రాజీనామాలు చేయటమే దీనికి నిదర్శనం. రేపేదైనా సందర్భం వస్తే జనాల్లోని వ్యతిరేకత కూడా బయటపడుతుంది.




ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే తాజాగా జగన్ను ఎటాక్ చేయటానికి పాలనాపరమైన అంశాలు ఏమీ లేకపోవటంతో మతపరమైన రాజకీయాలు మొదలుపెట్టారు. కొన్ని దేవాలయాలపై గుర్తుతెలీని వ్యక్తులు చేస్తున్న విషయం తెలిసిందే. దాన్ని అడ్డుపెట్టుకుని జగనే దేవాలయాలపై దాడులు చేయిస్తున్నాడంటూ గోల మొదలుపెట్టేశారు. దేవాలయాలపై జగన్ ఎందుకు దాడులు చేయిస్తున్నారంటే ముఖ్యమంత్రి క్రిస్తియన్ కాబట్టట. అసలు చంద్రబాబు ఆరోపణల్లో ఏమైనా లాజిక్ ఉందా ? దేవాలయాలపై దాడులు జరిగితే ప్రభుత్వానికే కదా నష్టం. మరి తనకు నష్టం జరిగే పనిని జగన్ ఎందుకు చేయిస్తారు ? అనే చిన్నపాటి లాజిక్ కూడా చంద్రబాబు ఆలోచించటం లేదు. క్రిస్తియన్ ఓట్లు ఎలాగు టీడీపీకి రావని చంద్రబాబు డిసైడ్ అయినట్లుంది. అందుకనే జగన్ కు వ్యతిరేకంగా తాను పోరాటం చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తే మెజారిటి వర్గమైన హిందువుల్లో తనకు ఆదరణ పెరుగుతుందని అనుకుంటున్నట్లున్నారు. హిందువుల ఓట్లు పడతాయో లేదో తెలీదు కానీ టీడీపీతో ఉన్న కొంతమంది క్రిస్తియన్ మైనారిటిలు కూడా దూరమైపోతారని గ్రహించటం లేదు. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: