గత కొంత కాలంగా చూస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు వాడివేడిగా ప్రసంగాలు ఇస్తున్నారు. ఏపీ సీఎం గా జగన్ పరిపాలనకు అర్హుడు కాదని, ఫెయిల్యూర్ సీఎం అని, జగన్ కు ఓట్లు వేసి ప్రజలు తప్పు చేశారని, ఇలా ఎన్నో రకాలుగా వాదనలు వినిపిస్తూ వస్తున్నారు. అలాగే పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు, గుళ్ళు, బళ్ళు, విగ్రహాలు, అనుగ్రహ లు ఇలా ఎన్నో రకాలుగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, రాజకీయంగా పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్న జగన్ పైన పెద్ద ఎత్తున విమర్శలు చేసేవారు. జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ గ్యాంగ్ పెత్తనం పెరిగిపోతుందని, దోపిడీలు భూకబ్జాలు ఇలా పెద్ద ఎత్తున చోటుచేసుకుంటాయని, ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాలని ఎన్నో ఎన్నో రకాలుగా విమర్శలు చేశారు. జనాలు మాత్రం చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు. అఖండ మెజారిటీతో జగన్ కు విజయాన్ని అందించి చంద్రబాబు కు ఝలక్ ఇచ్చారు. అయినా ప్రజలు ఇచ్చిన తీర్పు పైన పదేపదే చంద్రబాబు విమర్శలు చేస్తూ వస్తున్నారు. 






 ఇప్పుడు అదే రాయలసీమ ప్రాంతానికి చెందిన టిడిపి నాయకులు విమర్శలకు గురవుతున్నారు. అనేక కేసుల్లో ఇరుక్కున్నారు. తెలంగాణలో వారిపై కేసులు నమోదు అవుతున్నాయి. అయినా వారి విషయంలో చంద్రబాబు ఎక్కడా నోరుమెదపడం లేదు. పైగా వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ హడావుడి సృష్టిస్తున్నారు. ఇటీవల కడప జిల్లాకు చెందిన టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హైదరాబాదులో భూ వ్యవహారంలో వివాదాస్పదం కావడం,  తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేయడం వంటివి జరిగాయి. ఆయన అరెస్టు తర్వాత టిడిపి అధినేత చంద్రబాబు ఎక్కడా ఆయన గురించి ప్రస్తావించలేదు. ఇక ఇదే సమయంలో టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కిడ్నాప్ వ్యవహారంలో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లారు. ఈ విషయంపై ఇప్పటికీ చంద్రబాబు స్పందించలేదు. పైగా వైసీపీ ప్రభుత్వం పై అదే తరహా విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు పదే పదే వైసీపీ ప్రభుత్వం పై ఈ తరహా విమర్శలు చేస్తున్నారు. ఇటువంటి వ్యవహారాల్లో టిడిపి నేతలు అరెస్ట్ కావడం, జైలు పాలు అవ్వడం వంటి వ్యవహారాలు టిడిపికి ఇబ్బందికరంగా మారాయి.





 బాబు ఏ విమర్శలు అయితే జగన్ ప్రభుత్వం పై చేస్తున్నారో అదే తరహా విమర్శలు టిడిపి నేతలపై వస్తూ ఉండటం వంటి వ్యవహారాలు ఇబ్బందికరంగా మారాయి. ఇప్పటికీ విమర్శల రాజకీయాన్ని నమ్ముకుని బాబు ముందుకు వెళ్తున్నారు తప్ప, పార్టీపరంగా క్షేత్రస్థాయి నుంచి ఉత్సాహం రేకెత్తించి రాబోయే అన్ని ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయం పైన దృష్టి పెట్టకుండా చౌకబారు విమర్శలు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ సొంత పార్టీ నేతలు చేస్తున్న తప్పిదాలను కూడా పట్టించుకోకుండా  ఉండడం వంటివి వ్యవహారాలు ఆయన హుందాతనాన్ని దెబ్బతీసేదిగా ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: