కరోనా వైరస్ చైనాలో పుట్టిందన్న సంగతి తెలిసిందే. అక్కడి వుహాన్‌లోని జంతు మాంసం మార్కెట్లలో కరోనా వైరస్ ఊపిరిపోసుకుంది. అక్కడి నుంచి చైనాలోని మిగిలిన ప్రాంతాలకు.. అక్కడి నుంచి ప్రపంచం మొత్తానికి కరోనా పాకింది. ఇప్పుడు మొత్తం ప్రపంచంలోని 190 దేశాలు కరోనాతో ఇబ్బందిపడుతున్నాయి. అయితే కరోనా వైరస్‌ను చైనా మొదట్లో బాగానే అరికట్టింది. కరోనా వైరస్‌తో ప్రపంచం మొత్తం అల్లాడుతున్న సమయంలోనే కరోనా వైరస్‌ను కట్టడి చేసింది.

ఒక దశలో చైనాలో నెలల తరబడి కొత్త కరోనా కేసులే నమోదు కాలేదు.. అయితే ఇప్పుడు సీన్ మారుతోంది. చైనాలో మళ్లీ ఏదో అలజడి చెలరేగుతోంది. మళ్లీ చైనాలో లాక్‌డౌన్లు అమలవుతున్నాయి. మళ్లీ చైనాలో క్వారంటైన్‌ సెంటర్లు వెలుస్తున్నాయి. ఉన్నట్టుండి మళ్లీ చైనాలో కొత్త ఆసుపత్రులు నిర్మిస్తున్నారు. మరి ఎందుకు.. ఈ మార్పుకు కారణమేంటి.. దీనికి మాత్రం చైనా సరిగ్గా సమాధానం చెప్పట్లేదు.

అబ్బే మళ్లీ ఒకటీ అరా కరోనా కేసులు పెరుగుతున్నాయి.. అందుకే ముందు జాగ్రత్తగా నిర్మించుకుంటున్నామని సమర్థించుకుంటోంది. కానీ.. అంతకు మించి చైనాలో ఏదో జరుగుతోందని నిపుణులు అనుమానిస్తున్నారు. అసలేం జరుగుతోంది చైనాలో.. చైనాలో మళ్లీ కరోనా కోరలు చాస్తోందా. రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయా.. మొన్నటి వరకూ నూతన సంవత్సర వేడుకలు సైతం చేసుకున్న చైనా.. ఇప్పుడు ఏకంగా 11 ప్రాంతాల్లో ఎందుకు లాక్‌ డౌన్ విధించింది..

చైనాలో మళ్లీ లాక్‌డౌన్లు మొదలవుతున్నాయి.. కానీ చైనా ఏమీ చెప్పడం లేదు.. చైనాలో మళ్లీ భారీగా ఆంక్షలు విధిస్తున్నారు.. కానీ చైనా ఏమీ చెప్పడం లేదు.. చైనా సంగతి తెలిసిందే.. చైనా వంటి తొండి దేశం ఈ భూమి మీద కనిపించదు. అందుకే.. ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం ప్రపంచం కనుక్కోవాలి. గతంలో కరోనా వైరస్ విషయంలో దాచి పెట్టినట్టు చైనా మరేదైనా విషయాన్ని దాచి పెడుతుందా అన్నది తేల్చాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: