హైకోర్టు తీర్పు చెప్పినంతమాత్రాన పంచాయితి ఎన్నికలు జరిగిపోతాయా ? జరిగే అవకాశం లేదంటే లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే కరోనా వ్యాక్సినేషన్ కారణంగా పంచాయితీ ఎన్నికలు నిర్వహణ సాధ్యం కాదన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. పంచాయితీ ఎన్నికలకు స్టేట్ ఎలక్షన్ కమీషన్ ఇచ్చిన నోటిఫికేషన్ను సింగిల్ బెంచ్ కొట్టేసింది.  అయితే  హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ డివిజన్ బెంచ్ లో సవాలు చేశారు. గురువారం ఫైనల్ గా విచారణ జరిపిన డివిజన్ బెంచ్ పంచాయితీ ఎన్నికలు పెట్టాల్సిందే అంటూ తీర్పు చెప్పింది. పంచాయితి ఎన్నికలు, ప్రజారోగ్యం రెండు ముఖ్యమేనంటూ కోర్టు వ్యాఖ్యానించటం గమనార్హం. ఒకవైపు కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ చేస్తునే మరోవైపు పంచాయితి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే ప్రభుత్వ వాదనను డివిజన్ బెంచ్ ఎందుకో పట్టించుకోలేదు.




సరే డివిజన్ బెంచ్ మీద ప్రభుత్వం ఏమి చేస్తుంది ? ఏమి చేస్తుందంటే సుప్రింకోర్టులో సవాలు చేయబోతోంది. సుప్రింకోర్టులో లంచ్ మోషన్లో ప్రభుత్వం సవాలు చేయబోతోందని పంచాయితి రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. మంత్రి చేసిన ప్రకటనను బట్టి ఎన్నికలను నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం లేదన్న విషయం అర్ధమైపోతోంది. కాబట్టి డివిజన్ బెంచ్ ఎన్నికలను నిర్వహించాల్సిందే అని తీర్పిచ్చినంత మాత్రాన ప్రభుత్వం ఎన్నికలు పెట్టేస్తుందని అనుకుంటే పొరబాటే. మొత్తంమీద మార్చిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కమీషనర్ గా ఉన్నంత కాలం ఎన్నికలు పెట్టే అవకాశం లేదనే అర్ధమైపోతోంది.




అసలు ప్రభుత్వానికి, కమీషన్ కు మధ్య ఇంత కంపు జరగటానికి నిమ్మగడ్డ వైఖరే కారణం. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించటానికి చంద్రబాబు అండ్ కో ఎలా ఇష్టపడటం లేదో నిమ్మగడ్డ కూడా ఇష్టపడుతున్నట్లు లేదు. అందుకనే జరుగుతున్న ఎన్నికలను అర్ధాంతరంగా వాయిదా వేసేశారు. ఎన్నికల వాయిదాకు అప్పట్లో లేని కరోనా వైరస్ ను బూచిగా చూపించారు. ఎన్నికలను వాయిదాపడే సమయానికి మరో వారంరోజులు ఆగుంటే ఎన్నికలు పూర్తియిపోయేదే. ఇదే విషయాన్ని అధికారపార్టీ నేతలు ఎంత చెప్పినా అప్పట్లో నిమ్మగడ్డ పట్టించుకోలేదు. అప్పటి నుండి ప్రభుత్వానికి నిమ్మగడ్డకు మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది. కాబట్టి సింగిల్ బెంచ్ తీర్పును నిమ్మగడ్డ ఎలా చాలెంజ్ చేశారు కదా. అలాగే డివిజన్ బెంచ్ తీర్పును ప్రభుత్వం సుప్రింకోర్టులో చాలెంజ్ చేయబోతోంది. సుప్రింకోర్టులో తీర్పు ఏమివస్తుందో అప్పటి పరిస్దితిని బట్టి ఏమి చేయాలో ప్రభుత్వం అప్పుడు నిర్ణయించుకుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: