‘నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునేంతవరకు రైతులకు మద్దతుగా దళితులు కూడా పోరాటాలు చేయాలి’  ఇది తాజాగా దళిత్ పంచాయితీలు చేసిన తీర్మానం. ఉత్తరాధి రాష్ట్రాల్లో రైతుసంఘాలు, దళిత్ పంచాయితీలు చాలా పవర్ ఫుల్లుగా ఉంటాయి. పై రెండు వర్గాలు ఎవరివైపు మొగ్గుచూపితే ఎన్నికల్లో వాళ్ళదే విజయం. మొన్నటి ఎన్నికల్లో ఈ రెండు వర్గాలు బీజేపీకి మద్దతుగా నిలవటం వల్లే నరేంద్రమోడి మంచి మెజారిటితో అధికారంలోకి రెండోసారి రాగలిగారు. అప్పట్లో ఏ రెండువర్గాలైతే మోడికి మద్దతుగా నిలిచాయో ఇపుడవే వర్గాలు మోడి అంటేనే మండిపడుతున్నాయి. దాంతో భవిష్యత్తులో రాబోయే ఏ ఎన్నికల్లో అయినా బీజేపీకి ఇబ్బందులు తప్పేట్లు లేదని అర్ధమవుతోంది.




ఉత్తరాధి రాష్ట్రాల్లో ప్రధానంగా ఉత్తరప్రదేశ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో జాట్ వర్గం చాలా పవర్ ఫుల్. అలాంటి జాట్లే ఇపుడు మోడికి బద్దశతృవులుగా తయారయ్యారు. రైతు ఉద్యమనేత, జాట్ వర్గంలో మంచిపేరున్న నేత  రాకేష్ తికాయత్ బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలని ఇచ్చిన పిలుపుతో కొందరు కేంద్రమంత్రులతో పాటు ఉత్తరాధిలోని బీజేపీ ఎంపిలు, నేతలు తీవ్ర ఆందోళనలో పడిపోయారు. కారణాలు తెలియటం లేదుకానీ నూతన వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో మోడి కూడా బాగా ప్రిస్టేజి ఫీలవుతున్నారు. అందుకనే ఎవరెన్ని ఉద్యమాలు చేసినా చట్టాలను రద్దు చేసేది లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు.




దాంతో ఉద్యమం మరింత జోరుగా మారబోతోంది.  40 లక్షల ట్రాక్టర్లతో ఢిల్లీలోకి ప్రవేశించటానికి రైతులందరు సిద్దంగా ఉండాలని తికాయత్ పిలుపు సంచలనంగా మారింది. దాంతో ఎప్పుడేమి జరుగుతుందో అనే టెన్షన్ పెరిగిపోతోంది. ఇలాంటి నేపధ్యంలోనే రైతుఉద్యమానికి దళిత్ పంచాయితి తోడవ్వటం ఆగ్నికి ఆజ్యం తోడవ్వటమే. మొత్తం ఉత్తరాధిలో దళిత్ పంచాయిత్ లు కూడా బలమైనవే. యావత్ దళితవర్గాలు దళిత్ పంచాయత్ ల ఆధ్వర్యంలోనే పనిచేస్తాయి. అలాంటిది రైతుఉద్యమాన్ని అణిచివేయలేకపోయిన కేంద్రప్రభుత్వానికి ఇపుడు దళిత్ పంచాయత్ లు మద్దతు పెద్ద తలనొప్పిగా తయారవ్వటం ఖాయమే. ముందుగా రైతు, దళిత్ పంచాయత్ ల దెబ్బ పశ్చిమబెంగాల్లో బీజేపీ  మీద పడితే అప్పుడు సీన్ అర్ధమైపోతోందేమో మోడికి. చూద్దాం ఏమి జరగబోతోందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: