తెలంగాణ ఉద్యమ కాలంనాటి కేసీఆరేతర నాయకత్వం ఒకటౌతున్న సూచనలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ లో పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. 


వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఈటల రాజేందర్ క్రమంగా పార్టీకి దూరం అవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన సొంతంగా కొత్తపార్టీ పెట్టబోతున్నారని సాగుతున్న ప్రచారానికి, ఆయనతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు దీనికి బలం చేకూరుస్తుంది. హరీష్ రావు లాంటి టీఆరెస్ జెయింట్ & ట్రబుషూటర్ ఇప్పటికే హార్ట్ అయి ఉన్నవేళ - ఈటెలతో పెట్టుకుంటే తెలంగాణాలో సునామి వాతావరణం ఖచ్చితంగా ఏర్పడుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 


ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్, సీనియర్ నేతలకు ప్రచారంతో పాటు గెలుపు బాధ్యతలుఅప్పగించారు. చివరికి హరీష్ రావుకు కూడా "హైదరాబాద్ రంగారెడ్డి మహబూబునగర్ ఎమ్మెల్సీ ఎన్నిక" బాధ్యతలను అప్పగించారు. అయితే ఈటల రాజేందరును పట్టించు కోలేదు.


ప్రస్తుతం జరుగుతున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పలువురు మంత్రులకు బాధ్యతల్ని అప్పజెప్పారు. వాస్తవానికి మంత్రి ఈటెల రాజేందరు కు కూడా అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. కానీ, ఆయన తీరుపై గుర్రుగాఉన్న సీఎం, ఆయనకు బదులుగా మంత్రి గంగుల కమలాకర్ కు అవకాశం ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

మనసులో ఒక భావన ఏర్పడితే దాన్ని మరిచిపోయే స్వభావం ఉండటం రాజకీయ నాయకులకు చాల అవసరం. అయితే అతి తక్కువ మంది నాయకులు మాత్రమే ఇలాంటి గుణం కలిగి ఉంటారు. రాజకీయాల్లో ఫ్లెగ్జిబిలిటీ ఉండాలి. మరి పట్టుకొని కూర్చొని కక్ష బూనఁగూడదు. ఆలా జరిగితే పతనం మొదలైనట్లే.  


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైనా సందర్భంలో ఆయన నెగిటివ్ గా ఫీల్ అయితే చాలు, ఆ విషయం తన ముందుకు రావటానికి ఇష్టపడరని చెబుతారు. ఎవరైనా నేత విషయంలో కేసీఆర్ కినుకు వహిస్తే, ఇక ఆ నేతకు ఆయన దర్శనం దొరకదు సరికదా! ఆయన దరిదాపుల్లోకి కూడా రానివ్వకుండా చేస్తారని చెబుతారు.


ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నేత, తెలంగాణ ఉద్యమ కలం నుండి కలసి మెలసి పనిచేసిన నేత. ఉద్యమాన్ని ముందుండి నడిపించిన నేతల్లో ఒకరు. అలాంటి వ్యక్తి విషయంలో ఆయన ఇటీవల చాలా ఎక్కువగా ఫీల్ అయినట్లుగా చెబుతున్నారు. ఈ కారణంతోనే ఆయన్ను దగ్గరకు రానిచ్చేందుకు అస్సలు ఇష్టపడటం లేదన్న మాట వినిపిస్తోంది. “గులాబీ జెండాకు అసలు ఓనర్లు తామే" అన్న మాట మాట కొద్ది నెలల క్రితం ఈటల రాజేందర్ కాస్త బలంగానే స్పష్టంగా ప్రకటించటం అది కచ్ఛితంగా కేసీఆర్ కు ధిక్కార స్వరమేనని చెబుతారు.


దశాబ్దం క్రితం పార్టీకి వారు కీలక నాయకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన రథసారథులు. ఉద్యమ కాలంలో పొద్దున లేస్తే,  రోడ్డెక్కి ‘జై తెలంగాణ’ నినాదాలతో హోరెత్తించిన నాయకులు. తెలంగాణ రాష్ట్ర సాకారంలో తమవంతు పాత్ర పోషించిన వీరులు. రాష్ట్రం సిద్ధించి గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కొన్నాళ్లు బాగానే ఉన్నా, భజన బృందాల కారణంగా ఉద్యమ నాయకులు ఇప్పుడు గులాబీ వనంలో ముళ్లుగా కనిపిస్తున్నారు. డబ్బాలు కొట్టేవారు అధినేతకు దగ్గర అవుతుండడంతో నాటి రథ సారథులను కేసీఆర్ దూరం పెడుతున్నారు.


తెలంగాణ ఉద్యమాన్ని మధ్యలో హైజాక్ చేసిన కేసీఆర్ కుటుంబం నిజమైన ఉద్యమసారధులు పట్ల కఠిన వైఖరి ప్రదర్శిస్తూ ఉండటంతో  ఈటెల లాంటి సమర్థులు “గులాబీ జెండాకు అసలు ఓనర్లు తామే" అనగానే అది జనాల్లోకి దూసుకు వెళ్ళినట్లే.


కాగా మైకు దొరికితే చాలు, కేసీఆర్ దేవుడికన్నా, గొప్పవాడని సందేశాలు ఇచ్చే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన గంగుల కమలాకర్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. పైగా అసలు ఎమ్మెల్సీ ఎన్నికలు, సాగర్ ఉప ఎన్నికపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశానికి కూడా ఈటల రాజేందర్ కు ఆహ్వానం అందలేదు దీంతో బలమైన నాయకుడు ప్రజల్లో బలమున్న నేత ఈటల మనస్తాపానికి గురయ్యారు. వెంటనే కరీంనగర్ వెళ్లిపోయారు. ఈటల రాజేందర్ కు ఎలాంటి ఆహ్వానం అందని సమయంలో గంగుల కమలాకర్ కీలక వ్యాఖ్యాలు చేశారు. 


“కొంతమంది సొంతపార్టీ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు" అని విమర్శించారు. ఆ వ్యాఖ్య ఈటల రాజేందర్ ను ఉద్దేశించేనని టీఆర్ఎస్ పార్టీలో చర్చ సాగుతోంది. సొంత పార్టీ పెడుతున్నారనే కారణం చూపి, ఈటలను టీఆర్ఎస్ అధినేత దూరం పెడుతున్నా రని, కానీ ఈటల పార్టీ పెట్టే పరిస్థితితుల్లో లేరని మరికొంత మంది అంటున్నారు. పరిస్థితులు చూస్తే మాత్రం ఎక్కడో తేడా కొడుతున్నాయి. ఈటల రాజేందర్ త్వరలో పార్టీ మారడమో, లేకపోతే, నిజంగా పార్టీ పెట్టడమో తప్ప, ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక కేసీఆర్ వ్యూహాత్మక ఎత్తుగడ ఉందని తద్వారా ఈటెలను ప్రజల నుండి పార్టీకి నుండి దూరం పెట్టవచ్చని కేసీఆర్ భావన. గత చరిత్రలో పలు సందర్భాల్లో ఇలాంటి వ్యూహల వెనుక అధినేత హస్తముందని రుజువైన సందర్భాలు ఉన్నాయని విమర్శకులు అంటున్నారు.


కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసే విషయంలో అధినేత నిర్ణయానికి భిన్నమైన అభిప్రాయం ఈటెల రాజేందర్ కు ఉందని చెబుతారు. ఇలా, పలు అంశాల్లో అధినేతతో విభేదిస్తున్న ఆయన్ను పక్కన పెట్టేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. 


అయితే ఈటెల ఎపిసోడ్ తో కేసీఆర్ తనకు అనుకూల వాతావరణం సృష్టించుకు నేందుకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ సమూల మార్పులకు కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేస్తున్న సమాచారం ప్రబలంగా ఉంది. 


కేసీఆర్ ఈటెల మధ్య ఈ అంతరం ఇలా పెరుగుతూ ఉంటుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. వాస్తవానికి మంత్రి ఈటెలను ఒక్కరిగా చూడలేం. ఆయన నాయకత్వంలో పెరిగిన నేతలు పలువురు ఉన్నారని, అలాంటప్పుడు ఆయన్ను ఇబ్బంది పెడితే వారి మనసు కూడా కష్టపెట్టి నట్లే కదా!  


ఇప్పుడు తెలంగాణాలో ఈటెల వ్యవహారం “పొలిటికల్లి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్" గా మారిందని చెప్పక తప్పదు. స్వంత సమర్ధత ఉన్న ఈటెల తలచుకుంటే మొత్తం టీఆరెస్ లోనే సంచలనం ఏర్పడొచ్చని విజ్ఞులు విశ్లేషకులు చెపుతున్నారు. 


కేసీఆర్ స్వార్ధ పూరిత వ్యవహారాలపై ఇప్పటికే విసిగి వేసారిన కొందరు ఎమ్మెల్యేలు, నాడు ఉద్యమ సారధ్యం వహించిన త్యాగ జీవులు, తెలంగాణ ప్రజలు - ఈ సందర్భాల్లో కేసీఆర్ కు వ్యతిరేఖంగా టీఆరెస్ లో చీలిక తేస్తే మాత్రం తెలంగాణాలో "మధ్యంతర ఎన్నికలు" తప్పవని అంటున్నారు. కనీసం ముఖ్యమంత్రి మార్పు కేసియార్ ఆలోచనలకు పూర్తి వ్యతిరేఖంగా జరగవచ్చు. 


అయితే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే స్వభావం ఉన్న తెరాస అధినేత రేపొకరోజు ఈటెలను అక్కున చేర్చుకొని వాతావరణాన్ని మార్చేయగలిగినా - ఈటెల. అయన అభిమానుల మనసు గెలవలేరు.


 

మరింత సమాచారం తెలుసుకోండి: