మన చరిత్రలో రాజన్న రాజ్యం అనే ఒక  రాజ్యం ఎక్కడ కన్పించదు. చరిత్రలో లేని రాజ్యం నిర్మించాలంటే ప్రజల మనసు గెలవాలి. నాడు శ్రీ రామచంద్రుడు జన హృదయం చూరగొని వారి మనసు గెలుచుకున్నారు కాబట్టే నాటి ప్రజలు తమ రాజ్యానికి శ్రీ రామరాజ్యం అని ఆ తరవాత నామకరణం చేసుకొన్నారు


ఎన్నో ఆశలు ఆశయాలతో రాజన్నరాజ్యం స్థాపిస్తానని వచ్చిందామే. తెలంగాణలో రాజ్యాధికారమే లక్ష్యమంటూ ముందు కెళుతోంది. ఆమె యాస వేరు, భాష వేరు.  పుట్టిన స్థలం వేరు, ప్రాంతం వేరు.


మా కొద్దనే తెలంగాణ సమాజం పోరాడింది ఆంద్రోళ్ళకి వ్యతిరేఖంగా. ఆంధ్రులను తెలంగాణ ప్రజలు ప్రేమిస్తారు గౌరవిస్తారు కానీ పాలనను అంటే రాజకీయ అస్థిత్వాన్ని వదులుకోరు. రాజన్న బిడ్డయినా, జగనన్న చెల్లి అయినా సరే - తెలంగాణ రాజకీయ వ్యక్తిత్వం అస్తిత్వం ఇక్కడి ప్రజలు అంగీకరించరు.


అందుకే ఆంధ్రుల పాలనపై పోరాడిన తెలంగాణ సమాజం ఈ ఆంధ్రా నేతను ఇది ఆమె మెట్టిల్లైనా సరే అక్కున చేర్చుకునే పరిస్థితి కనిపించడం లేదట. అందుకే ఆమె ఇంటి బయటా, ఆఖరుకు సోషల్ మీడియా లోనూ ‘తెలంగాణ సమాజం’ నుంచి ఆదరణ దక్కడం లేదన్న ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఎవరామే అనేది చెప్పకనే చెప్పాము. పాదయాత్రలు, పుట్టిల్లు, రాజన్నఅనే సెంటిమెంట్ - తెలంగాణ వాళ్ళు రాజకీయ నాయకుల నుండి ఆశించరు గాక ఆశించరు.



ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గారి చెల్లెలు దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజన్న ఉరఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారాల కూతురు అయిన వైఎస్ షర్మిల అడుగులు తెలంగాణ దిశగా పడటం లో స్వార్ధం మాత్రమే కనిపిస్తుంది. అన్న ఆంద్ర, చెల్లి తెలంగాణ, అనుకునే పరిస్థితులు లేనే లేవు అంటున్నారు.


జగన్ ను ఏపీలో సీఎంను చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన షర్మిల ఏపీ రాజకీయాల నుంచి తప్పుకొని మరీ అన్న మీద కోపం తోనో లేక ఇంట్లో ఉన్న సమస్యల వల్లనో ఏమో కానీ మెట్టినిల్లు అయిన తెలంగాణ గడప తొక్కింది. ఆంధ్రా ముద్ర పడకుండా ఆది లోనే తాను తెలంగాణ కోడలును అని పార్టీ ఏర్పాటు చేయబోతోంది.

 

అయితే ఈ సందర్భంలో ఆమెకు సోషల్ మీడియా లో విపరీతమైన ట్రోల్స్ పడుతున్నాయి ఆంధ్రా నుంచి పెయిడ్ పొలిటికల్ ఆర్టిస్టులు వస్తున్నారని, నిజమైన నాయకులు ఎవరూ ఆమె తో కలసి నడవట్లేదని, ఇంత వరకు ఒక్క మాజీ ఎమ్మెల్యే కూడా రాలేదని ఆమెపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. తెలంగాణ నాయకుల బలం లేకుండా ఆమె ఇక్కడ ఎలా రాజకీయం చేస్తుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆమెతో వేదికపై నటించిన విద్యార్థులెవరో రేవంత్ రెడ్డి వీడియో ద్వారా జనాలను మేల్కొలిపారని ట్రోల్స్ కొనసాగు తున్నాయి.

తెలంగాణ తెచ్చుకుంది మా పాలన మేము చేసుకోవాలని ఆంధ్రావాళ్ల పాలన కాదు అని ఇక్కడి రాష్ట్ర ప్రజలు నెటిజన్లు వాదిస్తున్నారు. ఇక్కడ  కావాల్సింది రాజన్న రాజ్యం కాదని, తెలంగాణ వాళ్లే రాష్ట్రాన్ని  పరిపాలించాలని కోరుకుంటున్నారు.
 

టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఏదైనా అభ్యర్థి తెలంగాణ వారైతే ఎవరైనా పర్లేదు కానీ, ఆంధ్రావాళ్లు వద్దు అనే వాదన ఇప్పుడు సోషల్ మీడియా లో మొదలైంది.

ఆంద్రోళ్ళు పాలకులుగా వద్దనే కదా! తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి తెలంగాణ తెచ్చుకుంటే మళ్లీ ఈ లొల్లి ఇందిరా బాయ్! అని తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున చర్చించు కుంటున్నారట,  ఇవి విని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంతా “ట్రోల్స్” తో హోరెత్తిస్తున్నారట. పబ్లిసిటీ లేదు అని అంటున్నారట. చూడాలి! వైఎస్ షర్మిల ఎలా సక్సెస్ అవుతుందో? లేక వైసీపీ మాదిరిగా తెలంగాణలో పార్టీ లేకుండా పోతుందో? అనేది తెలుసుకోవటానికి కొంతకాలం నిరీక్షించాల్సిందే.


ఆమె ఎవరి కోడలనేది ఏడేళ్లు గుర్తుకు ఎందుకు రాలేదు? వైఎస్సాఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బద్ధ వ్యతిరేఖి - అలాంటి వ్యక్తి ముద్దుల తనయ ఏ ముఖం పెట్టుకొని ఇక్కడ ఓట్లడుగుతరు? ఆమె మా రాష్ట్ర కోడలైతే మాకేం అభ్యంతరం లేదు. కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆంధ్రోళ్ళకి స్థానం ఇవ్వలేమని ప్రజలు కాస్త గట్టిగానే చెపుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: