దొరికేంతవరకు అందరు దొరలే! దొరికితే తప్ప దొంగలని తెలియదు. కమ్యూనిస్ట్ పోరాట యోధుడు కేరళ ముఖ్యమంత్రి పినారాయ్ విజయన్ - రాజకీయ కురువృద్ధుడు ప్రజల మనసు చూరగొన్న పాలకుడు ఇంత వరకు మేడిపండులా మిల మిల మెరిశారు. అయితే ఇప్పడు ఆయన పొట్ట విచ్చి చూస్తున్న నిఘా వర్గాలకు కనిపించాయి ఆ పొట్టలో పురుగులు. నేర పరిశోధనలో ఆయన పాపాల చిట్టా ఓపెన్ అయింది.


శాసనసభ ఎన్నికల వేళ  స్మగ్లింగ్ కేస్ అదే - గోల్డ్ స్కామ్ కేసు నేడు కేరళ ప్రకంపనలతో సతమతమౌతుంది చూస్తుండగానే ఈ కేసుల ఉచ్చు సీఎం పినరయి విజయన్ మెడకు బిగుస్తోంది. గోల్డ్ స్మగ్లింగ్ కేసు లో ప్రధాన సూత్రధారిగా ఉన్న స్పప్న సురేష్ కస్టమ్స్ విచారణలో సంచలన విషయాలు చెప్పారు. 30 కేజీల బంగారం స్మగ్లింగ్ కేసుతో కేరళ వామపక్ష ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ కు సంబంధముందని ప్రతి పక్షాలన్నీ దుమ్మెత్తి పోస్తున్న సందర్భంలో ఎన్నికలు ముంగిట్లోకి వచ్చిన వేళ ఉచ్చులో చిక్కి, చిక్కుల్లో పడ్డారు.



డిప్లమాటిక్ కార్గో ద్వారా ఇంత పెద్ద మొత్తంలో బంగారం తరలించడం సంచలనంగా మారింది. దీంతో ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థలు ఎన్‌ఐఏ, కస్టమ్స్, ఎన్‌ఫోర్స్ డైరెక్టరేట్‌లు విడివిడిగా విచారణ చేపట్టాయి. ఈకేసుకు సంబంధించి తిరువనంతపురంలోి యూఏఈ కాన్సులేటు లో మాజీ ఉద్యోగులైన స్వప్న సురేష్‌, పీఎస్ సరిత్‌ తో పాటు మరికొందరు నిందితులను దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. బంగారం స్మగ్లింగ్ కేసు విచారణలో నిందితురాలైన స్వప్న సురేష్ కూడా ఇదే విషయాన్నీదర్యాప్తులో వెల్లడించారు. ఈ స్మగ్లింగ్ ‌లో సీఎం పినరయ్ విజయన్ పాత్ర కూడా ఉందని, ఆయన నిండా మునిగారని కస్టమ్స్ అధికారులకు చెప్పారు.



సీఎం పినరయ్ విజయన్ తో పాటు మరో ముగ్గురు మంత్రుల పేర్లను కూడా స్వప్నా సురేశ్ విచారణ సందర్భంగా వెల్లడించారు. ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ ఇందులో సూత్రధారి అయితే ముగ్గురు మంత్రులతో పాటు రాష్ట్ర శాసన సభాపతి కూడా ఇందులో పాత్రధారులు అంటూ ఆమె వెల్లడించారు. ఇదే విషయాన్ని కస్టమ్స్ అధికారులు కేరళ ఉన్నత న్యాయస్థానంలో కూడా వెల్లడించారు.



‘‘సీఎం విజయన్‌ అరబ్బీ భాషలో మాట్లాడలేరు. అందుకే కాన్సులేట్ జనరల్‌ కు, విజయన్ ‌కు మధ్య అనుసంధాన కర్తగా స్వప్న సురేశ్ వ్యవహరించారు. ఈ ఒప్పందంలో సీఎంతో సహా మంత్రులకు కోట్లాది రూపాయలు కమిషన్‌గా ముట్టిందని స్వప్న సురేశ్ దర్యాప్తు సందర్భంగా వెల్లడించారు.’’ అని కస్టమ్స్ అధికారులు ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.



తిరువనంతపురం లోని ‘యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్‌’ కు వస్తున్న పార్శిల్‌ లో ₹15 కోట్లు విలువ చేసే 30 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారం కేరళ  రాష్ట్రంతో పటు దేశాన్ని కూడా  కుదిపేసింది. ఇందులో జాతీయ భద్రత కూడా ప్రమాదంలో పడిన నేపథ్యంలో ఈ కేసును ‘ఎన్‌ఐఏ’ కు అప్పగించారు. ఈ వ్యవహారం లో కేరళ ఐటీ శాఖలో పనిచేస్తున్న స్వప్న సురేశ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.


ఈ కేసులో స్వప్న సురేష్ పేరు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. కేరళ ముఖ్య మంత్రి పినరయి విజయన్ ప్రధాన కార్యదర్శి శివశంకర్ ‌కు ఆమెతో సంబంధాలు న్నాయని ఆరోపణలు రావడంతో ఆయనను ఆ పదవి నుంచి తొలగించారు. ఇక శివశంకర్ బెయిల్‌ను ఛాలెంజ్ చేస్తూ, దాఖలైన పిటిషన్‌పై ఆయనకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. ఇప్పటికే ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసినందున, దానిపై స్టే విధించలేమని తెలిపింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. ఎన్నికల వేళ సీఎం పేరు బయటకు రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో సీఎం ప్రమేయం బలపడటంతో, బయటకు రావడంతో కేరళ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. గతంలో తాము చేసిన ఆరోపణలన్నీ నిజమయ్యాయని విపక్ష నేత రమేష్ చెన్నితాల విమర్శించారు.  



కేరళతో తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అసోం - ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడులై ఎన్నికలు జరగ నున్నాయి.140 నియోజక వర్గాలున్న కేరళ అసెంబ్లీలో ఏప్రిల్ 6న ఒకే ఒక దశలో ఎన్నికలు జరగనున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: