కుల జిల ఆంధ్రోళ్లకే  స్వంతం అనే వారు గతంలో తెలంగాణా వాళ్ళు అయితే ఇప్పడు ఆ కచరా ను తెలంగాణ జనాలకు కూడా పూసేసింది కల్వకుంట్ల వారి కుటుంబం. తెలంగాణాలో కూడా "కులం" రోడ్డెక్కింది - బహిరంగ సమావేశాల్లో కులాన్ని రోడ్డెక్కించిన "కేసీఆర్ - కేటీఆర్ కుటుంబం" 

 


కులాల ప్రాతిపదికన రాజకీయాలు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఆంధ్ర లోనే చూశాం. పరి పాలన ఎలా ఉన్నా,  అభివృద్ధి ఎలా ఉన్నా, కులం ప్రాతిపదికనే ఏపీలో రాజకీయం  నడుస్తుంది.  ఎంతటా అంటే, ఏకంగా కులం పేరుతో దూషించు కోవడం కూడా చేస్తుంటారు. ఒకరు చౌదరి అంటే, మరొకరు కాపు, నాయుడు అంటారు. ఇంకొకరు రెడ్డి అంటారు. ఇప్పుడు అంతా ఆ కుల రాజకీయం రోడ్డున పడింది.



ఇప్పుడు ఆ జాఢ్యం తెలంగాణకు సైతం పాకినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలోనూ కుల రాజకీయాలు మొదలయ్యాయి. అయితే అది ఇప్పటి వరకూ సామాజిక న్యాయం కోణం లోనే ఉండేవి. ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో నేరుగా కులాల గురించి చర్చించు కుంటున్నారు.



దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో అన్ని కులాల వారు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో తమ ఆత్మగౌరవ భవనాలు నిర్మించు కోవడానికి స్థలాలు, నిధులు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు.



తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుండే కుల ప్రాతిపదికన పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ కేటాయింపులు చేస్తూ ముందుకు నడుస్తుంది కేసీఆర్ ప్రభుత్వం. ఏ కుల వర్గ సమావేశానికి వెళ్లిన కల్వకుంట్ల కుటుంబం ఆ కులం వాళ్ళని పొగడటం వారికెంతో చేస్తున్న భ్రమలు కలిగించటం జరుగుతుంది. పలు చాట్ల కుల భవనాలకు శంఖుస్థాపన చేసిన పునాది రాళ్లే కనిపిస్తున్నాయి. కానీ కేసీఆర్ తన కులపోళ్ళని మాత్రం వీరలెవెల్లో ముందుకు తీసుకెళుతున్నారు.



"కూతురికి మాటలు, కోడలికి మూటలు" అనే తెలంగాణాలో అత్తల తీరుపై సామెత చెపుతారు. అలాగే ఉంది కేసీఆర్ పాలనా తీరు. “తన కులానికే సంపద సమస్తం ఇతర కులాలకు మాత్రం శున్యహస్తాలు” దాన్ని కేటీఆర్ బహిరంగం చేసేసారు.


హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి బీజేపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావు పోటీ చేస్తున్నారు. ప్రత్యర్థిగా టీఆర్ఎస్ నుంచి పీవీ కుమార్తె సురభి వాణీ దేవిని రంగంలోకి దింపారు. టీఆర్ఎస్ పోటీ చేయదని చివరి క్షణం వరకూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా వాణీ దేవిని రంగంలోకి దింపడంతో బీజేపీకి షాక్ తగిలినట్లయింది.


టీఆర్ఎస్ కుట్ర పూరితంగా బ్రాహ్మణ అభ్యర్థి పై బ్రాహ్మిణ అభ్యర్థిని రంగంలోకి దింపి ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తోందని బీజేపీ అభ్యర్థి రాంచంద్రరావు విరుచుకు పడ్డారు.


అయితే ఓ అభ్యర్థిగా ఉండి ఇలా కులాల ప్రకారం మాట్లాడటంతో సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. ఈ చర్చ కుల రాజకీయాలపై వ్యతిరేకతలా కాకుండా ఒకరినొకరు దూషించుకోవడానికన్నట్లుగా మారిపోయింది.


మంత్రి కేటీఆర్ కూడా సురభి వాణీదేవికి మద్దతుగా జరిగే సభల్లో సందర్భం వచ్చినప్పుడల్లా,  తాము బ్రహ్మిణ సమాజానికి ఏం చేశామో చెప్పుకొస్తున్నారు. కేసీఆర్‌‌కు గురువులన్నా, బ్రాహ్మణులన్నా ఎంతో ఇష్టమని చెబుతున్నారు. యాగాలు చేస్తుంటారన్నారు. ఇలా కులాల ప్రకారం విడిపోయి, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేయడం తెలంగాణలో ఇదే మొదటి సారి. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రవచించిన తీరు ప్రకారం వాణిదేవికి బ్రాహ్మణ కులవర్గం ఓటేస్తే సరి పోతుందా! అంటున్నారు ప్రజలు.


గతంలో కుల సమీకరణాలు అంతర్గతంగానే ఉండేవి. కానీ ఇప్పుడు ఏపీకి ఏమాత్రం తీసిపోకుండా బహిరంగం అయిపోయింది. అయితే ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏమిటంటే ఇంకా కుల రాజకీయాలు ఆయా సామాజిక వర్గాల్ని సంతృప్తి పరిచే దిశగానే ఉన్నాయి.


ఒక్క సామాజికవర్గం మీద ఇతరుల్ని రెచ్చగొట్టే రాజకీయాల దాకా ఇంకా వెళ్లలేదు. ఆ అవలక్షణం కూడా చేరితే తెలంగాణ రాజకీయాలు కూడా, ఏపీలాగా కుల రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్లా మారి పోవడానికి ఎంతో కాలం పట్టదనిపిస్తుంది


మరింత సమాచారం తెలుసుకోండి: