ఇన్నాళ్లూ దేశంలో ఎదురులేని నాయకుడిగి చెలామణి అయిన మోడీ చరిష్మాకు కరోనా దెబ్బ కొట్టింది. దేశం పరీక్షా సమయంలో ఉన్నప్పుడు  దేశ ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రధాని మోడీ తీరుపై అందుకు తగ్గట్టుగా లేదని దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్‌లో ప్రధాని మోడీ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.. పదిరోజులకోసారి.. నెలరోజులకోసారి మీడియా ముందుకు వచ్చి.. మిత్రోం.. అంటూ తెగ హడావిడి చేశారు. జనతా కర్ఫ్యూ ప్రకటన, తప్పెట్ల మోత.. దీపాలు వెలిగించడం.. ఇలా ఎన్నో నాటకీయ పిలుపులు ఇచ్చారు.

ఫస్ట్ వేవ్‌లో అంత హడావిడి చేసిన మోడీ.. మరి ఇప్పుడు దేశం ఇంతగా సంక్షోభంలో కూరుకుపోతే.. ఎక్కడా కనపించడే.. నిన్న మొన్నటి వరకూ బెంగాల్ ప్రచారంలో తప్ప..  ప్రజలకు ముఖం చూపించడేం.. అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బెంగాల్ ఎన్నికల తర్వాత కూడా మోడీ పెద్దగా జనం ముందుకు రావడం లేదు. కరోనా పై పెదవి విప్పడం లేదు. దీనికి తోడు ఇప్పడు మరో షాకింగ్ న్యూస్ మూడో వేవ్ రూపంలో పొంచి ఉందని కేంద్రమే చెబుతోంది.

కరోనా మూడో వేవ్ తప్పదని.. అంతే కాదు.. ఇంకా చాలా వేవ్‌లు వస్తాయని సాక్షాత్తూ ప్రధాని సాంకేతిక సలహాదారే చెబుతున్నారు. మరి దీనికి మోడీ సిద్ధంగా ఉన్నారా.. దేశాన్ని సిద్ధం చేస్తారా.. అన్నది ఇప్పుడు అందరి ముందు ఉన్న ప్రశ్న. ఈ నేపథ్యంలో ఇదే అనుమానం సుప్రీంకోర్టుకూ ఉంది. దేశంలో కొవిడ్‌-19 థర్డ్‌ వేవ్‌ రానున్న తరుణంలో సుప్రీంకోర్టు  పాలకుడికి కీలక సూచనలు జారీ చేసింది. కరోనా మూడోదశ ఉద్ధృతికి కేంద్రం ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని తెలిపింది. దేశం అంతటా ఆక్సిజన్‌ సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరింది.

కరోనా థర్డ్‌ వేవ్‌లో కరోనా వైరస్‌తో పోరాడటానికి పాన్ ఇండియా స్థాయిలో ఆక్సిజన్‌ అందించాలని కేంద్రానికి సూచించింది. ప్రజల్లో ఆక్సిజన్‌ కొరత పట్ల ఉన్న భయానికి తెర దించేలా బఫర్‌ స్టాక్‌ను ఏర్పాటు చేయాలని  కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. కరోనా థర్డ్‌ వేవ్‌ రాక ముందే ఆక్సిజన్‌ వినియోగం, నిల్వలపై ఆడిట్‌ జరిపాలని కేంద్రానికి సూచించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఢిల్లీకి సరఫరా చేస్తున్న ఆక్సిజన్‌ను 700 మెట్రిక్‌ టన్నుల కంటే తగ్గించరాదని  సుప్రీంకోర్టు  పేర్కొంది. మరి ఇకనైనా మోడీ మేలుకుంటారా.. మూడో ముప్పు నుంచయినా దేశాన్ని కాపాడతారా.. చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: