చైనా ఆధునిక ప్రపంచానికి ముప్పుగా పరిణమిస్తున్న నేపథ్యంలో భారత్ కూడా అందుకు తగ్గట్టుగానే వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే అమెరికా తర్వాత అగ్ర రాజ్యంగా చైనా ఎదిగింది. ఒక్కోసారి అమెరికాను  మించి తానే అగ్రరాజ్యమని భావిస్తోంది. వాస్తవం కూడా అలాగే తయారైంది. కమ్యూనిస్టు పాలన కారణంగా అధికారమంతా పాలకుడి చేతిలో కేంద్రీకృతం కావడంతో ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా  చైనాకు చాలా సులువు. ఇప్పటికే ప్రపంచ దేశాలపై అనేక రంగాల్లో ఆధిపత్యం సాధిస్తున్న చైనా.. సిల్క్ రోడ్‌ ద్వారా అంతర్జాతీయ వాణిజ్యంపై మరింత పట్టు సాధించాలని కొన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది.

ఈ సిల్క్ రోడ్ ప్రాజెక్టుపై చైనా ఇప్పటికే లక్షల కోట్ల రూపాయలు వెచ్చించింది. అయితే అనేక కారణాలతో ఇది ముందుకు సాగడం లేదు. ఇప్పుడు తాజాగా ఆస్ట్రేలియా వంటి దేశాలు ఈ సిల్క్ రోడ్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలో భారత్ తన వ్యూహాలను మరోసారి పదును పెట్టింది. చైనా సిల్క్‌ రోడ్ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా  అనేక దేశాల భాగస్వామ్యంతో ఓ పథకాన్ని రూపొందించింది.

ఇప్పుడు ఈ పథకంపై భారత్ యూరోపియన్ యూనియత్‌ తో చర్చలు జరుపుతోంది. కాంప్రహెన్సివ్‌ కనెక్టివిటీ ప్రాజెక్టు పేరుతో భారత్ ఈ ప్రత్యామ్నాయాన్ని సూచించింది. ఈ ప్రాజెక్టు ఇప్పడు యూరోపియన్ యూనియన్ దేశాలను ఆకర్షిస్తోంది. ఇప్పుడు అనేక దేశాలు మన ప్రాజక్టుకు మద్దతు ఇచ్చే పరిస్థితి నెలకొంది. చైనా సిల్క్ రోడ్ ప్రాజెక్టుపై మొదటి నుంచి అంత సదభిప్రాయం లేని అమెరికా వంటి దేశాలు కూడా భారత్ చూపుతున్న ఈ ప్రత్యామ్నాయ ప్రాజెక్టుకే మొగ్గు చూపుతున్నాయి.

ఇప్పుడు భారత్.. యూరోపియన్ యూనియన్ చర్చల్లో ఇదే కీలకం అవుతోంది. ఈ ప్రాజెక్టు కు ఈయూ ఓకే చెబితే.. మరో రెండు నెలల్లో ఇది కార్యాచరణ ప్రారంభం అవుతుంది. మొత్తానికి 2025 నాటికి దీన్ని పూర్తి చేయాలన్నది లక్ష్యం. ఈ ప్రాజెక్టు ద్వారా భారత్ ముఖచిత్రం మారబోతోందని నిపుణులు చెబుతున్నారు. ఈయూతో భారత్ చర్చల్లో భాగంగా ఈ ప్రాజెక్టు విషయం బయటకు వచ్చింది. ఇది నిజంగా చైనాకు షాకింగ్‌ న్యూస్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: