కరోనా వ్యాక్సిన్ల కొరత ఇప్పుడు దేశాన్ని వేధిస్తోంది. భారత్ బయోటెక్, సీరం సంస్థల ఉత్పత్తి సామర్థ్యం నెలకు 10 కోట్ల డోసులు కూడా  లేదు. అన్ని రాష్ట్రాల నుంచి వ్యాక్సిన్‌ డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలపై ఒత్తిడి పెరుగుతోంది. అయితే గుడ్ న్యూస్ ఏంటటే.. అవి తమ ఉత్పత్తి పెంపునకు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. సీరం సంస్థ మే, జూన్ నెలలో ఒక్కో నెలకి 6 కోట్ల 5 లక్షల చొప్పున ఉత్పత్తి చేస్తోంది.

డిసెంబర్ నాటికి సీరం సంస్థ తన ఉత్పత్తిని నెలకు 11 కోట్ల 50 లక్షల డోస్ పెంచే ప్రయత్నాలు చేస్తోంది. ఇక భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ టీకా డోసులను మరో 4 కంపెనీలకు జాబ్ వర్క్ ఇస్తోంది. ఇండియన్ ఇమ్యునలిజికల్, అప్కిన్ బయోఫార్మా, బైప్‌కాల్‌, గుజరాత్ కు చెందిన బయోటెక్ సంస్థలకు  జాబ్ వర్క్ ఇస్తోంది. మొత్తం మీద ఇవన్నీ సెప్టెంబర్ నుంచే ఉత్పత్తి ప్రారంభించి  డిసెంబర్ నాటికి 15 కోట్ల 50 లక్షల డోసులను నెలకు  ఉత్పత్తి చేయనున్నాయి.

రష్యాకి చెందిన స్పుత్నిక్ టీకాను రెడ్డి లాబ్స్ ద్వారా పేలాసియా, హెటేరో, విర్చో, స్టేడిస్, గ్లాండ్ ఫార్మా, శిల్పా మెడికేర్ లాంటి 7 కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. డిసెంబర్ లోపల 7 కోట్ల 2 లక్షల డోస్ లను ఉత్పత్తి చేయనుంది. ఆలోపు నేరుగా రష్యా నుంచి స్పుత్నిక్ వ్యాక్సిన్ ను దిగుమతి చేసుకుంటుంది. ఇక మరో సంస్థ  జైడస్ క్యాడిలా  సెప్టెంబరు నుంచి ఉత్పత్తి చేస్తుంది.

హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్ ఈవెంట్స్ సంస్థ జాన్సన్ జాన్సన్ తో కలిసి ఒక డోస్ తోనే సరోపోయే వ్యాక్సిన్ ను నెలకు 5 కోట్ల చొప్పున సెప్టెంబర్ నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తోంది. మొత్తం 16 కంపెనీలు తమ ఉత్పత్తులను భారత్‌కు టీకాలు అందజేయనున్నాయి. మొత్తం మీద.. ఈ కంపెనీలన్నీ మేలో 8కోట్ల 80 లక్షలు, జూన్ లో 10 కోట్లు, జులై లో 17 కోట్ల 8లక్షలు, ఆగస్టు లో 19 కోట్ల 16 లక్షలు, సెప్టెంబర్ లో 42 కోట్ల 12 లక్షలు, అక్టోబర్ లో 46 కోట్ల72లక్షలు, నవంబర్ 56కోట్ల2లక్షలు, డిసెంబర్ 59కోట్ల 32 లక్షలు లెక్కన ఉత్పత్తి చేయబోతున్నాయి. మొత్తం మీద  డిసెంబర్ వరకు 259 కోట్ల 22 లక్షల వ్యాక్సిన్ డోసులు భారత్‌లో ఉత్పత్తి అవుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: