యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్న కరోనా వైరస్ మహమ్మారితో పోరాడి ఎంతమంది విజయంసాధించారో తెలుసా ? అక్షరా 2 కోట్లమంది. అవును దేశం మొత్తంమీద 2.4 కోట్లమందికి కరోనా వైరస్ సోకింది. 2 కోట్లమందికి పైగా విజయం సాధించారు. మరో 37 లక్షలమంది కరోనా వైరస్ కు వైద్యం చేయించుకుంటున్నారు. అంటే కరోనా తో యుద్ధం చేస్తున్నట్లే లెక్క. ఇక చివరగా కరోనా కాటుకు బలైపోయిన వాళ్ళ సంఖ్య మహావుంటే 2 లక్షలుంటుంది. అంటే కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం చూస్తే కరోనా వైరస్ దెబ్బకు చనిపోయిన వారిసంఖ్య 2 శాతం కూడా ఉండదు. నిజానికి వైద్య సౌకర్యాలు అరాకొరగా ఉంటు అభివృద్ధిచెందుతున్న మనదేశంలో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మరణాల రేటు 2 శాతం మాత్రమేనంటే సంతోషించాల్సిన విషయమనే చెప్పాలి.




కాకపోతే సమస్య ఎక్కడ వచ్చిందంటే యావత్ మీడియా కరోనాతో ఇబ్బందులు పడుతున్న రోగులను, వైద్య సౌకర్యాలు అరాకొరగా ఉన్న ఆసుపత్రులను, కరోనా మహమ్మారికి బలైపోయిన వాళ్ళను రోజంతా పదే పదే చూపటంతోనే జనాల్లో ఓ విధమైన ఆందోళన పెరిగిపోతోంది. నెగిటివ్ టచ్ కు ఇచ్చినంత కవరేజిని పాజిటివ్ యాంగిల్ కు మీడియా ఇవ్వకపోవటం నిజంగా దురదృష్ణమనే చెప్పాలి. ఎక్కడైనా సమస్య వచ్చినంత తొందరగా పరిష్కారం రాదన్న విషయాన్ని మీడియా మరచిపోయింది. ఇపుడు కరోనా వైరస్ సమస్య కూడా ఇందులో భాగమే. కరోనా నుండి సురక్షితంగా ఉండటానికి వేయించుకోవాల్సిన టీకాల విషయంలో కావచ్చు లేదా రోగులకు ప్రాణావసరమైన ఆక్సిజన్ అందించటంలో కావచ్చు ప్రభుత్వాలు శక్తికి మించే పనిచేస్తున్నాయి. కాకపోతే ఇలాంటి సమస్యలు తలెత్తే ప్రమాదాన్ని ముందుగా అంచనా వేయలేకపోవటమే అసలైన ఫెయిల్యూర్.




కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని దాని ప్రభావం దేశంపై విరుచుకుపడుతుందని శాస్త్రజ్ఞులు, వైద్య నిపుణులు ఫిబ్రవరి-మార్చిలోనే ప్రధానమంత్రి నరేంద్రమోడిని హెచ్చరించారు. అయితే ఐదురాష్ట్రాల ఎన్నికల్లో లబ్దిపొందాలని, కుంభమేళాకు ఎలాంటి ఆటంకాలు కలగకూడదన్న కారణంతోనే హెచ్చరికలను మోడి పట్టించుకోలేదు. మోడి నిర్లక్ష్యం ఫలితాన్ని ఇపుడు యావత్ దేశం అనుభవిస్తోంది. ఇదే సమయంలో ముందే హెచ్చరికలు అందినా ఆసుపత్రుల్లో బెడ్ల సౌకర్యాన్ని పెంచుకోవటం, ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు, ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుకోవటం, సరఫరా వ్యవస్ధను బలోపేతం చేసుకోవటం, వెంటిలేటర్లను అమర్చుకోవటంలో ప్రభుత్వాలు బాగా నిర్లక్ష్యం వహించాయి. దీని ఫలితంగానే ఇపుడు ఎక్కడచూసినా కరోనా సంక్షోభం పెరిగిపోవటం. ఏదేమైనా ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పీడుగా యాక్ట్ చేస్తే మరణాల శాతాన్ని ఇంకా తగ్గించ్చవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: