మార్నింగ్ రాగా : వాళ్లు గోల్డ్ .. ఇంక ప‌త‌కాలేం చేస్తాయ్

ఫ‌స్ట్ కాజ్ : విశ్వ‌క్రీడ‌ల్లో మ‌రో ఇద్ద‌రు భార‌త్ క్రీడాకారిణుల‌కు
....................................బంగారు ప‌త‌కాలు వ‌చ్చే అవ‌కాశం  

గోల్డ్ అంటే ఏంటి స‌ర్
మార్కెట్లో ఉన్న మార‌కం ఎంత
అయినా ద్ర‌వ్య‌నిధితో కొలిచే
ఆశ‌లు ఇవి కావు
నా దేశం ప్ర‌జ‌ల హృద‌య స్పంద‌న‌ల‌కు
తూనిక రాళ్లు ఏం కావాలి
గోల్డ్ అంటే బాధ్య‌త స‌ర్
ఆ ప‌త‌కం వ‌చ్చాక కాదు రాక పోయినా
ఆ పోరాటం ఓ బాధ్య‌త సర్
నేను ప్రేమిస్తున్నాను
ప్రేర‌ణ పొందాక‌నే
వాక్యాల‌నే రాస్తాను
నా సౌధాల‌ను నిర్మిస్తాను..
ఆనందించాలి మీరు ఆనందించాను నేను

రెండు ప‌త‌కాలు వ‌స్తాయి మ‌న‌కు
రెండూ గోల్డ్ అయి తీరుతాయి
మ‌ట్టి నుంచి వ‌చ్చిన విజ‌యాలు అవుతాయి
మీరు అప్పుడు  ఆనందించ‌డం కాదు ఇప్ప‌టి నుంచే
రంగులు సిద్ధంగా ఉంచుకోండి మ‌రొక రంగుల కేళీ
ఆడేందుకు..

 రాత్రి మ‌ళ్లీ అనుకున్నాను అమ్మాయిలేమ‌యినా ఆకాశం నుంచి ఊడిప‌డ్డారా అని! న‌వ్వుకున్నాను. అర్థ‌వంతం అయిన రాత్రుల ద‌గ్గ‌ర అర్థం చెడిన ప్ర‌శ్న‌లు ఉంటాయా అని కూడా అనుకుని న‌వ్వుకున్నాను. దేశాన్ని గెలిపించేది మ‌ట్టి.. మ‌ట్టి నుంచి ముత్య‌పు రాశులు కొన్ని కొత్త కాంతులీనుతూ త‌మ అస్తిత్వం చాటుతాయి. దేశాన్ని న‌డిపించే శ‌క్తులు వీరెందుకు కాకూడ‌దు. మ‌నం టోక్యో లో ప‌త‌కం సాధిస్తేనే మ‌న‌ల్ని మ‌నుషులుగా గుర్తిస్తారు అంటూ నిన్న ఎవ‌రో ఈశాన్యానికి చెందిన మోడ‌ల్ కామెంట్ చేశార‌నుకుం టాను. ఈ విధంగా ఎవ్వ‌రు మాట్లాడినా త‌ప్పే! నాకు ఎంతో ఆనందం క‌లుగుతుంది.

ప‌రాజితుల గురించి
....మాట్లాడాలి క‌దా!
మ‌నం ఇంకా వెనుక‌బాటు అన్న మాట‌లు వ‌దిలి ముందుకుపోతే ఇలాంటి విజ‌యాలు కొన్ని తార‌సిల్లుతాయి. బాధ క‌లిగింది రే ప‌టి వేళ సింధూ గోల్డ్ మెడ‌ల్ సాధిస్తే మ‌ళ్లీ కులం వెతుకులాట ఉంటుంద‌ని విని చ‌దివి న‌వ్వుతో పాటూ బాధ కూడా క‌లిగింది. మ న దేశంలో ఉన్న వ‌స‌తులు వాటి తీరు గురించి ఎవ్వ‌రూ మాట్లాడ‌రు. మ‌న దేశంలో ఉన్న అస‌మాన‌త్వం, అరాచ‌క గుణం, క‌ట్టు బాటు అన్న‌వి ఎంత వ‌ర‌కూ క‌ట్ట‌డి చేస్తున్నాయో ఎవ్వ‌రూ మాట్లాడ‌రు. వీటిపై మాట్లాడి మీరు ఈ దేశం గురించి, ఈ దేశం నుంచి వ‌చ్చిన విజేత‌ల గురించి ప‌రాజితుల గురించి మాట్లాడాలి క‌దా!

చేవ‌చ‌చ్చిన మ‌నుషుల
.............వ‌ల్లే ప్ర‌మాదం

మీరాబాయి చాను ఇంటికి పోయినాక ఏం తింటుంది అన్నది గ‌మ‌నిస్తాం. అవునా! మ‌నం అన్నం తింటే చాలు ఇంకేం కాదు ద‌రిద్ర‌గొట్టు డైట్ డేటాల‌ను ఫాలో అవ్వ‌క్క‌ర్లేదు అని గుర్తిస్తాం. అలాంటి గ‌మ‌నింపే మిగ‌తా విష‌యాల‌పై ఎందు క‌ని ఇవ్వం. ఆమె సింపుల్ సిటీ, ఏమీ లేని రోజు ప‌డిన బాధ, రియో నుంచి ఇంటికి వ‌చ్చిన రోజు పొందిన అవ‌మానం.. ఉత్త చేతుల తో వ‌చ్చినా పొందిన దుఃఖం ఇవేవీ ఎందుకు గుర్తించుకోం. క‌రెక్టుగా రాస్తున్నానో లేదో కానీ ల‌వ్లీనా కూడా ఇలాంటి అవస్థ‌లే ప‌డ్డారు. అమ్మకు క‌రోనా వ‌చ్చాక.. ఆమె కోలుకునే దాకా ఉండి త‌రువాత ఆమె ప్రాక్టీసుకు వెళ్లారు. ఈ దేశానికి చేవ‌చ‌చ్చిన మ‌నుషుల వ‌ల్లే ప్ర‌మాదం ఉంది అని అనుకుంటాను.

ఎడారిలో కోయిల గానం
.............లాంటిది ఈ విజ‌యం
త‌న‌కు ప‌త‌కం రాక‌పోయినా ప‌ర్లేదు కానీ ఆ స్ఫూర్తిలో కొన్ని రోజులు బ‌త‌క‌వ‌చ్చు అని అనిపించేలా చేశారు మేరీ కోమ్.. ఇవ‌న్నీ ఆనందానికి కార‌కాలు. ఇప్పుడు నాయ‌కులు కూడా చాలా హుందాగానే ఆన్స‌ర్లు ఇస్తున్నారు. వాళ్లు కూడా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకు నే మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ల‌కు తెలుసు మ‌న క్రీడాకారుల క‌ష్టం విలువ. మ‌న‌మే ఇంకా తెల్సుకోలేక‌పోతున్నాం. స‌ర్! మీరు ఇంకా ఈ ఒలంపిక్స్ గురించి బాగా రాయాలి అంటే బాధ్య‌త‌గా రాయ‌గ‌ల‌ను కానీ బాగా రాయ‌గ‌లను అన్న మాట మాత్రం నేను ఇవ్వ‌లేను. ఈ దేశం విజ‌యాలు న‌న్నూ నాలాంటి సామాన్యుల‌నూ ఉత్తేజితం చేస్తాయి. అవి వాక్యాల రూపంలో మాట‌ల రూపంలో గొప్పగా ప్ర‌వ‌హిస్తాయి.నాలాంటి వారే కదా వీరంతా అన్న ఒక్క స్పృహ అప్ప‌టిదాకా ఉన్న ఓట‌ముల‌నో నిరాశ‌ల‌నో దూరం చేస్తాయి. ఎడారిలో కోయిల గానం లాంటిది ఈ విజ‌యం అని అనుకుంటాను.

ఆ విష‌యం చ‌దివేక..............
..........మ‌ళ్లీ మ‌ళ్లీ ఆనందించాను
ఇప్పుడు మీరు కూడా ఈ దేశం గురించి మ‌రింత ఆలోచించి స్పందించాలి.ఈ కార‌ణంతోనే నేను రాస్తాను. జాగ్ర‌త్త వ‌హించి నాలుగు మాట‌లు చెప్తాను. ఫ‌లానా వారి కెరియ‌ర్ క్లోజ్..ఇక వాళ్లెవ్వ‌రూ ప‌నికి రారు ఇలాంటి మాట‌లు రాస్తే భ‌లే కోపం వ‌స్తుంది. ఇవ‌న్నీ రాశాక మ‌ళ్లీ మ‌నం ఒంట‌రి అయిపోతాం స‌ర్..అప్పుడు ఓ పీవీ సింధూ లాంటి వారో, లేదా ఇంకెవ్వ‌రో వ‌చ్చి ప‌ల‌క‌రించి వెళ్తారు. న‌వ్వులు రువ్వుతారు.ఈ పాటికే ఆమె ప్రాక్టీసు చేసిన గోపీచంద్ అకాడ‌మీ త‌లుపులు తెరుచుకునే ఉంటాయి. రండి ఆ గుడికి పోయి వ‌ద్దాం. ఇప్ప‌టికీ ఆశ్చ‌ర్యం.. ఆ అకాడ‌మీలోకి ఎవ్వ‌రూ చెప్పులతో వెళ్ల కూడ‌దు అని నిబంధ‌న విధించార‌ని విన్నాను. ఇలాంటి ఆల‌యాలు ఉన్నంత వ‌ర‌కూ గొప్ప గొప్ప విజ‌య నాదాల‌ను నేను వింటూనే ఉంటాను. ఏమో ఎన్ని ఓట‌ములు ఉన్నా నేను నా దైవం త‌ర‌ఫున ప్రార్థిస్తాను. రెండు బంగారు ప‌త‌కాలు మ‌న‌దేశానికి వ‌స్తాయ‌ని చ‌దివేక మ‌ళ్లీ మ‌ళ్లీ ఆనందించాను. సింధూ, ల‌వ్లీనా మీ ఇద్ద‌రికీ జేజేలు.

- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి


మరింత సమాచారం తెలుసుకోండి: