టీడీపీలో ఒక‌ప్పుడు ఒక వెలుగు వెలిగిన మ‌హిళా నాయ‌కులు చాలా మంది ఉన్నారు. అయితే.. ఇప్పుడు వీరు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. మ‌రి వారంత‌ట వారే పార్టీకి దూర‌మ‌య్యారా?  లేక‌.. పార్టీ అధినేత చంద్ర బాబే వారిని ప‌ట్టించుకోవ‌డం లేదా? అంటే.. రెండోదే క‌రెక్ట్ అని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇలాంటి వారి లో ఓసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వ‌ర్గాల‌కు చెందిన నాయ‌కురాళ్లు ఉన్నార‌ని.. చెబుతున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు.. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన మాజీ మంత్రి పీత‌ల సుజాత.. రాజ‌కీయంగా మంచి ఎలివేష‌న్ ఉన్న నాయ‌కురాలు. రెండు సార్లు చంద్ర‌బాబు టికెట్ ఇస్తే.. రెండు సార్లు గెలుపు గుర్రం ఎక్కారు.

అంతేకాదు.. ఆమె సామాజిక వ‌ర్గంలో ఆమెకు మంచి గుర్తింపు, ప‌ట్టు రెండూ ఉన్నాయి. అయితే.. చంద్ర‌బా బు మాత్రం సుజాత‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇక‌, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ స్పీక‌ర్ ప్ర‌తిభా భార‌తి.. ప‌రిస్థితి కూడా ఇలానేఉంది. ఆమె అనారోగ్యంతో ఉన్న‌ప్ప‌టికీ.. ఆమె కుమార్తె గ్రీష్మ‌ను రంగంలోకి తీసుకువ‌చ్చి..చంద్ర‌బాబుకు ప‌రిచ‌యం కూడా చేశారు. మంచి దూకుడు ఉన్న నాయ‌కురాలిగా గ్రీష్మ‌కు పేరుంది. అయితే.. ఆమెను కూడా చంద్ర‌బాబు ప‌ట్టించుకోవ‌డం లేదు. దీంతో స‌త్తా ఉన్న‌ప్ప‌టికీ.. నియోజ‌క‌వ‌ర్గంలో తిరిగి పార్టీని నిల‌బెట్ట‌గ‌లిగే నాయ‌కురాలే అయిన‌ప్ప‌టికీ.. మౌనంగానే ఉన్నారు.

అదేవిధంగా విజ‌య‌వాడ‌కు చెందిన బీసీ నాయ‌కురాలు.. పంచుమ‌ర్తి అనురాధ ప‌రిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీలేదు. పార్టీ ఆమెను అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. పార్టీపై ఉన్న అభిమానంతో ఆమె ఇంకా కొన‌సాగుతున్నార‌ని.. చెబుతున్నారు. అడ‌పా ద‌డ‌పా.. మీడియా ముందు కు వ‌చ్చి.. జ‌గ‌న్‌ను విమ‌ర్శిస్తూ.. ప్ర‌ముఖ మీడియాలో ఎలివేట్ అవుతున్నా.. చంద్ర‌బాబు ఆమెకు కూడా గుర్తింపు ఇవ్వ‌డం లేదనేటాక్ వినిపిస్తోంది. ఇక‌, విజ‌యన‌గ‌రం జిల్లాకు చెందిన మాజీ మంత్రి కిమిడి మృణాళిని ప‌రిస్థితి కూడా ఇలానే ఉంది.

ఇక‌, సీమ జిల్లాల‌కు వ‌స్తే.. మ‌హిళా నేత‌ల‌పై ఆధిప‌త్య ధోర‌ణి కొన‌సాగుతోంద‌నే వాద‌న వినిపిస్తోంది. అనం తపురం జిల్లా శింగ‌నమ‌ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన బండారు శ్రావ‌ణి.. పార్టీలో ఇమ‌డ‌లేక పోతున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. క‌ర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ‌ను పార్టీ అధిష్టానం అస‌లు ప‌ట్టించుకోవ‌డ‌మే మానేసింద‌నే టాక్ వినిపిస్తోంది. ఇలా మొత్తంగా.. చాలా మంది మ‌హిళా నాయ‌కుల‌ను చంద్ర‌బాబు దూరం పెట్టారా?  లేక‌.. వారిని వ‌దిలించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారా? అనే టాక్ వినిపిస్తోంది.

అయితే.. ఇక్క‌డ చెప్పుకోవాల్సిన విష‌యం ఏంటంటే.. వీరందరికీ ఏ కొంచెం ఊత‌మిచ్చినా.. ఫైర్‌బ్రాండ్లుగా రెచ్చిపోయి.. పార్టీకి అండ‌గా ఉంటార‌నే విష‌యంలో ఎలాంటి సందేహం లేదు. మ‌రి చంద్ర‌బాబు ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: