ఫస్ట్ కాజ్ : అవర్ లాస్ ఈజ్ లాస్

మెథడ్స్ అండ్ మోటివ్స్
మోసేవాడెవ్వడో తేలిపోయింది
కాలుతున్న కట్టె వద్దంది నీ ధర్మం
కనుక మట్టిని చేరి మృణ్మయం అవుతావా!
................................................1

 
నీవు లేవు నీ పాట ఉందా?
ఉంటే ఈ పాటను నెత్తిన పెట్టుకున్న వారంతా
నిన్నూ నీ బాధ్యతనూ నెత్తిన పెట్టుకున్నారా
అసలీ స్వీయ సంస్కారం లేని వారంతా
నీ సాయం పొంది కడ చూపుల వేళలో
కడివెడు దుఃఖాన్ని కూడా నీ వారితో పంచుకోలేని వారంతా
నీ అనుకునే ఆ నలుగురు నా అనుకోని నా వరకూ అసలు
అవసరం లేని ఆ నలుగురు..
2................................................మిస్ యూ బాలూ ఒరేయ్ ! ఈ యాష్ ట్యాగ్ ను మాత్రం
ట్రెండ్ ఇన్ లో ఉంచు.. అది బూడిద వాడిదే ఒంటికి పూసుకో !
అదిరా శివతత్వం .. శ్రౌత శైవ ఆరాధ్య సంప్రదాయం..
................................................3
తెలుగును వెలిగించే వాడు లేడు అని రాయడంలో ఏమయినా అర్థం ఉందా? ఆయనదేనా బాధ్యత మరి! నీవేమయ్యావు.. నీ నీడ ఏమయింది..సంస్కృతిని విస్తారం చేయలేని చోట విశ్వాసాలు ఓడిపోతాయి అని చదివేను.. అవును! భాషా సంస్కృతిని విస్తారం చేయలేని చోట మౌన విచక్షణ పాటించడం ఎంత ప్రమాదకరం..అసలు ఈ తరహా విచక్షణనూ లేదా పొందని వివేకాన్నీ ఎలా చూ డాలి. కాలం మరో ఎస్పీబీని ఇస్తుంది అని అనుకోవడంలో అ త్యంత అవమానం ఉంది..నకలు మనుషు లు ఎందుకని.. అసలు మనుషులు వెళ్లిపోయాక.. మిథునం 2 కోసం ఉద్దేశించిన పా ట విన్నాడు ఓ సందర్భంలో రేలా రే రేలా జానకీ రావు పాడాడు ఆ పాట..వెంటనే చె ప్పిన మాట ఏంటో తెల్సునా!పాటను పలికిం చడంలో సంబంధిత పదాలను ఉచ్ఛ రిం చడంలో అక్షర దో షాలు ఉన్నాయని..రేపు ఇవేవీ గమనికలోకి నోచుకోకుండానే ఆ పాడు తా తీయగా కార్యక్రమం హాయిగా నడుస్తుంది.. నవ్వులు లేకుండానే స్వరాభి షేకం హాయిగా సాగిపోతుంది.. ఏం జరిగినా జరగకు న్నా మాధ్యమాలు ఆయనను ఇంకా ఇంకా ఉపయోగించు కుంటూనే ఉంటాయి..(మాకు మిలియన్ వ్యూస్ రాబట్టు కుని తీరడ మే ప్రధాన లక్ష్యం ఏమీ అనుకోకు)


మాయ .. మాయ ! : ఆపండిక నటనలు..
బాలూ పాడిన ఆఖరి గీతం పేరిట డబ్బులు దండుకుంటాయి.. కానీ ఆ పాట సినిమా లో ఉండదు అదే ఆశ్చర్యం.. (చూడండి పలాస సినిమాను) ఏమంటే నిడివి సమస్య .. కథకు అడ్డం..ఇలా ఏవేవో చెప్తారే! రాజమండ్రి కి చెందిన బేబమ్మతో కలిసి పాడిన డ్యూయెట్ అది..!నేను పాడించుకున్నాను అని చెబుతున్న సంగీత దర్శకుడు దు రదృష్టం అది సినిమాలో ఉంచలేకపోయాం అని మాత్రం చెప్పలేకపోతున్నాడే!వహ్వా !ఏం నివాళులు రాస్తు న్నార్రా???భల్లే సెప్తున్నారే అబ్బయ్యా! ఆ పెన్నేటి తీరాన మా మిన్నే టి సూరీడును నువ్వు సూచ్చాండావా! నీకు అది ఎరుకనా!సోమీ! ఆ సోయి నీకుందా..!సోమీ! మీరే ఉద్ధారకులు రేపటి వేళ తెలు గు సినిమా పాటకు.. మీరే భావి భారత రత్నలు కూడా! వద్దండి మేమేమీ అడగడం లేదు కోరుకోవడం లేదు భారత రత్న అనే పురస్కారాన్ని ఇస్తే సంతోషం అని మాత్రమే చెప్పాడు చరణ్..అది హుం దాతనం అంటే పాటించాలి.. పాటించాడు.. కూడా!


సందేహాత్మకత : నేల పులకించిన తీరు ఇక ఉంటుందా!
మేఘమై నేను వచ్చాను..మెరుపులో నిన్ను కలిశాను.. అన్న పాట వింటే.. మేఘా లు పులకించి వర్ష రుతు గానం ఒకటి వినిపించి పోయిన రోజు ఒకటి వస్తే ఎంత ఆ నందిస్తానో!అంతటి స్థాయి తదనుగుణ ఆనందం ఇక దక్కదు..పోనీ వాన రావల్సిన పని లేదు కానీ ఈ కన్నీటి వానలు నటనలు దగ్గరగా లేకుంటే మేలు.. బాలూ గారు ఎందరికో జీవితాన్ని ఇచ్చారు..హీరోలకు మించిన హీ రోగా నిలిచి గెలిచారు..బాలూ మా అన్నయ్య అని చెప్పుకున్న లేదా చెప్పాలనుకుంటున్న వారంతా ఇప్పుడేం చెప్పకపోయినా పర్లేదు..ఆ నిర్జీవ దేహం మీ మాటను వినదు. మీ పనికిమాలిన రా తలు వాడిని కదిలించవు. ఆ హృదయాన్ని కరిగించవు.. మీరు ఏడవద్దు.. అసలు మే కప్పు వేసుకుని మరీ!ఏడవద్దు.. చూడండి కరిగిపోవునేమో! మీ లాంటి దరిద్ర గొట్టు మనుషుల నుంచి మేం నేర్చుకునేదేమీ ఉండదు గాక ఉండదు.. రాత్రి గుడ్డి వెన్నెల చెంత విస్తుబోయాను..నిర్జీవ సహితాలను ఆలోచించి ఆలోచించి మి గిలే దేమీ లేదు మిగులు వ్యామోహం తప్ప అని అనుకుని బాధపడ్డాను. కనుక నా జీవితాన్ని ముం చి పోయిన ప్రవాహాలను ప్రే మిస్తే బాగుంటుంది.. నిదురించిన తోటలోకి పాట ఒకటి వచ్చింది.. ఇప్పుడు శేషేంద్ర మరో సారి పాడవయ్యా! అలా అ యినా ఆ భద్రాది రాము డు..శ్రీశైలం మల్లన్న..ఏడుకొండల ఎంకన్న సల్లంగ సూస్తరే మో! ఆయనను అండ్ ఆ యన కుటుంబాన్నీ.. చరణ్ ఒకే మాట అన్నాడు అవర్ లాస్ ఈజ్ లాస్..కారణాలు వెతుక్కోలేం.. ఈ దుఃఖాన్ని తీరాలను దాటించలేం.. ఏవి ఎలా ఉండాలో అలానే ఉం డాలి. మీరు కేవలం యథాతథంగా మీ ఆర్తినీ ఆవేదననూ ఆ తథాగతుడికి నివేదిం చడం మరువొద్దు.. ప్రియ జనులారా!
ఒక వీధి కథ : నివాళించు నా మదిలోన నివేదించనీ
ఆస్పత్రి నుంచి ఎస్పీబీ ఇంటి వరకూ 70 కిలో మీటర్ల దూరం.. దారంతా ప్రజలు న్నారు.. అంబులెన్స్ పోతుంటే పూల దండలు వి సిరి నివాళి చెప్పారు.. తమిళియన్లు గొప్పవారు..ఆ పాటి మన సినిమా పరిశ్రమకు లేదను కునేందుకు మనం సిగ్గు పడాలి. లేదా మనం ఏడ్పులు సోషల్ మీడియాకే పరిమితం అని భావించి దరిద్రగొట్టు వకీలు కవిత్వం రాసిన వినిపించిన వారందరికీ ఓ నమస్కారం చెప్పి పోవాలి..అయినా బాలూ మావాడే మనవాడే! ఏం అయినా వాడు తెలుగు వాడు.. నెల్లూరోడు..హరి కథలు చెప్పుకుని తిరిగే నాన్నకు సంప్రదాయంలో వారసుడు. బా ధ్యత గల కొడుకు..చరణ్ కూడా అలాంటి బాధ్యతను నిర్వర్తించగలడో లేదో కానీ ఎస్పీ బీ కి కుటుంబం విలువ తెల్సు .. సమాజం విలువ తెల్సు .. సమాజానికే ఎస్పీబీ వి లువ తెలియదు..ఇక తెలియనవస రం లేదు కూడా! పనికిమాలిన మీడియా కూడా ఇలానే ఉంటుంది.. ఉండాలి కూడా!


మరణాన్ని ఎలా చూడాలన్నది ఎప్పటి నుంచి వెన్నాడుతున్న ప్రశ్న.. ఓ మనిషి త న జీవిత కాలం నుంచి గ్రహించినవి విడిచి పో యాక ఇంకా ఏదయినా ఆయనకు కొ నసాగింపు ఉంటుందా అన్నది మరో సందిగ్ధావస్థ.. చెప్పాను కదా! సందిగ్ధావస్థలను దాటి న చాలు సందర్భ సహితాల్లో నిర్థారణలు స్థిరం అవుతాయి అని..! అయినా! ఎ స్పీబీ నీ ఆయన పాడిన పాటనీ ఏమయినా అ నొ చ్చు కానీ కడచూపు దక్కించు కునేందుకు కూడా ప్రాధాన్యం ఇవ్వని వారిని ఏమనాలి? మా నాన్నకు కరోనా నెగి టివ్ వచ్చిం ది... ఆ రిపోర్ట్ కూడా ఆస్పత్రి వర్గాలే ద్రువీకరించాయి.. మీరు నాన్నను చూడాలనుకుంటే రావొచ్చు.. నాన్నకు కన్నీటి నివాళి ఇవ్వవ చ్చు అన్నచరణ్ మా టలు ఎలా మరువగలం. అయినా.. ఇప్పుడు రాజా గురించి మాట్లాడను.. ఆయన ఏ దో దీపం వెలిగించాడు.. తిరువణ్ణామలై వెళ్లి.. కడచూపు మాత్రం దక్కించుకోలేదు..ఏ దో పాట పాడాడు.. ఆ తమిళ్ పాట లోతేంత నా వరకూ తెలియదు.. ఇంకా ఏదో ఏడ్చా డు.. ఏడ్వనీ..ఇంకా ఏడ్వాలి కూడా!


 
వెతుక్కో నీ వారెవ్వరో.. మిస్టర్ బాలూ!
నీవేం పాడావో అన్నది..రికార్డుల గోల నుంచి విన్నానా..నీవేం అరిచావో అన్నది..నీ మాటల నుంచి గ్రహించానా..ఏమో రా బాబూ! అరిస్తే పజ్యెం..అయిందా ఎందుకని?స్మ రిస్తే వాజ్యమా ఎందుకు..అవును ఇది వాద్యం కాదు వాజ్యమే!ఈ ప్రజా న్యాయ స్థా నాన ఓ డిపోయిన వారందరికీ నీవు ఓ ఆదర్శ మూర్తివి నీవు వెళ్లి అక్కడున్న వా రితో చెప్పుకో!ఇక్కడ నీ బరువూ నీ పరువూ మోసిన వారెవ్వరో వెతుక్కో! వెనుక ప్రవాహాలు మంచే చేస్తాయా? ఏమో చదివేను..సంస్కృతి వెనుక ప్రవాహం అని నీ వె నుక ప్రవాహం అని..మిస్టర్ ప్రకాశ్!యూ ఆర్ రైట్ .. మర్డర్ చేసి వచ్చాక కూడా కార ణాలు వెతుక్కోవాలి.. ఎలానూ నిన్ను మిస్ చేశాక ఇంకా ఏముందని నీవున్నావో లేవో అన్న కారణాలూ ఆరాలూ పేరాలూ పేజీలూ పేలాలూ.. ఎందుకు అయ్యా! ఏం కాదు నీవు లైఫ్ ఇ చ్చిన వారు ఎక్కడున్నారో ..ఉంటే ఉండనీ.. పట్టించుకోకు! అలానే నీ ఉప్పు తిన్న వారెవ్వరో ఉంటారా వారంతా ఆ సంస్కారం మ రిచారని మరీ!మరీ! దుఃఖిం చకు ఎలా ఉన్నావో అలానే ఉండు ..నిన్ను బాగు చేసిన వారూ చెడగొట్టిన వా రూ అంతా ఏకమై పోతా రు..నీ కీర్తిని పంచుకుని తీరడంలో..హాయిగా ఉండ్రా సుబ్బి గా!నీ స్వర లిపి లాక్షణికతలో..


 - రత్నకిశోర్ శంభుమహంతి ఆర్ట్ : రాకేశ్ , ఆంధ్రజ్యోతి


 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

ap