రవీంద్రుడే   నేటి  ఆదర్శం
విశ్వకవి రవీంద్ర నాథ్ ఠాగూర్ గుర్తున్నారా?  కాలంతో పరుగులు తీస్తున్న నేటి తరం విద్యార్థినీ విద్యార్ధులు తప్పకుండా  చిన్న వయసులోనే తెలుకుకోవాల్సి న పేరు. నోబెల్ బహుమతి గ్రహీత. పిల్లలకు విద్యను ఎలా నేర్పించాలి ? అన్న విషయమై దశాబ్దాల క్రితమే  ప్రపంచానికి దిశానిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి. భారత దేశంలో ఈ మహానుభావుడ్ని అనుసరించే వారు,  ఆయన మార్గాన్ని అచరణలో పెడుతున్న ప్రభుత్వాలు తక్కువే . అమెరికా , డెన్మార్క్ , నెదర్లాండ్స్ వంటి  వంటి దేశాలు  రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలోచనలకు అనుగుణంగా  పిల్లలకు విద్యను నేర్పిస్తున్నాయి. ఆయన పశ్చిన బంగాల్ లో ఏర్పాటు చేసిన శాంతి నితేకన్  గురుకుల పాఠశాలలో ని విద్యా విధానాన్ని అనుసరిస్తున్నాయి. బహిరంగ ప్రదేశాలలో పాఠశాలలు నడపాలని, విద్యార్థులను యాంత్రికంగా కాకుండా మేథో వికాసం కలిగించేలా వారికి విద్యనందించాలని రవీంద్ర నాథ్ ఠాగూరా్ చెప్పారు.
కోవిడ్-19 వ్యాప్తి నేపద్యంలో పిల్లల చదువులు ఎలా ? అన్న ప్రశ్న చాలా మంది తల్లితండ్రుల మదిలో మెదలుతోంది. కోరనా కారణంగా  బాగా దెబ్బతిన్న రంగాలలో విద్యారంగం ఒకటి. ముఖ్యంగా ప్రాథమిక విద్యారంగం.  కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా చాలా మంది  తల్లితండ్రలు తమ పిల్లలను బడులకు పంపండం లేదు.  మరీ ముఖ్యంగా చిన్న పిల్లలను. ఆన్ లైన్  క్లాసులు జరుగుతన్నా చిన్న పిల్లలు  వాటి ద్వారా నేర్చుకుంటున్నది అంతంత మాత్రమే. ఇది ప్రతి ఒక్క తల్లితండ్రులు చెబుతున్న మాటే. కోవిడ్-19 మహమ్మారి ఎలా ఎదుర్కోవాలి ? అన్న విషయమై భారత్ తో బాటు  ప్రపంచ మానవాళికి  ఎప్పటి కప్పుడు దిశా నిర్దేశం చేస్తున్న ఐ.సిఎం.ఆర్ తాజా గా కొన్ని సూచనలు చేసింది. చిన్నారి విద్యార్థులకు పాఠాలు నేర్పించే  దశల వారీగా నేర్పించాలని గతంలో సూచించిన ఐసిఎంఆర్ తాజాగా మరిన్ని సూచనలు చేసింది. తరగతిలో బోధన కంటే,  గది వెలుపల, గాలి వెలుతురు వచ్చే విధంగా ఉన్న ప్రాంతంలో విద్యాబోధన చేయాలని  సూచించింది. అలా చేయం వల్ల ఎవరికైన కోవిడ్-19 లక్షణాలు ఉన్నట్లయితే త్వరగా గుర్తించ వచ్చని పేర్కొంది. మూసి ఉన్న గదులతో పోలిస్తే ఆరుబయట  పాఠాలు చెబితే  కోవిడ్ వైరస్ తక్కువగా  వ్యాపించే అవకాశం ఉంటుందని  వివరించింది.   తరగతి గదులు మూసివేసి ఏసీ లు వేయడం మానుకోవాలని తెలిపింది. తరచుగా పిల్లలకు పరీక్షలు నిర్వహించాలని చెప్పింది. జ్వరం ఉందా ? లేదా ? అన్న విషయాన్ని చూడడటం, ఉష్ణోగ్రతా శాతాన్ని గణించడం లాంటి పనుల వల్ల పెద్దగా ఒరిగేది ఏమీ లేదని వ్యాఖ్యానించింది.  ప్రతి బడిలోనూ ఒక పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసుకునే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించిది. భోజన విరామ సమయంలో విద్యార్థులందరూ ఒకే చోట గుమికూడకండా చూడాలని, ఒకరి బోజనాన్ని మరోకరు షేర్ చేసుకోకుండా  తగు  చర్యలు తీసుకుంటే కోవిడ్-19  వ్యాప్తి తక్కువగా ఉండే అవకాశం ఉందని ఐసిఎంఅర్ తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: