రెండు రోజుల్లో 90 శాతం పెరిగి న  గ్యాస్ ధర!   ఎక్కడో తెలుసా ?

కరోనా మహమ్మారి దెబ్బకు  ఆ ప్రాంతం అతలాకుతలం అయింది. పర్యాటక రంగం పై ఆ ప్రాంత జనులు జీవనం సాగిస్తారు.   కోవిడ్-19 మూలంగా ఆ ప్రాంతానికి పర్యాటకుల రాక తగ్గింది. దీంతో సంక్షోభం ఏర్పడింది.  నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయి.  రోజు రోజుకూ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో సమాన్యుడు దిక్కుతోచని స్థితిలోకి నెట్టబడుతున్నాడు. ఇది  భారత దేశ చిత్రాపటానికి దక్షిణాన ఉన్ శ్రీలంక ద్వీపం పరిస్థితి.  


 ఆ దేశంలోని  సరిహద్దు ప్రాంతాలను చైనా దేశం అభివృద్ధి నడకల పేరుతో ఆక్రమించింది. వేలకోట్ల రూపాయలతో నిర్మాణాలు చేస్తోంది. దీంతో అక్కడి ప్రజలు ప్రభుత్వ అనాలోచిత చర్యలను ప్రశ్నంచ లేదు. ప్రభుత్వం కూడా ప్రజల బాగోగుల గురించి ఆలోచించ లేదు. దేశం స్వయం సంవృద్ధిని  క్రమంగా కోల్పయింది. ఫలితంగా  ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. దీనికితోడు పాలకులు చైనా  ప్రభుత్వాధి నేతల మాటలు నమ్మి ఎగుమతుల పై నిషేధం విధించారు.   దీని ప్రభావం పరోక్షంగా దిగుమతులపై పడింది. విదేశీ మారక ద్రవ్యం నిల్వల పై ప్రభావం పడటంతో శ్రీ లంకకు విదేశాల నుంచి దిగుమతులు తగ్గాయి.  దేశంలో  గోదుమలు, చక్కెర , వంటి ఆహార దినుసులతో పాటు కూరగాయలు కూడా  దిగిమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిషేధాజ్ఞల మూలంగా దిగుమతులు మందగించడంతో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

 గత రెండు రోజుల్లో పాల ధర  ఐదింతలు పెరిగింది శ్రీలంక కరెన్నీ ప్రకారం ప్రస్తుతం పాల ధర లీటరు 1200 రూపాయల వరకూ ఉంది. అదే విధంగా గ్యాస్ ధర తొంభై శాతం పైగా పెరిగింది. శ్రీలంక కరెన్సీ ప్రకారం గ్యాస్ సిలెండర్ ధర  రెండు వేల ఏడు వందల రూపాయల వరకూ ఉందని శ్రీలంక పత్రికలు పేర్కోన్నాయి. పరిస్థితిని గమనించిన శ్రీ లంక అధ్యక్షుడు రాజ్ పక్సే అత్యవసరంగా  మంత్రి మండలిని సమావేశ పర్చారు.   కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవి ఏ మాత్రం ప్రజలకు ఉపయుక్తే కాలేదు.  అక్కమ నిల్వలు తగ్గించేందు కంటూ శ్రీ లంక మంత్రి మండలి తాజా నిర్ణయం ఇలా ఉంది. ఎవరైనా  తమ వద్ద ఉన్న సరుకులను ఎక్కడైనా విక్రయించు కోవచ్చని  సడలింపులు ఇచ్చింది. దీంతో  సరుకుల ధర పై నియంత్రణ లేకుండా పోయింది. ఫలితంగా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి:

gas