అమ్మ‌ను స్మ‌రిస్తూ చేసుకునే పండుగ..శ‌ర‌న్న‌వ‌రాత్రుల వేళ అమ్మ‌ను పూజిస్తూ చేసుకునే పండుగ..ద‌స‌రా..దుష్టుల‌ను శిక్షించ‌డం అమ్మ బాధ్య‌త.. మంచి వాళ్ల‌ను ర‌క్షించడం ఆమె క‌ర్త‌వ్యం..బాధ్య‌త‌ను మ‌రిచిపోవ‌డం అన్న‌ది దైవిక శ‌క్తి చేయ‌దు క‌దా! అందుకే ఆ చ‌ల్ల‌ని త‌ల్లికి దీవెన‌లు అడుగుతున్నాను. గొప్ప శ‌క్తిని ఆవాహ‌న చేస్తున్నాను.. మీ అంద‌రికీ ఇండియా హెరాల్డ్ మీడియా శుభాకాంక్ష‌లు చెబుతోంది. ఆరంభంలో ఓ ప్ర‌శ్న ఉంది చూడండి..ఈ ద‌స‌రా ఎవ‌రిది? ఎవ‌రికి ? అని....


పండుగ అంటే మ‌న ప‌ల్లెలు గుర్తుకు రావాలి. పండుగ అంటే స‌క‌ల సంతోషాలూ విలసిల్లాలి. విరాజిల్లాలి. పండుగ అంటే తార‌త‌మ్య భేదాలు పోవాలి.లేదా పోయేందుకు కృషి చేయాలి. ఐక్య‌త‌ను చాటేందుకు పండుగ‌లు గొప్పనైన బాధ్య‌త‌ను మోసుకుని వ‌స్తాయి. మ‌నుషులు న‌గ‌రాల్లో, ప‌ల్లెల్లో విడివిడిగా ఇప్పుడంతా ఉంటున్నారు. ఈ విధంగా ఉండ‌డం తప్పు! తోటి వారి క‌ష్టం ఏమీ అర్థం చేసుకోకుండా ఉండ‌డం ఇంకా త‌ప్పు! క‌నుక ద‌స‌రా పండుగ అంద‌రికీ ఆనందాలు ఇవ్వాలి. లేనివారిని ఆదుకోవాలి. ఉన్న‌వారితో ఆ ప‌ని మ‌నం చేయించాలి. ఉన్న‌వారు అంటే ఎవ‌రు?

మంచి మ‌న‌సు, మంచి బుద్ధి సక‌ల జ‌న హితం కోరే బుద్ధి ఉండాలి. అమ్మ ఎవ‌రు బుద్ధి ప్ర‌దాయిని. లోకాన్ని పాలించే జ‌గ‌న్మాత‌ను నేను వేడుకుంటున్నాను. ఈ రోజున అమ్మ‌కు వంద‌నాలు చెల్లించాను. మ‌నుషుల్లో కుళ్లూ కుతంత్రం తొల‌గి ఉన్న‌వారు అన‌గా మంచి మ‌న‌సున్న వారంతా దారిద్ర్యంతో బాధ‌ప‌డుతున్న వారికి అండ‌గా ఉండాలి. ప్ర‌భుత్వాలు అన్ని రంగాల‌ను  వృద్ధిలోకి తీసుకుని రావాలి. ఆస్తుల‌ను తాక‌ట్టు పెట్టి అప్పులు తెచ్చే వ‌క్ర బుద్ధికి వీడ్కోలు చెప్పాలి. పండుగ అంటే సంతోషం..అమ్మానాన్న‌ల సంతోషం. ఈ రాష్ట్రం సంతోషం. ఈ దేశం సంతోషం. మీరు ఈ సంతోషం కోసం ప‌నిచేయాలి.. నాయ‌కులారా! వింటున్నారా.. ఉన్న‌వారు అంటే మంచి బుద్ధికి మంచి సంక‌ల్పానికి ప్రాధాన్యం ఇచ్చే వారు అని! ఈ త‌ర‌హా ఆలోచ‌న‌ల‌కు ఈ ద‌స‌రా సాయం చేస్తే చాలు. అమ్మ‌కు మ‌ళ్లీ వంద‌నాలు చెల్లించండి. సంస్కృతి బాగుంటే మ‌నం బాగుంటాం.
సంస్కృతిని కాపాడేందుకు మ‌నం కృషి చేస్తే చాలు. అమ్మ అనుగ్ర‌హ సిద్ధి,  ప్రకృతి వ‌రం త‌ప్ప‌క అందుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: