మంచి నాయ‌కుల‌ను చూసి చాలా కాల‌మయింది నా ప్రాంతానికి మా ఊరికి కూడా! తెలుగు నేల‌కు మంచి నాయ‌కులు అంటే డ‌బ్బులు పంచే నాయ‌కులు, అవ‌స‌రం కోసం పార్టీలు మారే నాయ‌కులు అని మాత్ర‌మే తెలుసు కానీ త‌మ కోసం కాకుండా ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసిన నాయ‌కులు అప్పుడెప్పుడో ఉన్నారు. ఇప్పుడు ఇక్క‌డ లేరు. త‌మిళ నేల‌లో ఉన్నారు. ఆ ఇరుగింటి క‌థ ఇది. ఇంగ్లీషులో నైబ‌ర్ హుడ్ స్టోరీ అని ప‌లకాలి.


మ‌న తెలుగు రాజ‌కీయాల్లో అనూహ్యం అనుకునే ప‌రిణామాలు అన్నీ ప్ర‌జ‌ల చుట్టూ కాకుండా నాయ‌కుల చుట్టూ వారి స‌మీక‌ర ణల చుట్టూ తిరుగుతాయి. తెలుగు రాజ‌కీయాల‌కు నట‌న త‌ప్ప మ‌రో ప‌ని చేత‌గాదు. ఏ పార్టీ కూడా ఇందుకు మిన‌హాయింపు కా దు. అంతేకాదు ప్రాంతీయ స్పృహ‌, బాధ్య‌త అన్న‌వి మ‌న‌లో లేవు. ఇక‌పై ఉండ‌వు కూడా!



హ‌క్కుల కోసం మ‌నం పోరాడ‌డం అన్న‌ది ఎప్పుడో మ‌రిచిపోయినాం. అయినా కూడా కొన్ని సంద‌ర్భాల‌ను చూశాక మ‌న నాయ కుల‌కు, ఇరుగు రాజ‌కీయాల‌ను, పొరుగు నేత‌ల‌ను చూశాక కాస్త‌యినా ప‌రిణామాలు మారుతాయేమో అని ఆశించ‌డంలో త‌ప్పేం లేదు. మ‌న నేతాశ్రీ‌ల‌కు మార్పు కోరే ప‌రిణామాలు అంటే అంత‌గా ఇష్టం లేకున్నా చెప్ప‌క త‌ప్ప‌దు. ఇప్పుడు చెప్ప‌బోతున్న నేత స్టాలిన్ గా తెలుగు వారికి మంచి ప‌రిచ‌యం ఉన్న నేత. ఓ విధంగా మ‌న మూలాలు తెలిసిన నేత అని చెప్ప‌వ‌చ్చు. ఆ మాట‌కు వ‌స్తే మ‌న తెలుగు ఆయ‌న‌కు అర్థం అవుతుంది. ఆయ‌న మంత్రి వ‌ర్గంలో తెలుగు మాట్లాడే వారు కూడా ఉన్నారు. మ‌న తెలుగు కు గౌరవం అందిస్తారు కూడా!

స్టాలిన్ మంచి నాయ‌కులు అని చెప్ప‌డం క‌న్నా మంచి బుద్ధి ఉన్న నాయ‌కులు అని చెప్పేందుకే ఎక్కువ‌గా డీఎంకే శ్రేణులు, త‌మి ళ ప్ర‌జ‌లు ఇష్ట‌ప‌డుతున్నారు. క‌రోనా నేప‌థ్యంలో ఆయ‌న‌కు ఓ చిన్నారి ఉత్త‌రం రాస్తే వెంట‌నే స్పందించారు. బ‌డులు ఎప్పుడు తెరుస్తారు అని ఓ లేఖ రాసి త‌న ఫోన్ నంబ‌ర్ పొందు ప‌రిస్తే వెంట‌నే కాల్ చేసి, న‌వంబ‌ర్ 1 నుంచి బడులు తెరుస్తామ‌ని చెప్పారు. మీరు బ‌డుల‌కు వెళ్లేట‌ప్పుడు కోవిడ్ నిబంధ‌న‌లు త‌ప్ప‌క పాటించాల‌ని కూడా  కోరారు. మంచి ముఖ్య‌మంత్రి అంటే అన్నింటికీ స్పందించ‌డం. ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను తెలుసుకోవ‌డం. తన సుఖాల‌ను త‌గ్గించుకోవ‌డం. త‌న సౌక‌ర్యం క‌న్నా ప్ర‌జా ప్ర‌యోజ‌నానికి ఎక్కు వ ప్రాధాన్యం ఇవ్వ‌డం. ఈ గుణాలు స్టాలిన్ లో ఉన్నాయి. అందుకే ఆయ‌న మంచి నాయ‌కులుగా గుర్తింపు పొందుతున్నారు. మ న నాయ‌కులు ఏమ‌యినా ఆయ‌నను చూసి నేర్చుకుని త‌మ కాన్వాయ్ ను త‌గ్గించుకుంటారా..?  ఫొటోల పిచ్చి వ‌ద్ద‌నుకుంటా రా..? రంగుల  పిచ్చి వద్ద‌నుకుంటారా?  హోసూరు టైటాన్ టౌన్ షిప్ న‌కు చెందిన ఆరేళ్ల ప్ర‌జ్ఞ రాసిన ఉత్త‌రంతో ఆయ‌న స్పందించా రు. మ‌రి! మ‌నోళ్లు? నో కామెంట్ స‌ర్ !


మరింత సమాచారం తెలుసుకోండి: