వ్య‌క్తిగ‌త జీవితాల‌పై మ‌నం ఏం అయినా రాయొచ్చు అనుకునే మీడియాకు ప్ర‌భాస్ ఎప్పుడూ దూరంగానే ఉంటారు. ఫిల్మ్ ప్ర‌మోష‌న్స్ త‌ప్ప ఎప్పుడూ మీడియాలోనూ, డిజిట‌ల్ డ‌యాస్ ల‌పైనా క‌నిపించ‌డు గాక క‌నిపించ‌డు. నేను న‌మ్ముకున్న వృత్తిని ప్రేమించడం మిన‌హా ఇంకేం చేయ‌లేను. మీరు ఎన్ని రాసినా వాగినా అవ‌న్నీ మీ విజ్ఞ‌త అని చెప్పి త‌ప్పుకుంటాడు. వివాదాల‌కు దూరంగా ఉంటూ ఇండ‌స్ట్రీలో మంచి సినిమాలకు త‌న‌వంతు సాయం చేస్తాడు. అండగా ఉండి తోటి హీరోల స‌క్సెస్ ల‌నూ ఎంజాయ్ చేస్తాడు. ఆ విధంగా యువ రాజు ఆయ‌న. మ‌న‌సున్న మ‌హ‌రాజు ఆయ‌న. నిజంగానే మిర్చి లాంటి కుర్రాడే.. కోపం వ‌స్తే.. అందాక త‌న‌ని తాను నియంత్రించుకోగ‌ల స‌మ‌ర్థుడు కూడా! ఏం చేసినా పెద్ద‌నాన్న కృష్ణం రాజు కు చెడ్డ పేరు తీసుకుని రాన‌ని ప‌దే ప‌దే అంటుంటాడు ప్ర‌భాస్. త‌న త‌ర‌ఫున న‌లుగురికీ మంచి చేసే అభిమానులంటేనే త‌న‌కు ఇష్టం అని ప‌దే ప‌దే అంటుంటాడు.


ఇంకేం చెప్పాలి... వాట్ నెక్ట్స్...
ఇవాళ ప్ర‌భాస్ పుట్టిన రోజు. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పుట్టిన రోజు. ప్యాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ పుట్టిన రోజు. డార్లింగ్ పుట్టిన రోజు. ఇంకా ఎన్నో మంచి సంద‌ర్భాలు మీ జీవితాన రావాలి స‌ర్..అని అభిమానులు ఆకాంక్షిస్తూ పండుగ చేసుకుంటున్న రోజు. పుట్టిన రోజు పండుగ రోజు. అమ్మ నాన్న‌ల‌కు ఆనందం క‌లిగే రోజు. పుట్టిన రోజు పండుగ రోజు.. త‌న‌ను న‌మ్ముకున్న ద‌ర్శ‌కుల కూ, నిర్మాత‌ల‌కూ పండుగ రోజు. అవును! పుట్టిన రోజు పండుగ రోజు కొత్త సినిమా క‌బుర్లు వినే రోజు. ఆన్ ద సెట్స్  విశేషాలు వినే రోజు. పుట్టిన రోజు పండుగ రోజు.. ప్ర‌భాస్ గురించి కొన్ని ఆస‌క్తిదాయ‌క వివ‌రాలు విశేషాలూ అందుకునే రోజు. చ‌దువుకునే రోజు. పుట్టిన రోజు పండుగ రోజు.. నాల్గంటే నాల్గు మంచి మాట‌లు.. అంత‌కుమించి నాల్గంటే నాల్గు మంచి ప‌నులు చేసే రోజు.. అంద‌రి మేలు కోరే రోజు.. తారల పుట్టుక అంద‌రికీ ఆనందాలే..


అప్ప‌టిదాకా కొన్ని రూమ‌ర్స్ ఉన్నాయి. అప్ప‌టిదాకా ఏవో కొన్ని క‌థ‌నాలు న‌డిచాయి. అవ‌న్నీ బుజ్జి గాడికి నవ్వు పుట్టించాయి. కొన్ని సార్లు అవి కాస్త టూమ‌చ్ అవ‌డంతో బాధ‌పెట్టాయి కూడా! అయినా ప్ర‌భాస్ మాట్లాడ‌డు. త‌న ప‌ని తాను చేసుకుని పోతాడు. అయినా ప్ర‌భాస్ మాట్లాడ‌డు చెన్న‌య్ దారుల్లో త‌న ప‌ని తాను చేసుకుని పోతాడు. హైద్రాబాద్ వీధుల్లో త‌న ప‌ని తాను చేసుకుని పోతాడు. అయినా హీరోయిన్ అనుష్క‌తో ఆయ‌న ప్రేమ‌లో ప‌డ్డార‌న్న వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి. ఇంకా చెప్పాలంటే నెట్ట్టింట్లో వైర‌ల్ అయ్యాయి. ఇవ‌న్నీ ప్ర‌భాస్ ను క‌దిలించాయి. ఎందుక‌ని వీళ్లంతా ఇలా చేస్తున్నార‌ని?


మరింత సమాచారం తెలుసుకోండి: