హుజూరాబాద్ ఉపఎన్నిక ఇప్పుడు తెలంగాణ కళ్లన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇవాళ పోలింగ్ జరిగింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన పోరు కావడంతో ఈ ఎన్నిక ఫలితంపై అంతటా ఆసక్తి నెలకొంది. అయితే.. ఇక్కడ ఎలాంటి ఫలితం వస్తే.. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్న చర్చ కూడా జరుగుతోంది. ఒకవేళ ఇక్కడ ఈటల రాజేందర్ నెగ్గితే.. అది బీజేపీ గెలుపు అవుతుందా.. ఈటల రాజేందర్ నెగ్గితే.. అది బీజేపీ ఆధిపత్యానికి సహకరిస్తుందా అన్న వాదనలు సాగుతున్నాయి.


నిజమే.. ఈటల గెలిస్తే.. అది కచ్చితంగా ఆయన వ్యక్తిగతమైన గెలుపుగానే భావించాలి. ఏదో ఒక పెద్ద పార్టీ అండకావాలన్న ఉద్దేశ్యంతో ఈటల బీజేపీలో చేరారు తప్ప.. బీజేపీ సిద్ధాంతాలు నచ్చో.. బీజేపీ వాదంపై అభిమానంతోనే ఈటల బీజేపీలో చేరలేదన్న సంగతి తెలిసిందే. దీనికి తోడు.. హుజూరాబాద్‌లో గెలుపు కోసం ఈటల తన సర్వశక్తులు ఒడ్డి పోరాడారు.. అధికార పార్టీకి దీటుగా ఆయన సొంత ఆస్తులు కరిగించినట్టు కనిపిస్తోంది. హుజూరాబాద్‌లో సిద్ధాంతాల రాద్ధాంతాలు ఎలా ఉన్నా.. ఓట్లకు నోట్ల పంపిణీ కూడా ఘనంగానే జరిగిందన్న ప్రచారం సాగింది.


ఒక విధంగా ఇవి దేశంలో అత్యంత ఖరీదైన ఎన్నికలుగా చెబుతున్నారు. మరి ఇలాంటి ఎన్నికల్లో ఒకవేళ టీఆర్ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలిస్తే మాత్రం అది కచ్చితంగా కేసీఆర్ గెలుపుగానే భావించాలి. అంత కంటే ఎక్కువగా అది హరీశ్ రావు గెలుపుగానూ భావించాలి. అంత తప్ప గెల్లు శ్రీనివాస్ గెలుపు అని మాత్రం ఎవరూ అనుకునే పరిస్థితి లేదు. ఇక ఈటల రాజేందర్‌కు ఈ ఎన్నికల్లో గెలుపు ద్వారా రాజకీయంగా ఉనికి ఉంటుంది. ఆయన బీజేపీలో కీలక నాయకుడుగా ఎదిగే అవకాశం లభిస్తుంది.


ఒకవేళ ఈ ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ గెలిస్తే మాత్రం.. ఆ గెలుపు కచ్చితంగా కేసీఆర్ గెలుపే.. ఆ గెలుపు కచ్చితంగా హరీశ్ రావు గెలుపే.. అంత తప్ప.. గెల్లు శ్రీనివాస్ గెలుపు మాత్రం కాదు. అందుకే ఈటల గెలిస్తే బీజేపీ గెలిచినట్టు కాదు కానీ.. గెల్లు ఓడితే మాత్రం కేసీఆర్ ఓడినట్టే..


మరింత సమాచారం తెలుసుకోండి: