ఆంధ్రప్రదేశ్‌లో అరాచకం జరిగిపోతోంది.. అధికార వైసీపీ ప్రతిపక్షాలను బతకనివ్వడం లేదు.. ఏకంగా పార్టీ ఆఫీసులపై పడి దాడులు చేస్తున్నారు. అసలు ఏపీలో రూల్ ఆఫ్ లా యే లేదు.. ఆంధ్రప్రదేశ్‌లో ఎమర్జన్సీ పెట్టేయండి.. ఏపీలో రాష్ట్రపతి పాలన రావాల్సిందే.. ఇక ఈ జగన్ ఆగడాలు భరించలేం.. అంటూ కొన్ని రోజుల క్రితం ప్రతిపక్షనేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ కేంద్రం పెద్దల అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే.


అయితే ఢిల్లీలో చంద్రబాబుకు అమిత్‌ షా అపాయిట్ మెంట్ దొరకలేదు. పాపం. ఒకటి, రెండు రోజులు ఉండి ఏపీకి వచ్చేశారు. ఆ తర్వాత.. అబ్బే.. నేను లఢాక్ పర్యటనలో ఉండి మిమ్మల్ని కలవలేకపోయానండీ బాబుగారూ.. అంతా కుశలమేనా.. అని అమిత్‌ షా ఫోన్‌ చేసినట్టు టీడీపీ వర్గాలు చెప్పుకున్నాయి. అందులో నిజాల సంగతి మనకు తెలియదు. అయితే.. ఢిల్లీ వెళ్లి మరీ ప్రయత్నించినా అపాయిట్‌మెంట్ దొరలేదు సరే..కానీ.. ఇప్పుడు అదే అమిత్‌ షా మన ఏపీకి వచ్చేశారు.


దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం కోసం అమిత్‌ షా ఏపీ వచ్చారన్న సంగతి తెలిసిందే. ఆయన రెండు రోజుల పాటు తిరుపతిలోనే ఉన్నారు. తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు కూడా. మరీ అంత బిజీగా కూడా ఏమీ లేరు. పనిలో పనిగా పార్టీ కార్యక్రమాలు కూడా చక్కబెట్టుకున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి స్వర్ణ భారత్ ట్రస్టు కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు.


మరి అలాంటప్పుడు.. చంద్రబాబు ప్రయత్నిస్తే అమిత్‌ షా అపాయింట్‌మెంట్ దక్కేదే.. మరి చంద్రబాబు ఎందుకని ఆ ప్రయత్నం చేయలేదు..  అమిత్‌ షాను తిరుపతిలో కలుసుకుని.. ఇదండీ జగన్ చేస్తున్న అరాచకం అని చెప్పి ఉంటే.. పాపం ఆయన కూడా ఏదో ఒక చర్య తీసుకునే వారే కదా.. కానీ.. అయితే తాను సీఎంగా ఉండగా.. తిరుపతి వచ్చిన అమిత్‌ షా పై రాళ్లు వేయించిన సంగతి చంద్రబాబుకు గుర్తుండే ఉంటుంది. ఒక వేళా ఆయన మర్చిపోయినా అమిత్‌ షా మరిచిపోరు. అందుకే తిరుపతిలో అమిత్‌ షా అపాయింట్‌ అడిగే ధైర్యం బాబు చేయలేదేమో..

మరింత సమాచారం తెలుసుకోండి: