ఇదంతా నాటి ముచ్చటగా కొట్టి పారెయలేం. ఎందుకంటే రాజకీయాలలో ఎప్పు డు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. కెసిఆర్ ప్రస్తుతం దేశ రాజకీయాలపై దృష్టి సారించి నట్లు ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. నాడు ఆయన వెన్నంటి ఉండి నడిచిన నటుడు ప్రకాశ్ రాజ్ తాజాగా కేసిఅర్ వెంట నడుస్తారా ? కెసిఆర్ ఉప ఎన్నిక ఓటమి తరువాత తన వ్యూహం మార్చారు. దూకుడు పెంచారు. అదే సమయంలో ఇటీవలి మా ఎన్నికల్లో పరాయజయం పాలయిన ప్రకాశ్ రాజ్ కూడా దూకుడుగా వ్యవహరించే అవకాశం లేకపోలేదు. ఇద్దరూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకులే. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించిన వారే. ఆ చట్టాలను వెనక్కి తీసుకున్న తరువాత ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు కూడా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుని సారి చెబితే సరిపోతుందా ? అని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. ఆయన మోడీ పై చేసిన వ్యాఖ్యలు విస్తృత ప్రచారం పొందాయి.