జగన్, కేసీఆర్.. ఇద్దరూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఈ ఇద్దరి పరిపాలనలో ఒక్కొక్కరిది ఒక్కో స్టయిల్.. ఏపీ సీఎం జగన్‌ సంక్షేమానికి పూర్తి ప్రాధాన్యత ఇస్తుంటే.. కేసీఆర్ అభివృద్ధి సంక్షేమం రెండూ రెండు కళ్లు అంటూ ముందుకు సాగుతున్నారు. అయితే.. కొన్ని విషయాల్లో ఒకరికి మరొకరు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇప్పుడు ఏపీలో ఉద్యోగస్తులకూ ప్రభుత్వానికి మధ్య కొన్ని రోజులుగా జగడం నడుస్తోంది. ఉద్యోగస్తుల జీతాల పెంపునకు కారణం అయ్యే పే రివిజన్ కమిషన్.. అదే పీఆర్సీ విషయంపై చిక్కుముడి వీడటం లేదు.


ఈ సమస్య మొదట్లో పరి‌ష్కారం అయినట్టే అనిపించినా.. ఆ తర్వాత పీటముడి పడింది. ఉద్యోగస్తుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా జగన్ సర్కారు ఏకంగా కొత్త పీఆర్సీకి అనుగుణంగా హెచ్‌ఆర్‌ఏలు నిర్ణయించడం కారణంగా ఇప్పుడు ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. అలాగే ఫిట్‌మెంట్‌ విషయంలోనూ ఉద్యోగస్తులు సంతోషంగా లేరు. మధ్యంతర భృతే 27 శాతంగా ఉంటే.. ప్రభుత్వం ఫిట్‌మెంట్‌ను 23 శాతానికి పరిమితం చేయడం అసంతృప్తి రగులుతోంది.


అయితే.. ఇప్పుడిప్పుడే ఉద్యోగులు కూడా దిగి వస్తున్నారు.. మొదట్లో ఫిట్‌మెంట్‌ కోసం పట్టుబట్టిన ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పుడు ఆ మధ్యంతర భృతి రేంజ్‌లోనైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మా జీతాలు పెంచకపోయినా పరవాలేదు.. కానీ.. తగ్గించేలా చేయకండి బాబూ అని వేడుకుంటున్నారు. అయితే.. ఈ విషయంలో మాత్రం జగన్ సర్కారు తగ్గడం లేదు. కోర్టుల్లో కేసులు పడతున్నా.. నో ప్రాబ్లమ్ అన్నట్టు దీమాగా ఉన్నారు.


అయితే.. ఈ విషయంలో జగన్‌కు కేసీఆర్ స్ఫూర్తిగా నిలిచారని కొందరు చెబుతున్నారు. గతంలోనూ కేసీఆర్ ఆర్టీసీ సమ్మె సమయంలో మొండిగా వ్యవహరించి.. చివరకు మా ఉద్యోగం మాకు ఇవ్వండి మహా ప్రభో అని కేసీఆర్‌ ను వేడుకున్నారు. బహుశా ఇప్పుడు జగన్ సర్కారు ప్రదర్శిస్తున్న కఠిన వైఖరికి స్ఫూర్తి కేసీఆర్ కావచ్చు కూడా అంటున్నారు కొందరు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: