ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో ఎలాంటి పరిస్ధితులు నెలకొన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌భుత్వంపై ఉద్యోగులు దండెత్తేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఒక్క‌రితో మొద‌లైన నిర‌స‌న‌.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా..అన్ని విభాగాల‌కు పాకింది. అన్ని సంఘాలు ఏక‌తాటిపైకి వ‌చ్చి.. ప్ర‌బు త్వానికి ఉద్య‌మ సెగ చూపిస్తామంటూ.. వ్యాఖ్యానాలు చేస్తున్నాయి.ఈ క్ర‌మంలోనే ప్ర‌ధాన‌మైన రెవెన్యూ, స‌చివాల‌య‌, ఉద్యోగ సంఘాలు కూడా ఏక‌తాటిపైకి వ‌చ్చాయి. త‌మ‌కు జ‌గ‌న్ ప్ర‌బుత్వం అన్యాయం చేస్తోం ద‌ని.. ప్ర‌బుత్వం ప్ర‌క‌టించిన పీఆర్సీ వ‌ల్ల త‌మ వేత‌నాలు త‌గ్గుతాయ‌ని.. ఉద్యోగులు చెబుతున్నారు.

అయితే.. ఇది అబ‌ద్ధ‌మ‌ని ముఖ్య‌మంత్రి స్వ‌యంగా చెప్పారు. దీనిపై కేబినెట్ స‌మావేశంలోనే ఆయ‌న చ‌ర్చించారు. ఉద్యోగులు అడిగిన‌వి.. అడ‌గ‌నివి.. కూడా ఇస్తున్నామ‌ని.. జ‌గ‌న్ చెబుతున్నారు. ఈ క్ర‌మంలో ఉద్యోగులు ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఆందోళ‌న చేస్తున్నార‌ని.. అయితే.. వారి ఆందోళ‌న‌కు ధీటుగా.. వాస్త‌వాలను ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లాల‌ని.. పార్టీ నేత‌ల‌కు జ‌గ‌న్ పిలుపునిచ్చారు. ప్ర‌భుత్వం ఏం చేసింది.. ఉద్యోగు లు ఏం చేస్తున్నారు ? అనే విష‌యాల‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్లాల‌ని ఆయ‌న సూచించారు.

అయితే.. ఇది జ‌రిగి.. మూడు రోజులు అయినా.. ఎక్క‌డా వైసీపీ నాయ‌కుల మాట‌వినిపించ‌డం లేదు. వారు ప్ర‌జ‌ల్లోకి వెళ్లిన దాఖ‌లాలు క‌నిపించ‌డం లేదు. దీంతో ఉద్యోగుల వాయిస్ వినిపిస్తోంది త‌ప్ప‌.. ప్ర‌భుత్వం సైడ్ నుంచి మాత్రం ఎవ‌రు ప్ర‌జ‌ల్లోకి వెళ్లిన‌ట్టు తెలియ‌డం లేదు. దీంతో ఇదే విష‌యంపై తాడేప‌ల్లి నుంచి స‌ల‌హాదారు స‌జ్జ‌ల ప‌లు జిల్లాల నాయ‌కులకు ఫోన్లు చేసి.. అస‌లు ఏం జ‌రిగింద‌ని ఆరా తీస్తున్నారు.

ముఖ్య‌మంత్రి స్వ‌యంగా ఆదేశించి మూడు రోజులైనా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌లేద‌ని.. ప్ర‌శ్నించారు. దీంతో కొంద‌రు నేత‌లు తాము ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు రెడీగానే ఉన్నామ‌ని.. కానీ.. లెక్క‌లు తెలియ‌డం లేద‌ని స‌మాధానం ఇచ్చార‌ట‌. ఈ ప‌రిణామంతో స‌జ్జ‌ల కూడా అవాక్క‌యిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి దీనిపై ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: