సీఎం జగన్ సొంత జిల్లా కడప జిల్లాలో అనూహ్యా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి..ఇప్పటివరకు జిల్లాలో వైసీపీకి తిరుగులేని పొజిషన్ ఉంది. అసలు జిల్లా మొత్తం వైసీపీ గ్రిప్‌లో ఉండే పరిస్తితి. జిల్లాలో 10 నియోజకవర్గాలు వైసీపీ చేతుల్లోనే ఉన్నాయి.. ఆ మాట‌కు వ‌స్తే అంత‌కు ముందు జ‌రిగిన మూడు ఎన్నిక‌ల్లో టీడీపీ ఎప్పుడూ ఒకే నియోజ‌క‌వ‌ర్గానికి ప‌రిమిత‌మై ఉండేది. గ‌త ఎన్నిక‌ల్లో అయితే ఆ ఒక్క సీటు కూడా టీడీపీకి రాలేదు. ఇక ఇక్కడ టీడీపీ బలపడటం చాలా కష్టమైన పని విశ్లేషణలు వస్తున్నాయి. కానీ అనూహ్యంగా వైసీపీపై కడప ప్రజలు సైతం విసుగెత్తిపోయినట్లు కనిపిస్తున్నారు. జిల్లాలో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు.

ఇప్పటికే జిల్లాలో వైసీపీకి వ్యతిరేకత పెరుగుతుంది. ఈ క్రమంలోనే జిల్లాలోని టీడీపీ నేతలు సైతం ఎఫెక్టివ్‌గా పనిచేయడం బాగా కలిసొస్తుంది. ఇప్పటికే జిల్లాలో ఉన్న మైదుకూరుపై టీడీపీ పట్టు సాధించింది. ఇక్కడ వైసీపీకి ధీటుగా టీడీపీ ఎదిగింది. పైగా వైసీపీ ఎమ్మెల్యేపై ప్రజా వ్యతిరేకత బాగానే కనిపిస్తోంది. అటు నియోజకవర్గంలో ఉన్న సీనియర్ నేత డీఎల్ రవీంద్రా రెడ్డి సైతం వైసీపీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. దీంతో నియోజకవర్గంలో వైసీపీ పరిస్తితి రివర్స్ అవుతుంది.

అటు ప్రొద్దుటూరులో కూడా వైసీపీపై వ్యతిరేకత వస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌లకు ఏ మాత్రం పడటం లేదు. ఈ లుకలుకలతో పార్టీకి బాగానే డ్యామేజ్ జరిగేలా ఉంది. ఇక్కడ టీడీపీ నేత ప్రవీణ్ వేగంగా పుంజుకుంటున్నారు. ఇక జిల్లాల విభజన రాజంపేట, రైల్వే కోడూరు ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా చేసింది...రాజంపేట పార్లమెంట్‌ని రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాగా మార్చారు.

అసలు అన్నమయ్య పుట్టిన గడ్డ రాజంపేటని వదిలేసి..రాయచోటిని కేంద్రంగా పెట్టడంపై రాజంపేట, కోడూరు ప్రజలు రగిలిపోతున్నారు. అసలు సొంత పార్టీ నేతలే వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యే పరిస్తితి వచ్చింది. ఈ నిర్ణయం మార్చుకోకపోతే...రాజంపేట, రైల్వే కోడూరుల్లో వైసీపీ దారుణంగా ఓడిపోవడం ఖాయమని సొంత పార్టీ నేతలే మాట్లాడుతున్నారు. ఇక్క‌డ జ‌గ‌న్ నిర్ణ‌యానికి సొంత పార్టీకి చెందిన నేత‌లే ఎదురు తిరుగుతున్నారు. ఏదేమైనా జ‌గ‌న్ నిర్ణ‌యాల‌తో కడప జిల్లాలో వైసీపీ హవా తగ్గుతుందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: