రష్యా అధ్యక్షుడు పుతిన్ పై ఆ దేశ సైన్యంలో అసంతృప్తి పెరుగుతోందా.. ఆయనపై సైన్యం తిరుగుబాటు చేసే అవకాశాలు ఉన్నాయా.. అసలే అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్న పుతిన్‌ పై సైన్యం తిరుగుబాటు చేస్తుందా.. ఈ ప్రశ్నలకు అవునని సమాధానం ఇస్తున్నాడో ఉక్రెయిన్‌ సైనికాధికారి. ఆయన పుతిన్‌ను ఉద్దేశించి సంచలన  వ్యాఖ్యలు చేశారు. పుతిన్ పై తిరుగుబాటు ప్రయత్నాలు ఇప్పటికే మొదలైనట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ నిఘా హెడ్ కిరిలో బుదనోవ్ అంటున్నారు.


ఈ తిరుగుబాటును ఎవరూ ఆపలేరని బుదనోవ్‌ చెబుతున్నారు. వచ్చే ఆగస్టులో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కీలక మలుపు తిరుగుతుందట. ఈ ఏడాది చివరికల్లా యుద్ధంలో రష్యా ఓడిపోతుందట. ఈ దెబ్బతో పుతిన్ అధికారం నుంచి వైదొలగక తప్పని పరిస్థితులు ఏర్పడుతాయట. ఇదంతా బుదనోవ్ వాదన. మొత్తం మీద ఈ ఏడాది చివరికల్లా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ముగుస్తుందని బదనోవ్ అంచనా వేస్తున్నాడు.


ఉక్రెయిన్ రక్షణ శాఖ నిఘా హెడ్ కిరిలో బుదనోవ్ ఇటీవల స్కై న్యూస్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ఈ కీలకమైన విషయాలు వెల్లడించాడు. యుద్ధంలో రష్యాకు ఎదురైన పరాభవం.. ఆ దేశంలో తీవ్ర రాజకీయ అలజడికి కారణం అవుతాయని ఉక్రెయిన్ రక్షణ శాఖ నిఘా హెడ్ కిరిలో బుదనోవ్ ఊహిస్తున్నాడు. ఈ అలజడి పరిణామాలు రష్యాలో అధికార మార్పిడికి కూడా దారి తీయవచ్చని ఉక్రెయిన్ రక్షణ శాఖ నిఘా హెడ్ కిరిలో బుదనోవ్ అంచనా వేస్తున్నాడు.


రష్యాలో ఇప్పటికే అధికార మార్పిడి ప్రక్రియ ఇప్పటికే మొదలైనట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ నిఘా హెడ్ కిరిలో బుదనోవ్ అంచనా వేస్తున్నాడు. ఇప్పటికే పుతిన్  బ్లడ్  క్యాన్సర్ తో పాటు అనేక ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ రక్షణ శాఖ నిఘా హెడ్ కిరిలో బుదనోవ్ చెబుతున్న కథనం కలకలం రేపుతోంది. అయితే ప్రత్యర్థిని ముప్పు తిప్పలు పెట్టేందుకు ఇలాంటి పిట్టకథలు ప్రచారం చేయడం కొత్తేమీ కాదని రష్యా మద్దతు దారులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: