తిరుపతి జిల్లాలో నిన్న సీఎం జగన్ అనేక పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. దాదాపు రూ.4 వేల కోట్ల పైచిలుకు పెట్టుబడి వచ్చే పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. వీటి వల్ల 20 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. వీటికి శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం, వికృతమాల గ్రామంలోని ఎలక్ట్రానిక్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌లో ఈ మూడు ప్రాజెక్టులను సీఎం జగన్ ప్రారంభించారు. అక్కడే మరో రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి కూడా సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.


అయితే.. ఈ కార్యక్రమాలు చాలా సైలంట్‌గా పెద్దగా హడావిడి లేకుండా సాగాయి.. ఈ కార్యక్రమాలు చూసినవారు.. గతంలో చంద్రబాబు హయాంలో జరిగిన హడావిడిని గుర్తు చేసుకుంటున్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏదైనా ఒక ప్రాజక్టును ప్రారంభించినా.. ఒక పరిశ్రమను ప్రారంభించినా మీడియాలో హడావిడి మామలుగా ఉండేది కాదు.. నాలుగైదు రోజుల ముందు నుంచే ఆ ప్రాజెక్టు గొప్పదనం గురించి ఆయన అనుకూల పత్రికలు, మీడియా ఛానళ్లు ఊదరగొట్టేవి.


సదరు కంపెనీల సీఈవోలతోనో.. ప్రతినిధులతోనే వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చేవారు..అవి అనుకూల పత్రికల్లో పతాకశీర్షికలు అయ్యేవి.. కానీ ఇప్పుడు అలాంటివేమీ జరగనే లేదు.. తిరుపతి జిల్లాలోని ‘ఎలక్ట్రానిక్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌లో సీఎం జగన్ ఈ మూడు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేసినా కార్యక్రం నిరాడంబరంగానే సాగింది. అక్కడే సీఎం మరో రెండు ప్రాజెక్టులకు ఫౌండేషన్‌ స్టోన్‌ వేసినా అంతా సింపుల్‌గానే సాగింది. ఇక్కడ టీసీఎల్‌ సంస్థ దాదాపు 1230 కోట్ల రూపాయల పెట్టుబడితో టీవీ ప్యానల్స్, మొబైల్‌ డిస్‌ప్లే యూనిట్స్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ను నెలకొల్పింది.


పరిశ్రమ ద్వారా 3200 మందికి ఉపాధినిచ్చే కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఈ సంస్థ ట్రయల్‌ రన్స్‌ ప్రస్తుతం జరుగుతున్నాయి. అయితే.. ఎంత హడావిడి చేసినా.. ఎంత సింపుల్‌గా చేసినా.. ఆ పరిశ్రమల ద్వారా నలుగురికి ఉపాధి దొరికితేనే ఫలితం ఉంటుంది. ‌ప్రచారాలతో ఫలితాలు వచ్చి పడవు అన్న విషయం జనం గమిస్తూనే ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: