ఏపీ ఉద్యోగులకు సీఎం జగన్ మరోసారి షాక్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల జీపీఫ్ ఖాతాల నుంచి డబ్బులు డెబిట్ అయిపోయాయని ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. ఎవరు మా డబ్బులు తీసుకున్నారో తెలియడం లేదని... గతంలోనూ ఇదే తరహాలో జరిగితే ఫిర్యాదు చేస్తే మళ్ళీ తిరిగి వేశారని వారు అంటున్నారు. నిన్న రాత్రి నుంచి మళ్లీ ఉద్యోగుల ఖాతాల నుంచి విత్ డ్రా చేసుకున్నట్టు ఉద్యోగులకు మెసేజ్ లు వచ్చాయట. ఈ విషయాన్ని ఏపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ మీడియాకు వెల్లడించారు.


తన వ్యక్తిగత ఖాతా నుంచి 83 వేల రూపాయలు తనకు తెలీకుండా విత్ డ్రా చేసేశారని ఏపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ  చెబుతున్నారు. పీఆర్సీ డీఏ అరియర్స్ జీపిఎఫ్ ఖాతాలకు జమ చేస్తానన్నారని.. గడచిన 6 నెలలుగా ఇచ్చిన డి ఏ అరియర్స్ ను మళ్ళీ వెనక్కు తీసుకున్నారని ఏపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ ఆరోపించారు. మొత్తం 90 వేల మంది ఉద్యోగుల కు చెందిన జీపి ఎఫ్ ఖాతాల నుంచి 800 కోట్ల వరకు వెనక్కు తీసుకున్నారని ఏపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ తెలిపారు.


ఈ విషయంపై ఆర్థిక శాఖ కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే అధికారులు అందుబాటులో లేరని ఏపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ అన్నారు. ఈ తరహా ఘటనలు  ప్రభుత్వానికి తెలిసే జరుగుతున్నాయా లేదా అన్నది అర్థం కావడం లేదన్నారు. ఇది ఉన్నతాధికారుల తప్పిదమా.. లేక సర్కారు నిర్ణయమా అన్నది తెలియడం లేదని ఏపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ  అన్నారు.


అసలు ఉద్యోగుల సమ్మతి లేకుండా తమ ఖాతాల నుంచి సొమ్ము విత్ డ్రా చేయడం ఏంటని..ఇది కచ్చితంగా నేరమని ఏపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ  మండిపడ్డారు. నిపై రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తామని ఏపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ  తెలిపారు. ఈ అంశంపై లోతైన విచారణ జరగాలని సూర్యనారాయణ డిమాండ్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: