పోలవరం ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతూ ఇటీవల పోలవరం ప్రాజెక్టు అథారిటీ కొన్ని రోజుల క్రితం రిపోర్ట్ ఇచ్చింది. ఆ తర్వాత తాజాగా ఐఐటీ హైదరాబాద్‌ నిపుణుల కమిటీలు కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. ఇప్పుడు ఈ తాజా నివేదికపై సీఎం జగన్ రెడ్డీ ఇప్పుడేం సమాధానం చెబుతారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. పోలవరం పరిహారంపై గతంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని చంద్రబాబు నిలదీశారు.


పోలవరం పాపంలో అన్ని వేళ్లూ జగన్ వైపే చూపుతున్నాయని టీడీపీ బాస్ చంద్రబాబు మండిపడుతున్నారు.... ఇప్పుడు జగన్ ఏం సమాధానం చెబుతారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. పార్టీ ముఖ్యనేతలతో నిన్న జరిగిన వ్యూహ కమిటీ సమావేశంలో టీడీపీ బాస్ చంద్రబాబు పలు అంశాలపై చర్చించారు. పోలవరాన్ని బలిపెట్టింది వైసిపి ప్రభుత్వమే అనే విషయాన్ని టీడీపీ మొదటి నుంచి చెబుతోందని...తాజా నివేదికల ద్వారా అదే నిజమని తేలిందని చంద్రబాబు అంటున్నారు.


పోలవరం నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యూహం, సమన్వయం లేదని కేంద్రం తేల్చి చెప్పిన విషయాన్ని టీడీపీ బాస్ చంద్రబాబు గుర్తు చేశారు. 2020లో పూర్తి కావాల్సిన పోలవరం...2024కు వెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని కేంద్రం పార్లమెంట్ లోనే చెప్పిందని టీడీపీ బాస్ చంద్రబాబు అన్నారు. ఇప్పుడు హైదరాబాద్ ఐఐటి నిపుణులు బృందం కూడా రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాల కారణంగానే పోలవరంలో విధ్వంసం జరిగిందని తేల్చారని టీడీపీ బాస్ చంద్రబాబు వివరించారు.


పోలవరం కాంట్రాక్టర్ ను మార్చవద్దని పీపీఏ, కేంద్ర జలనరుల శాఖ రాసిన లేఖలను, చేసిన హెచ్చరికలను నాడు జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని టీడీపీ బాస్ చంద్రబాబు విమర్శించారు. గోదావరి వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం అలసత్వo, వైఫల్యo ప్రదర్శించిందనిటీడీపీ బాస్ చంద్రబాబు తీవ్రంగా తప్పు పట్టారు. 2014తో తన ప్రయత్నం కారణంగా ఏపీలో చేరిన పోలవరం విలీన గ్రామాలు...ఇప్పుడు ఈ ప్రభుత్వ వైఖరితో మళ్లీ తెలంగాణలో కలపాలనే డిమాండ్ చేస్తున్నాయని టీడీపీ బాస్ చంద్రబాబు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: