ఎన్టీఆర్ పేరు మార్పు వివాదంపై మంత్రి విడదల రజని ఘాటుగా స్పందించారు. ఈ విషయాన్ని చంద్రబాబు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఆమె ఏమన్నారంటే..
 
"చంద్రబాబు మెడికల్ కాలేజీలపై ఏదేదో మాట్లాడుతున్నాడు.. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తానే తీసుకొచ్చినట్లు చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు.. విభజన చట్టం ప్రకారం ఎయిమ్స్ ఏర్పాటు చేశారు. ఎయిమ్స్ ఏర్పాటుపై చంద్రబాబు పట్టించుకోలేదు.. విభజనచట్టం ప్రకారం ఎయిమ్స్ ఇవ్వాలని‌ సీఎం జగన్ కేంద్రంపై వత్తిడి తీసుకొచ్చి సాధించారు.. నెల్లూరు మెడికల్ కాలేజీ అప్పటి‌ సీఎం వైఎస్సార్ చొరవతో వచ్చింది.. రిబ్బన్ కట్ చేసినంత మాత్రాన చంద్రబాబు నెల్లూరు కాలేజీ తెచ్చినట్లా.. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను తీసుకొచ్చేందుకు సీఎం జగన్ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారు" అన్నారు.


మంత్రి విడదల రజని ఇంకా ఏమన్నారంటే..” పద్మావతి ఉమెన్స్ మెడికల్ కాలేజీ ఏర్పాటులో‌ కూడా వైఎస్సార్ కృషితోనే ఏర్పాటయ్యింది.. చంద్రబాబు హయాంలో ఎందుకు‌ కొత్త మెడికల్ కాలేజీలు ఎందుకు తీసుకురాలేదు.. సిద్దార్ద మెడికల్ కాలేజీని ఎన్టీఆర్ హయాంలో ఏర్పాటు చేశారు.. 13 ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు చంద్రబాబు అనుమతి ఇచ్చారు.. ప్రైవేటు వ్యక్తులను ప్రోత్సహించారే తప్ప ప్రభుత్వ మెడికల్ కాలేజీల‌ ఏర్పాటుకు చంద్రబాబు ఆలోచించలేదు.. వైద్యరంగాన్ని బలోపేతం చేసే చర్యలు చేపట్టాం" అని మంత్రి విడదల రజని వివరించారు.  


" ప్రజల వైద్య అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సీఎం జగన్  అనుమతిచ్చారు. ఇందుకోసం ఏడువేలకోట్లు ఖర్చు చేసేందుకు‌ సిద్దమయ్యారు.. నాడు వైఎస్సార్ రాష్ట్రానికి మూడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే సీఎం జగన్ మూడేళ్లలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు.. ఆరోగ్యశ్రీతో పేదలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు.. వైఎస్ఆర్ సేవలను భావితరాలకు తెలియచేసేందుకే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు చేశాం.. సీఎం జగన్ కు ఎన్టీఆర్ అంటే గౌరవం ఉంది.. అందుకే కొత్త జిల్లాకు‌ ఎన్టీఅర్ పేరు పెట్టారు"  అంటూ మంత్రి విడదల రజని వివరణ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: