మంగళగిరిలోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్ సంస్థలో సౌకర్యాలు లేవంటూ ఇటీవల చంద్రబాబు విమర్శించడంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. ఎయిమ్స్ పై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారన్న ఆమె.. ప్రతిష్ఠాత్మక సంస్థ ఎయిమ్స్ 2019 మార్చిలో మంగళగిరిలో ప్రారంభం అయ్యిందన్నారు. మంగళగిరి తాడేపల్లి మున్సిపాలిటీ నుంచి 2.3 లక్షల లీటర్ల నీరు ఇస్తున్నామని.. అదనంగా కోరిన 3 లక్షల లీటర్ల నీటిని ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని వివరించారు.


నీటి కొరత లేకుండా తాత్కాలిక వ్యయం ఏపీ వైద్యారోగ్య శాఖ నిధుల నుంచి భరిస్తున్నామని తెలిపిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని.. రోజుకు 25 లక్షల లీటర్ల నీటిని శాశ్వత ప్రాతిపదికన ఇచ్చేందుకు కూడా జీవో జారీ చేశామని గుర్తు చేశారు. 7.70 కోట్ల తో బిడ్డింగ్ కు వెళ్లాం టెండర్ ప్రక్రియ పూర్తి చేశామని.. ఎయిమ్స్ కు రెండు వైపులా రహదారి కనెక్టివిటీ , వీధి లైట్ లు 10 కోట్లు ఖర్చు చేశామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు.


ఇప్పటికే 132 కే వి విద్యుత్ సామర్ధ్యం తో సరఫరా కూడా వైసిపి ప్రభుత్వం చేసిందని వివరించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని.. డంప్ యార్డు కూడా నిలిపి వేశామని.. ఎయిమ్స్ కు అవసరం అయిన మౌలిక సదుపాయాలు రాష్ట్ర  కల్పిస్తోందని గుర్తు చేశారు. అదనపు నీటి డిమాండ్ కు అవసరం అయ్యే వ్యయం అంతా ఏపీ ప్రభుత్వమే భరిస్తుందని.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని వివరించారు.

 

తాము తీసుకొచ్చిన ఎయిమ్స్‌కు జగన్ సర్కారు కనీసం నీటి వసతి కూడా కల్పించడం లేదని ఇటీవల చంద్రబాబు మండిపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. దీనిపై వైద్య ఆరోగ్య మంత్రి విడదల రజని వివరణ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: