గెలుపు మనకున్న బలాన్ని రెట్టింపు చేస్తుంది. ఓటమి మనకున్న ఒరిజినల్ బలాన్ని సైతం సగానికి తగ్గిస్తుంది. అందుకే.. ఓటమి వేళ ఉన్న బలాన్ని మరింత పెంచుకోవాల్సి ఉంటుంది. గెలుపు వేళ ఉండే అడ్వాంటేజ్.. ఓటమి సమయంలో ఉండదనే విషయాన్ని మనం మరిచిపోకూడదు. ఓటమి వేళ టైం సైతం మనకు అనుకూలంగా ఉండదు.  అందుకే ఆచితూచి వ్యవహరించాలి.


ప్రస్తుతం వైసీపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది. ఆ పార్టీ కార్యకర్తలు, క్యాడర్ కకావికలం అవుతోంది.  పార్టీ ఓటమిపై వైసీపీ అధినేత కోలుకోలేకపోతున్నారు. ఇప్పుడిప్పుడే పార్టీ ముఖ్యులతో ఓటమిపై పోస్టు మార్టం చేస్తున్నారు.  టీడీపీ గెలుపు తర్వాత వైసీపీ కార్యకర్తలపై, నాయకుల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయి.  దీంతో పార్టీ క్యాడర్ బిత్తరపోతోంది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉండిపోయింది.


దీంతో పార్టీలో వలసలు పెరిగే అవకాశం ఉంది. టీడీపీని క్షేత్ర స్థాయిలో బలహీనం చేశానని భావించిన జగన్.. ఆ చర్యలు టీడీపీకి మరింత బలాన్ని చేకూర్చాయి అనే విషయాన్ని గ్రహించలేకపోయారు. అదే సందర్భంలో వైసీపీ ఏలుబడిలో టీడీపీ కార్యకర్తలపై దాడులు జరిగితే పార్టీ అధిష్ఠానం అండగా నిలబడింది.  ఎవరిపైనైనా దాడి జరిగితే సోషల్ మీడియా దగ్గర నుంచి పోలీస్ కేసుల వరకు వారికి అండగా నిలిచింది. పార్టీ నాయకులు, ముఖ్య నేతలు, చంద్రబాబు, నారా లోకేశ్ లు వచ్చి పరామర్శించేవారు. దీంతో పార్టీలో ఆత్మస్థైర్యం నెలకొంది.


ఇప్పుడు వైసీపీ కార్యకర్తలకు టీడీపీ మాదిరి మద్దతు కొరవడింది. ఎవరు దాడులకు గురవుతున్నారో.. వారికి ఎలా చేయూత నివ్వాలో అర్థం కానీ స్థితిలో పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు. మొత్తంగా చూస్తే టీడీపీని నమ్ముకుంటే చంద్రబాబు తోడు ఉన్నారు.. వైసీపీని నమ్ముకుంటే ఎవరూ తోడు లేరు అనే భావనకు ఆ పార్టీ కార్యకర్తలు వచ్చేస్తున్నారు. ఇది వైసీపీ భారీ నష్టం చేకూర్చే అవకాశం ఉంది. గెలిచిన సమయంలో మమ్మల్ని పక్కన పెట్టారు అని వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఫీల్ అవుతున్నారు. ఇప్పటికే కుటుంబం దూరం అయింది. రేపు క్యాడర్ దూరం అయితే జగన్ ఒంటరి అవుతారు. ఇది జగన్ కి రాబోయే అతి పెద్ద కష్టం.

మరింత సమాచారం తెలుసుకోండి: