పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఇటీవల చైనా పర్యటనకు వెళ్లారు. ఇందులో భాగంగా ఆయన ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్ పింగ్, చైనా ప్రీమియర్ లీ కియాంగ్ లతో తో భేటీ అయ్యారు. ఈ పర్యటన ముగింపు సందర్భంగా పాక్, చైనాలు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. దక్షిణాసియా ప్రాంతాంలోని కశ్మీర్ సహా అన్ని వివాదాస్పద అంశాలపై ఏకపక్ష చర్యలను అంగీకరించేది లేదని పేర్కొంటూ ఆ ప్రకటనలో ఇరు దేశాలు తెలియజేశాయి.


దక్షిణాసియాలో శాంతి, సుస్థిరతల స్థాపనక కలిసికట్టుగా ప్రయత్నాలు చేస్తామన్న పాక్,  చైనాలు వెల్లడించాయి. ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం కశ్మీర్ అంశాన్ని శాంతియుతంగా ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న తమ సూచనను ఈ సందర్భంగా చైనా పునరుద్ఘాటించింది.


అయితే రెండు దేశాల అధినేతలు కలిసినప్పుడు ద్వైపాక్షిక అంశాలు, లేదా అంతర్జాతీయ అంశాలు చర్చిస్తారు. కానీ వీరు జమ్మూ కశ్మీర్ గురించి చేసిన కామెంట్లు చేయడంతో భారత్ ఘాటుగానే రిప్లై ఇచ్చింది.  మా కశ్మీర్ పై మీ పెత్తనం ఏంటి అని రెండు దేశాలకు కలిపి వడ్డించింది. జమ్మూ కశ్మీర్ తో పాటు లద్దాఖ్ కూడా భారత్ లో భాగమే అని.. ఈ అంశంపై ఏ దేశానికి మాట్లాడే హక్కు లేదని హెచ్చరించింది.


అయితే చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వస్తోంది. దీనిని మన దేశం అంతర్గత ప్రదేశంగా పరిగణిస్తోంది. ఈ సీపీఈసీను భారత్ వ్యతిరేకిస్తోంది.  ఆ నేపథ్యంలో తమ పని కావాలనే ఉద్దేశంతో చైనా కశ్మీర్ విషయంలో భారత్ కు ఉచిత సలహాలు ఇస్తోంది. మరి వీరి భేటీలో బెలూచిస్తాన్ ప్రస్తావన ఎందుకు రాలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. జమ్మూ కశ్మీర్ అనేది భారత్ లో అంతర్బాగం. దీని గురించి చర్చించి నిర్ణయం తీసుకునే హక్కు భారత ప్రభుత్వానికి ఉంది. ఇందులో ఇతర దేశాల జోక్యం అవసరం లేదు. ఇది భారత అంతరంగిక విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి: