టీడీపీలో అయ్యన్నపాత్రుడు ఒక ఫైర్ బ్రాండ్. పార్టీ పవర్ లో ఉన్నా లేకపోయినా.. బలమైన వాయిస్ వినిపించడంలో ఆయన ముందుంటారు. ఈ ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవి ఆశించారు. కానీ ఆయనకు దక్కలేదు. జానియర్లకు పెద్దపీట వేశారు. దీంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు అనే వార్తలు వచ్చాయి. అలాంటిదేమీ లేదని ఆయన తేల్చి చెప్పారు.


ఎన్టీఆర్ హయాంలోనే తాము మంత్రి పదవులు పొందామని అప్పుడు సీనియర్లుగా ఉండేవారు బాధపడ్డారా అంటూ పార్టీ అధిష్ఠానంపై విధేయత చూపారు. ప్రస్తుతం ఆయనకు అసెంబ్లీ స్పీకర్ పదవి ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదిలా ఉండగా.. జగన్ బాధితుల్లో అయన్న పాత్రుడు కూడా ఒకరు. ఆయన్ను ప్రత్యేకించి వైసీపీ నాయకులు టార్గెట్ చేసినా బెదరలేదు.  తాజాగా ఆయన మాట్లాడిన ఒక వీడియో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.


ఆయన ఏం అన్నారంటే.. జగన్ విషయంలో టీడీపీ జాగ్రత్తగా ఉండాలి.  ఆయనకు జన, కులం, బలం తగ్గలేదు.  అందుకే వైసీపీని పూర్తిగా పెకిలించే వరకు నిద్రపోకూడదని సూచిస్తున్నారు. జగన్ కేవలం ఓడిపోయారని.. కానీ చావలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. చచ్చేదాకా కొట్టాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు విడిచిపెట్టినా తాను కొందరిని విడిచిపెట్టనని.. తనను ఇబ్బంది పెట్టిన అధికారులను వివరాలను రాసుకున్నామని ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలను వేధించిన పోలీసులను వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.


జగన్ కు తెలంగాణ ప్రభుత్వంలో కొందరు మిత్రులు ఉన్న విషయాన్ని అయ్యన్న గుర్తు చేయడం విశేషం. నేటికి జగన్ దగ్గర అపారమైన ధనం ఉంది. దాంతో ఎవరినైనా కొనేయగలరు. కుల బలం ఉంది. దానిని ఆయన తెలివిగా వాడుకోగలరు. నేటికి ప్రజల్లో ఆయనకు సానుభూతి మద్దతు ఉంది. వారిని కూడా జగన్ వాడేసుకుంటారు. బల్లి ప్రాణానికి ప్రమాదం ఏర్పడినప్పుడు ఏ విధంగా తన తోకని తెంచేసుకొని తప్పించుకుంటుందో అదే విధంగా జగన్ కూడా ఏదో విధంగా బయట పడే ప్రయత్నం చేస్తారు కనుక చంద్రబాబు ఇప్పుడు శత్రు శేషంతో పాటు రుణ శేష భారం నుంచి కూడా విముక్తి పొందాల్సి ఉంది అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: