హైదరాబాద్‌లో కొన్ని రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులు నిబంధనలను గాలికి వదిలేస్తున్నాయి. తాజాగా 'రెరా' నిబంధనలు ఉల్లంఘించిన సోనెస్టా ఇన్ఫినిటి, హస్తినా రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు షోకాజ్ నోటీసులు జారీచేసినట్లు రెరా అథారిటీ తెలిపింది. సొనెస్ట్గా ఇన్ఫినిటీ ప్రమోటర్, గచ్చిబౌలి కేర్ హాస్పిటల్ వెనుక ఉన్న జయభేరి పైన్ కాలనీలో స్కై విల్లాస్ నిర్మాణాలకు 'రెరా' రిజిస్ట్రేషన్ పొందకుండా సోషల్ మీడియా ద్వారా బ్రోచర్ విడుదల చేసి ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం, అదే విధంగా హస్తినా రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్స్ "బ్రిస్సా” ప్రాజెక్టు పేరుతో శ్రీశైలం హైవే సమీపములోని కడ్తాల్ టౌసు ఫార్మా సిటీ వద్ద 'రెరా' రిజిస్ట్రేషన్ పొందకుండా సోషల్ మీడియా ద్వారా బ్రోచర్ విడుదల చేసి వెబ్సైట్, సోషల్ మీడియా ద్వారా ప్రజలను, కొనుగోలుదారులను ఆకర్షించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం 'రెరా' అథారిటి దృష్టికి వచ్చినందున సదరు ప్రాజెక్టులకు షోకాజ్ నోటీసు జారీ చేసి వారం రోజులలోగా సంజాయిషి సమర్పించాలని ఆదేశించినట్లు రెరా అథారిటీ తెలిపింది.


'రెరా చట్టంలోని 3(1), 4(1) నిబంధనల ప్రకారం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, ఏజెంట్లు తప్పనిసరిగా తమ ప్రాజెక్టులను 'రెరా' లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, లేనిచో సదరు ప్రాజెక్టులు నిబంధనలు ఉల్లంఘించినట్లు భావించి సెక్షన్ 59 ప్రకారం అపరాధ రుసుము విధించడంతోపాటు క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు 'రెరా' అథారిటీకి అధికారం ఉన్నట్లు రెరా అథారిటీ పేర్కొంది. ఇండ్లు, ఫ్లాట్లు కొనుగోలు చేయదలచినవారు 'రెరా' రిజిష్టర్డ్ ప్రాజెక్టులలో మాత్రమే కొనుగోలు చేయాలని, ప్రీలాంచ్ ఆఫర్లు, మోసపూరిత ప్రకటనలు నమ్మి మోసపోరాదని రెరా అథారిటీ విజ్ఞప్తి చేసింది.


'రెరా' నిబంధనలు ఉల్లంఘించిన రియల్టర్స్, భవన నిర్మాణదారులపై వాట్సాప్ 9000006301, ఫోన్ 040-29394972 లతో పాటు rera-maud@telangana.gov.in, secy-rera-maud@telangana.gov.in email id కి ఫిర్యాదు చేయాలని రెరా అథారిటీ తెలిపింది. 'రెరా' అథారిటీ ఆమోదంతో TG-RERA Secretary ఈ ప్రకనట జారీ చేసింది. అందుకే హైదరాబాద్‌లో ఇళ్లు కొనేవారు ఇలాంటి విషయాలను పరిగణలోకి తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: