మరుసటి రోజు హాస్పిటల్ లో వేరొక అమ్మాయి చనిపోయింది. మొత్తం ముగ్గురు పిల్లలు చనిపోయారు. కాగా.. గాయాలు అయిన తొమ్మిది మంది పిల్లల్లో ఆరుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఇదే సమయంలో పిల్లలను రక్షించాలని ప్రయత్నించిన మరో ఇద్దరి స్త్రీలకు గాయాలు అయ్యాయి. పాపం చిన్న పిల్లలు.. రక్తమోడుతున్న గాయాలతో బయటకు వస్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్న వారు ఆ రక్తం ఆపడానికి తువ్వాళ్లతో పట్టుకొని అక్కడికి పరిగెత్తారు.
17 ఏళ్ల వయసున్న నిందితుడిని పోలీసులు వెంటనే పట్టుకున్నా వాడి వివరాలు వెల్లడించలేదు.. వాడు ఈ దారుణం ఎందుకు చేశాడో చెప్పడం లేదు. దాంతో సోషల్ మీడియాలో అతడిని ముస్లిం వ్యక్తిగా పేర్కొనడం.. వెంటనే స్థానిక ప్రజలు మసీదుపై రాళ్లు రువ్వడం వంటి దాడులు చేశారు. దీంతో పాటు మసీదు దగ్గర్లోని వాహనాలను తగులపెట్టారు. భారీ ఎత్తున పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
లంకాషైర్ లోని బ్యాంక్ ల ప్రాంతం నుంచి వచ్చిన ఆ నిందితుడు మైనర్ కావడంతో పోలీసులు వివరాలు వెల్లడించలేదు. ఇతర పూర్తి వివరాలు చెప్పడానికి అక్కడి కోర్టులు అంగీకరించవు. మొత్తం మీద అతనిపై పిల్లల హత్యా నేరం మోపారు. ఈ ఘటన బ్రిటన్ ని కుదిపేసింది. ఇనఫ్ ఈజ్ ఇనఫ్ జరిగింది చాలు అనే ప్రదర్శనలో కొన్ని వందల మంది ప్రదర్శన కారులు చేరి డౌనింగ్ స్ర్టీట్ వైపు మంటల సీసాలు విసిరేశారు. వారంతా మా దేశం మాకు కావాలి అంటూ నినాదాలు చేయడం మొదలు పెట్టారు. అలాగే రాత్రిపూట కొన్ని కార్లకు నిప్పు పెట్టి కొంత విధ్వంసం సృష్టించారు. మొత్తం మీద బ్రిటన్ అల్లర్లతో అట్టుకుడుతోంది.