ఒక చోట ఆహార కొరత, మరో చోట రాజకీయ అస్థిరత… ఇంకో చోట ఆర్థిక సంక్షోభం.. ఇలా నలు దిక్కులా ఏదో ఒక సంక్షోభం.. శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. అశాంతి అంతకంతకు పెరుగుతోంది. ప్రజల్లో ఆరోగ్యం కట్టలు తెంచుకుంటుంది. జనాగ్రహానికి భయపడి పాలకులు దేశం వదిలి పారిపోతున్నారు. ఇలా ఒక్క దేశంలో కాదు. మన చుట్టూ ఉన్న దేశాల్లో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.


సరిగ్గా రెండేళ్ల క్రితం శ్రీలంకలో అక్కడి అధ్యక్షుడు మహీంద్ర రాజపక్సే కుటుంబంతో సహా పారిపోతే ప్రపంచం మొత్తం ఆశ్చర్యంగా చూసింది. సరిగ్గా రెండేళ్ల క్రితం బంగ్లా ప్రధాని హసీనా దేశం విడిచి వెళ్లిపోవడం దిగ్భ్రాంతిని కలిగించింది. ఇక పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే మగ్గుతున్నారు. మనకు పొరుగున ఉన్న నిత్యం ఏదో ఒక వివాదంతో రగులుతూనే ఉంది.


పాకిస్థాన్, శ్రీలంక, అఫ్గానిస్తాన్, మయన్మార్, నేపాల్, బంగ్లాదేశ్ దేశాలతో రాజకీయ సంక్షోభాలు నెలకొన్నాయి. సామాజికంగా, ఆర్థికంగా  ఆ దేశాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. అయితే ఈ అంశాలను నిశితంగా పరిశీలిస్తే.. భారత్ అనుకూల వ్యవస్థలను చైనా నాశనం చేస్తోంది. మనం సాధిస్తున్న ప్రగతిని ఓర్వలేని చైనా.. కుట్రలు పన్నుతోంది. ప్రస్తుతం అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగింది. రాబోయే రోజుల్లో టాప్-3 లోకి వెళ్లే అవకాశం ఉంది.


అయితే ఆసియాలో తామే అగ్రదేశంగా చెలామణీ అవ్వాలి.. మిగతా దేశాలన్నీ తమ చెప్పు చేతల్లో ఉండాలని డ్రాగన్ దేశం భావిస్తోంది. మన దేశం కూడా వారి నియంత్రణలోకి రావాలని చూస్తోంది. అందుకే మన చుట్టూ ఒక వల అల్లింది. సరిహద్దు దేశాల్లో ఏదో ఒక సంక్షోభాన్ని సృష్టించింది. శ్రీలంక అలా అవ్వడానికి కారణం చైనానే. పాకిస్థాన్ ను తమ చెప్పు చేతల్లో ఉండేలా చూసుకుంది. ఇక నేపాల్ లో ప్రతి రెండేళ్లకోసారి తమ అనుకూల ప్రభుత్వాలను ఏర్పాటు చేయిస్తోంది. మాల్దీవులు అధ్యక్షుడిగా తమకు అనుకూలమైన వ్యక్తిని ఎంపిక చేసింది. ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా తాము అనుకున్నది సాధించింది. ఇప్పుడు వీరందరి ద్వారా భారత్ ను ఇరుకున పెట్టి.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి.. దేశంలో అస్థిరత కోసం యత్నిస్తోంది. మరి భారత్ దీనిని ఎలా తిప్పికొడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: