ఇటీవల  పాకిస్థాన్ కు ఇంటా బయట వరుస దెబ్బలు బాగా తగులుతున్నాయి. తనది కాని భూమి డబ్బుపై తనదైన శైలి వాదనలు చేస్తూ వస్తున్న పాక్ కు ఇప్పటికే చాలా దెబ్బలు తన ఖాతలో ఉన్నాయి. తాజాగా మన హైదరాబాదీ మాజీ పాలకులు - నిజాం నవాబుల కుటుంబానికి చెందిన భారీ ధనాగారాన్ని కొట్టేసేందుకు ప్రయత్నం చేసిన పాక్ వాళ్ళ పప్పులు మాత్రం  ఉడకలేదు. బ్రిటన్ లో ఎన్నో సంవత్సరాలుగా సాగిన ఈ వివాదంలో నిజాం ఫ్యామిలీకి భారీ ఊరటనిచ్చే తీర్పును  బుధవారం వెల్లడ చేసింది. ఈ తీర్పుతో నిజాం వారసులుగా ఉన్న ముఖరం ఝా సోదరులకు ఏకంగా రూ.306 కోట్ల మేర నిధులు చేతికి వచ్చాయి.ఈ తీర్పుతో పాక్ చాల పెద్ద షాక్ కి గురిఅయినది.

ఇక అసలు కేసు ఏమిటి అనే విషయానికి వస్తే... 1947లో భారత్ కు బ్రిటిష్ పాలనను నుంచి విముక్తి లభించిన విషయం తెలిసిందే కదా.. హైదరాబాద్ సంస్థానాన్ని ఇటు భారత్ లో విలీనం చేయడానికే కాకుండా పాక్ లో కలిసేందుకు కూడా నిర్ణయం తీసుకోని నిజాం నవాబు... హైదరాబాద్ ను ప్రత్యేక సంస్థానంగానే కొనసాగించారు అప్పటిలో. అప్పటిలో నిజాం నవాబు మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన వద్ద ఉన్న 1 మిలియన్ పౌండ్ల (దాదాపుగా రూ.8.7 కోట్ల) మొత్తాన్ని బ్రిటన్ లోని వెస్ట్ మినిస్టర్ బ్యాంకులో పాక్ హైకమిషనర్ పేరిట ఉన్న బ్యాంకు ఖాతాలో వేశారు.

 హైదరాబాద్ సంస్థానాన్ని పాక్ లో కలిపేస్తానన్న భావనతోనే ఆయన ఆ నిధులను పాక్ హైకమిషనర్ ఖాతాలోకి బదిలీ కూడా  చేశారు అప్పుడు. అయితే ఆ తర్వాత హైదరాబాద్ ను భారత ప్రభుత్వం తనలో విలీనం కాలేదు.. ఆ నిధులు తమకు చెందినవేనని వాటిని తమకే ఇవ్వాలని నిజాం వారసులు డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారం బ్రిటన్ కోర్టుకు చేరింది.

కోర్టుకు చేరిన ఈ వివాదం 1948 నుంచి నిన్నటిదాకా అటువంటి మార్పు లేకుండా అలానే ఏళ్ల తరబడి కొనసాగింది. ఈ క్రమంలో విచారణల మీద విచారణలు కూడా కోసాగాయి.మొత్తానికిఈ తీర్పుతో నిజాం వారసులైన ముఖరం ఝా సోదరులకు రూ.306 కోట్ల నిధులు చేతికందనున్నాయి అని తెలిపింది  బ్రిటన్ కోర్టు. 


మరింత సమాచారం తెలుసుకోండి: