బీహెచ్‌ఈఎల్ (భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 145 ఇంజనీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి ధరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా. మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్ విభాగాలలో పోస్టులు భర్తీ చేయనున్నారు.

.Image result for bharat heavy electricals limited logo

విభాగాల వారీ ఖాళీలు:  మెకానికల్-40, ఎలక్ట్రికల్-30, సివిల్-20, కెమికల్-10, హెచ్‌ఆర్-20, ఫైనాన్స్-25.

అర్హత: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి ఇంజనీరింగ్/టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ/డ్యూయల్ డిగ్రీ, పీజీ, డిప్లొమా, సీఏ, ఐసీడబ్ల్యూ/సీఎంఏ ఉత్తీర్ణత.

వయసు: పోస్టులను బట్టి 2019, ఏప్రిల్ 1 నాటికి 27-29 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ (ఎన్‌సీఎల్)లకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; పీహెచ్‌సీలకు పదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.300; మిగిలిన వారికి రూ.800. జీఎస్టీ అధనం. 

దరఖాస్తుకు చివరితేదీ: మే 6, 2019.

దరఖాస్తు ఫీజు చెల్లించుటకు చివరితేదీ: మే 8, 2019.

పరీక్ష తేదీలు:  2019, మే 25, 26 తేదీల్లో జరుగుతాయి.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్:  www.bhel.com


మరింత సమాచారం తెలుసుకోండి: